KGF Actor Harish Roy: పాపం.. కేజీఎఫ్ నటుడుకి ఎవ్వరికీ చెప్పుకోలేని కష్టం.. ఆర్థిక సాయం కోసం ఎదురుచూపులు

KGF Actor Harish Roy: కేజీఎఫ్ 1, కేజీఎఫ్ 2 సినిమా చూసిన వారికి అందులో ఖాసీం చాచా క్యారెక్టర్ గుర్తుండే ఉంటుంది. రాకీ పాత్ర కష్టంలో ఉన్న ప్రతీసారి.. ''బోల్ రే క్యా చాహీయే తేరేకో'' అంటూ వెన్నంటి ఉండే ఓ ముస్లిం వృద్ధుడి పాత్రలో కనిపించిన ఖాసిం చాచా అసలు పేరు హరీష్ రాయ్.

Written by - Pavan | Last Updated : Aug 26, 2022, 12:01 AM IST
KGF Actor Harish Roy: పాపం.. కేజీఎఫ్ నటుడుకి ఎవ్వరికీ చెప్పుకోలేని కష్టం.. ఆర్థిక సాయం కోసం ఎదురుచూపులు

KGF Actor Harish Roy: కేజీఎఫ్ 1, కేజీఎఫ్ 2 సినిమా చూసిన వారికి అందులో ఖాసీం చాచా క్యారెక్టర్ గుర్తుండే ఉంటుంది. రాకీ పాత్ర కష్టంలో ఉన్న ప్రతీసారి.. ''బోల్ రే క్యా చాహీయే తేరేకో'' అంటూ వెన్నంటి ఉండే ఓ ముస్లిం వృద్ధుడి పాత్రలో కనిపించిన ఖాసిం చాచా అసలు పేరు హరీష్ రాయ్. ఎవ్వరూ లేని అనాథ బాలుడు రాఖీని చేరదీసి అతడికి చివరి వరకు తోడుగా నిలిచిన ఖాసీం చాచాకే ఇప్పుడు కష్టమొచ్చింది. కాకపోతే అది రీల్ లైఫ్ సమస్య.. ఇది రియల్ లైఫ్ స్టోరీ. 

కేజీఎఫ్ సినిమాలో ఖాసిం చాచా పాత్రలో నటించి అందరినీ మెప్పించిన హరీష్ రాయ్ గత కొన్నేళ్లుగా క్యాన్సర్‌తో బాధపడుతున్న విషయం చాలామందికి తెలియదు. క్యాన్సర్ చికిత్సలో భాగంగా ఇప్పటికే అతడి ఊపిరితిత్తులకు సర్జరీ కాగా క్యాన్సర్ వ్యాధిని నయం చేసేందుకు మరింత చికిత్స అవసరం ఉంది. అయితే, ఇప్పటికే తన వద్ద ఉన్న డబ్బు అంతా క్యాన్సర్ చికిత్స కోసం ఖర్చయిపోయిందని.. ఇంకా మిగిలి ఉన్న చికిత్స కోసం ఎవరైనా దాతలు ఎవరైనా ముందుకొచ్చి తనకు ఆర్థిక సహాయం చేయాలని హరీష్ రాయ్ చేతులెత్తి అభ్యర్థిస్తున్నాడు. హరీష్ రాయ్ దుస్థితి గురించి తెలుసుకున్న కన్నడ సినీ పరిశ్రమకు చెందిన పలువురు నటీనటులు, నిర్మాతలు, దర్శకులు, ఇతర సినీ ప్రముఖులు ఆయనకు తమ వంతు ఆర్థిక సహాయం అందించేందుకు ముందుకొస్తున్నారు. 

 

అసలు విషయం చెబితే ఛాన్స్ ఇవ్వరేమోనని దాచిపెట్టాను.. కన్నీటి పర్యంతమైన హరీష్ రాయ్ 
క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ ఆ విషయాన్ని మీడియాకు కానీ, లేదా సన్నిహిత మిత్రులకు కానీ చెప్పకుండా ఎందుకు దాచిపెట్టారు అని హరీష్ రాయ్ ని అడగ్గా.. అతడు చెప్పిన సమాధానం వింటే ఎవ్వరికైనా బాధనిపించకుండా ఉండదు. తనకు క్యాన్సర్ వ్యాధి ముదురుతోందని తెలిసినప్పటికీ.. ఆ విషయం బయటికి తెలిస్తే తనకు ఎవ్వరూ సినిమాల్లో అవకాశాలు ఇవ్వరేమోననే భయంతోనే ఆ విషయాన్ని బయటికి చెప్పకుండా దాచిపెట్టానని చెబుతూ హరీష్ రాయ్ కన్నీటి పర్యంతమయ్యాడు. తనకు డబ్బు ఎంతో అవసరమని.. కానీ క్యాన్సర్‌తో బాధపడుతున్న తనకు ఎప్పుడు ఏమవుతుందో తెలియదు కాబట్టి... సినిమా వాళ్లు కూడా తనను దూరం పెడుతారనే భయంతోనే అలా చేయాల్సి వచ్చిందంటున్న హరీష్ రాయ్‌కి ఇకనైనా అంతా మంచే జరిగి ఆ క్యాన్సర్ మహమ్మారి బారి నుండి బయటపడాలని మనసారా కోరుకుందాం.

Also Read : Sudigali Sudheer Fans: సుడిగాలి సుధీర్ అభిమానులకు బ్యాడ్ న్యూస్.. అనుకున్నదొక్కటి, అయ్యిందొక్కటి!

Also Read : Sri Reddy Targets Puri Jagannadh: బాబు మీద పడి ఏడవడం, ఎంత వరకు కరెక్ట్ అధ్యక్షా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News