Ashwin Month 2022: హిందూ క్యాలెండర్ ప్రకారం, 10 సెప్టెంబర్ 2022 రోజు చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఈ రోజు పితృ పక్షం ప్రారంభం కావడంతోపాటు తెలుగు సంవత్సరంలో ఏడో నెల అయిన ఆశ్వయిజ మాసం లేదా అశ్వినీ మాసం ప్రారంభంకానుంది. అశ్వినీ మాసం (Ashwin Month 2022) సెప్టెంబరు 10 మధ్యాహ్నాం 3.30 గంటలకు ప్రారంభంకానుంది. భాద్రపద మాసం పౌర్ణమి తిథి ముగిసిన వెంటనే అశ్వినీ మాసం మెుదలవుతుంది. ఈ మాసంలో వచ్చే ముఖ్య పండుగలు, ఏం చేయాలి, ఏం చేయకూడదు అనే విషయాలు తెలుసుకుందాం.
ఈ మాసంలో వచ్చే వ్రతాలు, పండుగలు:
పితృ పక్షం, అంగారక చతుర్థి, విశ్వకర్మ జయంతి, కన్యా సంక్రాంతి, మహాలక్ష్మి వ్రతం ముగింపు, ఇందిరా ఏకాదశి, మహాలయ శ్రాద్ధ పక్షం పూర్తి, శారద నవరాత్రి, పాపాంకుశ ఏకాదశి మొదలైనవి ఈ మాసంలోని ప్రధాన వ్రతాలు మరియు పండుగలు.
అశ్వినీ మాసంలో ఏమి చేయాలి?
తల్లిదండ్రులను గౌరవించాలి. దుర్గాదేవిని పూజించాలి. దానాలు మొదలైనవి చేయాలి. ఈ నెలలో బెల్లం తినాలని నమ్ముతారు, ఇది ఆరోగ్యానికి మంచిదని భావిస్తారు.
అశ్వినీ మాసంలో ఏమి చేయకూడదు?
ఈ మాసంలో పాలు తాగకూడదని నమ్మకం. ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఆయిల్ ఫుడ్ ఎక్కువగా తినకండి. బెండకాయ, ముల్లంగి, పప్పు, శనగలు మొదలైన వాటి వినియోగం సరైనది కాదు.
Also read: Budh Vakri Effect 2022: కన్యారాశిలో బుధుడి తిరోగమనం... ఏ రాశివారికి లాభం?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook