Maharashtra: సొంత చెల్లిపైనే 8 ఏళ్లపాటు కాటేసిన కీచక అన్న.. మౌనాన్ని వీడి 31 ఏళ్ల తర్వాత ఫిర్యాదు..

Maharashtra: వావివరుసలు మరచి సొంత అన్నే ఆమె పట్ల కీచకుడు అయ్యాడు. బాల్యంలో 8 ఏళ్లపాటు లైంగికంగా వేధించాడు. 31 ఏళ్లపాటు ఆ బాధను దిగమింగిన ఆమె ఎట్టేకులకు నోరు విప్పింది. 52 ఏళ్ల తన అన్నపై తాజాగా ఫిర్యాదు చేసింది. ఈ ఘటన అమరావతి జిల్లాలో జరిగింది.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Sep 22, 2022, 07:23 AM IST
Maharashtra: సొంత చెల్లిపైనే 8 ఏళ్లపాటు కాటేసిన కీచక అన్న.. మౌనాన్ని వీడి 31 ఏళ్ల తర్వాత ఫిర్యాదు..

Maharashtra crime: తనపై జరిగిన అన్యాయానికి వ్యతిరేకంగా ఫిర్యాదు చేయడానికి 31 సంవత్సరాలు పట్టింది ఓ మహిళకు. 8 ఏళ్లపాటు సొంత అన్న చేతిలోనే లైంగికంగా చిత్రవధ అనుభవించిన ఆమె ఎట్టకేలకు నోరు విప్పింది. ఈ ఘటన మహారాష్ట్రలోని అమరావతి జిల్లాలో (Amravati District) చోటుచేసుకుంది. 

వివరాల్లోకి వెళితే..
మహారాష్ట్రలోని అమరావతి జిల్లాకు చెందిన ఓ మహిళ తన 13 ఏట లైంగిక వేధింపులకు గురైంది. ప్రస్తుతం ఆ మహిళ వయసు 44 ఏళ్లు. బాల్యంలో ఆమె ఫ్యామిలీ రాజ్​పేఠ్​ పోలీస్​ స్టేషన్ పరిధిలో ఉండేది. అప్పుడే సొంత అన్న కామాంధుడై కాటేశాడు. ఈ కీచకపర్వాన్ని 8 ఏళ్లపాటు అంటే 1983 నుంచి 1991 వరకు కొనసాగించాడు. అతడి వికృతి చేష్టలను రోజురోజూకు పెరుగుతుండటంతో బాధిత మహిళ భరించలేకపోయింది. తనపై జరుగుతున్న నీచాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. అయితే కుటుంబం పరువు పోతుందని భావించిన ఆమె తల్లిదండ్రులు ఎవరికీ చెప్పవద్దని సర్ది చెప్పారు. 

అయితే కొంతకాలానికి ఆమె తండ్రి కాలం చేశాడు, తల్లి ఆరోగ్యం క్షీణించింది. ఈ క్రమంలో బాధితురాలకు వివాహమై.. పిల్లలూ కూడా పుట్టారు. కానీ చిన్న తనంలో సొంత అన్న చేతిలోనే జరిగిన రాక్షస కాండను ఆమె మర్చిపోలేక.. తనలో తానే కుమిలిపోయింది. గతం తాలూకా చేదు జ్ఞాపకాలు సూదుల్లా పొడుస్తుంటే 31 ఏళ్లపాటు భరించింది. ఇక భరించడం తన వల్ల కాదని జరిగిన నిజాన్ని భర్తకు చెప్పింది. ముంబయిలోని మలాడ్​ ప్రాంతంలో ఉంటున్న సోదరుడిపై.. అమరావతి పోలీసులకు, దిల్లీలోని జాతీయ మహిళా కమిషన్కు, నొయిడా పోలీస్​ స్టేషన్​లోనూ ఫిర్యాదు చేసింది. 

Also Read: Viral Post: సాఫ్ట్ వేర్ ఇంజినీర్‌ అయితే మాకొద్దు... వైరల్ గా మారిన వధువు పేరెంట్స్ పెళ్లి ప్రకటన

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News