Medicines Banned: జింటాక్, ర్యాంటాక్ మందులతో కేన్సర్, 26 మందుల్ని నిషేధించిన కేంద్రం

Medicines Banned: ఔషధ రంగానికి సంబంధించి కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. మార్కెట్‌లో ప్రాచుర్యంలో ఉన్న కొన్ని రకాల మందుల్ని నిషేధించింది. కేంద్రం వేటిపై నిషేధం విధించింది, కారణాలేంటనేది తెలుసుకుందాం..  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Sep 13, 2022, 10:02 PM IST
Medicines Banned: జింటాక్, ర్యాంటాక్ మందులతో కేన్సర్, 26 మందుల్ని నిషేధించిన కేంద్రం

Medicines Banned: ఔషధ రంగానికి సంబంధించి కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. మార్కెట్‌లో ప్రాచుర్యంలో ఉన్న కొన్ని రకాల మందుల్ని నిషేధించింది. కేంద్రం వేటిపై నిషేధం విధించింది, కారణాలేంటనేది తెలుసుకుందాం..

కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. మార్కెట్‌లో చాలాకాలం నుంచి ప్రాచుర్యంలో ఉన్న కొన్ని రకాల మందులపై నిషేధం విధించింది. 26 రకాల మందులపై కేంద్రం వేటు వేసింది. అత్యవసర జాబితా నుంచి ర్యాంటాక్, జింటాక్ ట్యాబ్లెట్లను తొలగించింది. ఈ ట్యాబ్లెట్లతో కేన్సర్ సోకుతుందనే అనుమానాల్ని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వ్యక్తపర్చింది. ర్యాంటాక్, జింటాక్‌లతో పాటు 26 రకాల మందుల్ని ఇండియన్ మార్కెట్ నుంచి తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది. 

ఆరోగ్య మంత్రిత్వ శాఖ 384 ఔషధాలతో కొత్తగా నేషనల్ లిస్ట్ ఆఫ్ ఎసెన్షియల్ మెడిసిన్ విడుదల చేసి..26 ఔషధాల్ని తొలగించింది. ర్యాంటాక్, జింటాక్ మందుల్ని ఎసిడిటీ వంటి సమస్యలకు వైద్యులు సూచిస్తుంటారు. 

కేంద్రం నిషేధించిన 26 రకాల మందుల జాబితా

Alteplase, Atenolol, Bleaching powder, Capremycin, Cetrimide, Chlorpheniramine, Diloxanide furoate, Dimercaprol, Erythromycin, Ethinylestradiol, Ethinylestradiol(A) Noresthisterone(B), Ganciclovir, Kanamycin, Lamivudine(A), Neverapine(B), Stavudine(C), Leflunomide, Methyldopa, Nicotinamide, Pegylated Interferon Alfa 2a, Pegylated interferon alfa 2b, Pentamidine, Prilocaine(A),Lignocaine(B), Procarbazine, Ranitidine, Rifabutin, Stavudine, Lamivudien(B), Sucralfate, White petrolatum

Also read: Gyanvapi Case Verdict: జ్ఞానవాపి మసీదు కేసులో కీలక పరిణామం..విచారించేందుకు కోర్టు పచ్చజెండా..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News