Navratri 2022: నవరాత్రుల భారతీయులకు ఎంతో ప్రముఖ్యమైన రోజులుగా భావిస్తారు. తొమ్మిది రోజుల పాటు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేస్తారు. అయితే ఈ నవరాత్రుల్లో అమ్మవారిని పూజిస్తే సకల శుభాలు కలుగుతాయని శాస్త్రం చెబుతోంది. అంతేకాకుండా అమ్మవారి అనుగ్రహం లభించాలంటే భక్తి శ్రద్ధలతో ఉపవాసాలు పాటించాల్సి ఉంటుంది. నవరాత్రుల్లో భాగంగా పలు రకాల నియమాపాటించాల్సి ఉంటుంది. అయితే ఇందులో భాగంగా పలు రకాల పనులు చేయాల్సి ఉంటుంది. ఆ పనులేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
ఈ రోజునుంచి(సెప్టెంబర్ 26) నవరాత్రులు ప్రారంభమైనవి కాబట్టి తొమ్మిది రోజుల పాటు అమ్మవారు పూజలు అందుకోనున్నారు. నవరాత్రుల సమయంలో సాక్షత్తు దుర్గ మాత ఇంట్లోకి ప్రవేశిస్తుంది. కాబట్టి తప్పకుండా పలు రకాల నియమాలు పాటించాల్సి ఉంటుంది.
నవరాత్రులు ప్రారంభమయ్యే ముందు ఈ 6 పనులు చేయండి. నవరాత్రుల ప్రారంభానికి ముందు ఇంటిని శుభ్రం చేయడం చాలా ముఖ్యం. అమ్మవారు మురికి ఉన్న ఇంటికి రాదని కాబట్టి తప్పకుండా ఇళ్లును శుభ్రం చేయాల్సి ఉంటుంది. దుర్గామాత అనుగ్రహం కావాలంటే ఈరోజే మీ ఇంటిని శుభ్రం చేసుకోండి.
శుభ్రం చేసిన తర్వాత ఇంట్లో పసుపు నీరు చల్లాల్సి ఉంటుంది. ఇంటి ప్రధాన ద్వారాని, గుమ్మాలకు తోరనాలు కట్టాలి. ఇలా చేయడం వల్ల అమ్మవారి అశిస్సులు లభించడమేకాకుండా ఇంట్లో సుఖ సంతోషాలు కలుగుతాయి.
నవరాత్రులలో తొమ్మిది రోజులు గడ్డం, మీసాలను కత్తిరించుకోకూడదు. కాబట్టి ఎవరైనా ఇలా చేస్తే తప్పని చెప్పాలి. అంతేకాకుండా ప్రతి రోజూ శరీరాన్ని శుభ్రం చేసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా నవరాత్రుల ముందే గోర్లు కత్తిరించుకోవడం చాలా ముఖ్యమని శాస్త్రం చెబుతోంది.
నవరాత్రుల్లో తొమ్మిది రంగులకు ఒక్కొక్క ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. ఈ తొమ్మిది రోజుల్లో తల్లి యొక్క ప్రతి రూపం వేరే రంగుల్లో ప్రత్యేక్షమవుతుంది. కాబట్టి ఈ తొమ్మిది రోజులు మీ దుస్తులను ముందుగానే ఎంచుకోండి.
ముఖ్యంగా మాంసాహారులైతే మాసాన్ని నవరాత్రి ప్రారంభానికి ముందు తినాలి. ఈ తొమ్మది రోజుల పాటు భక్తి శ్రద్ధలతో ఉండాల్సి ఉంటుంది. ముఖ్యంగా కూరగాయలతో అమ్మవారికి ఆహారాలు సమర్పించాల్సి ఉంటుంది.
Also Read: Chia Seeds: చియా సీడ్స్‌తో కేవలం 10 రోజుల్లో 2 కిలోల బరువు తగ్గొచ్చు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
Navratri 2022: నవరాత్రుల్లో చేయకూడని పనులు ఇవే.. చేశారో ఇక మీ పని అంతే..
నవరాత్రుల్లో ఈ పనులు చేయోద్దు
తొమ్మిది రోజుల పాటు అమ్మవారికి పూజలు చేయాలి
మాంసం అస్సలు తీసుకోవద్దు