నేపాల్: ముక్తినాథ్‌ ఆలయాన్ని సందర్శించిన మోదీ

రెండు రోజుల పర్యటన నిమిత్తం శుక్రవారం ప్రధాని మోదీ నేపాల్‌కు వెళ్లిన సంగతి తెలిసిందే.

Last Updated : May 12, 2018, 10:28 AM IST
నేపాల్: ముక్తినాథ్‌ ఆలయాన్ని సందర్శించిన మోదీ

రెండు రోజుల పర్యటన నిమిత్తం శుక్రవారం ప్రధాని మోదీ నేపాల్‌కు వెళ్లిన సంగతి తెలిసిందే. పర్యటనలో భాగంగా ఆయన నేడు ముక్తినాథ్‌ ఆలయాన్ని సందర్శించారు. ముక్తినాథ్‌ ఆలయంలో మోదీ ప్రత్యేక పూజలు, ప్రార్థనలు నిర్వహించారు. సంప్రదాయ డోలును వాయించారు. మోదీ శనివారం పసుపతినాథ్‌ ఆలయాన్ని కూడా సందర్శించనున్నారు. పసుపతినాథ్‌లోని శివుడు జ్యోతిర్లింగ స్వరూపుడు.

 

 

 

రెండురోజుల షెడ్యూల్‌లో భాగంగా శుక్రవారం నేపాల్ కు చేరుకున్న ఆయన తొలుత జనక్‌పూర్‌లోని జానకీ ఆలయాన్ని సందర్శించారు. అనంతరం సీతాదేవి జన్మస్థలమైన నేపాల్‌లోని జనక్‌పూర్‌ నుంచి రాముడి జన్మస్థలమైన భారత్‌లోని అయోధ్యకు బస్సు సర్వీసులను భారత ప్రధాని నరేంద్ర మోదీ, నేపాల్‌ ప్రధాని కెపి శర్మ ఓలి జనక్‌పూర్‌లో జెండా ఊపి ప్రారంభించారు. సీతాదేవి జన్మ స్థలాన్ని దర్శించుకోవాలన్న తన చిరకాల వాంఛ నేటికి నెరవేరిందని ప్రధాని మోదీ ఈ సందర్భంగా పేర్కొన్నారు. తాను ఈ రోజు ఎంతో సంతోషంగా ఉన్నాననీ, తనకీ అవకాశం దక్కినందుకు భగవంతుడికి సదా కృతజ్ణుడనై ఉంటాననీ ట్వీట్ చేశారు.

Trending News