IND vs AUS 3rd T20I Tickets, Child Fan Alia Injured at Gymkhana Cricket Ground: సెప్టెంబర్ 25న భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరగనున్న మూడో టీ20 మ్యాచ్ హైదరాబాద్‌లోని ఉప్పల్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరగనుంది. ఇందుకు సంబంధించి టికెట్లు ఆదివారం నుంచి పేటీఎం ఇన్‌సైడర్ యాప్‌లో అందుబాటులో ఉంచినట్లు స్వయంగా హెచ్‌సీఏ అధ్యక్షుడు మహ్మద్ అజారుద్దీన్ చెప్పారు. ఆ టికెట్స్ కేవలం అరగంటలోనే ఖతం అయ్యాయ. ఎన్ని టికెట్స్ అందుబాటులో ఉంచారో కూడా ఎవరికీ తెలియకుండా పోయింది.
యాప్‌లో అన్ని టికెట్స్ అందుబాటులో లేకపోవడంతో ఫ్యాన్స్ మండిపడ్డారు. బుధవారం సికింద్రాబాద్‌లోని జింఖానా మైదానంలో ఫాన్స్ ప్రొటెస్ట్ చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో జింఖానా గ్రౌండ్‌లో ఆఫ్‌లైన్‌లో టికెట్లను విక్రయించనున్నట్లు హెచ్‌సీఏ నిర్వాహకులు ప్రకటించారు. దీంతో గురువారం పెద్ద ఎత్తున అభిమానులు జింఖానా గ్రౌండ్‌కు చేరుకున్నారు. భారీ సంఖ్యలో ఫాన్స్ రావడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో కొంతమంది అభిమానులు స్పృహ తప్పి పడిపోయారు. రంగంలోకి దిగిన పోలీసులు లాఠీచార్జ్ చేశారు.
తొక్కిసలాటలో మహిళలు, చిన్న పిల్లలు కూడా గాయపడ్డారు. ఈ ఘనటలో చిన్నపాప ఆలియా తీవ్రంగా గాయపడి ప్రస్తుతం ఐసీయూలో ఉంది. జింఖానా గ్రౌండ్స్ ఘటనలో తన బిడ్డ తీవ్రంగా గాయపడిందని ఆలియా తల్లి మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేసింది. తన కూతురు ఆలియాకు టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ అంటే పిచ్చి అని.. ఆయనను చూసేందుకు టికెట్ల కోసం ఉదయం 5 గంటలకు మైదానంకు వచ్చామని తెలిపింది.
Her is a fan of @imVkohli and she went to take tickets at gymkhana grounds secunderabd and huge crowd is waiting for tickets and suddenly everyone ran into to the grounds many people were injured on women died it was a horrible situation in hyd @BCCI this completely fault of HCA pic.twitter.com/tq5ZUaCCxA
— ashraf(ashu) (@ashushiv777) September 22, 2022
జింఖానా గ్రౌండ్‌లో ఈరోజు జరిగిన తొక్కిసలాటలో వందల మంది తన పాపపై పడ్డారని, ఊపిరాడక నరకం అనుభవించిందని ఆలియా తల్లి కన్నీరుమున్నీరు అయ్యారు. తీవ్రంగా గాయపడిన ఆలియా ఐసీయూ ఉందని బోరుమంది. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియో చూసిన వారు పాపం ఆలియా అని కంటతడి పెడుతున్నారు. ఆమె త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు.
Also Read: అభిమానులను చితకబాది.. దర్జాగా టికెట్స్ మొత్తం కొన్న హైదరాబాద్ పోలీసులు!
Also Read: బొంగులో టికెట్స్.. కొంచెం అయితే సచ్చేటోడిని! ** నా కొడుకు అజారుద్దీన్ వల్లే ఇదంతా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.