Kabul Suicide Attack: ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబుల్ నగరం మరోసారి రక్తసిక్తమైంది. ఓ విద్యాకేంద్రం వద్ద జరిగిన పేలుళ్లలో పెద్దఎత్తున విద్యార్ధులు మరణించారు. మరణించినవారి సంఖ్య ఇప్పటికే వంద దాటేసింది..
ఆఫ్ఘనిస్తాన్‌లో ఇంకా నెత్తుటి క్రీడలు ఆగలేదు. బాంబు దాడులు, ఆత్మాహుతి దాడులు కొనసాగుతున్నాయి. తాలిబన్ల ప్రభుత్వం ఏర్పడినా..బాంబు పేలుళ్లు జరుగుతూనే ఉన్నాయి. వందలకొద్దీ జనం బలవుతున్నారు. ఈసారి అభం శుభం తెలియని విద్యార్ధులు నేలకొరిగారు. ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్‌లో జరిగిన ఆత్మాహుతి దాడి ఒక్కసారిగా షాక్ ఇచ్చింది. ప్రపంచాన్ని కుదిపేసింది. ఓ స్కూల్ వద్ద జరిగిన ఆత్మాహుతి దాడి కావడంతో పెద్దఎత్తున విద్యార్ధులు ప్రాణాలు కోల్పోయారు.
ఈ దుర్ఘటనలో ఇప్పటి వరకూ 100 మంది విద్యార్ధుల మృతదేహాలు వెలుగుచూశాయి. పెద్దసంఖ్యలో గాయపడ్డారు. విద్యార్ధులు పరీక్షలకు హాజరౌతున్న సందర్భంగా ఈ పేలుడు జరిగినట్టు తెలుస్తోంది. శుక్రవారం అంటే ఇవాళ ఉదయం 7.30 గంటలకు ఓ వ్యక్తి కాజ్ ఎడ్యుకేషన్ సెంటర్‌కు బాంబు ధరించి..విద్యార్ధుల మధ్యకు వెళ్లి తనను తాను పేల్చుకున్నాడని ఆఫ్ఘనిస్తాన్ అధికారులు తెలిపారు. ఈ మధ్యనే వాజిర్ అక్బర్ ఖాన్ ప్రాంతంలో జరిగిన భారీ పేలుడులో కూడా పదుల సంఖ్యలో మరణాలు చోటుచేసుకున్నాయి. పేలుడు సమయంలో ఘటనాస్థలంలో 400 మంది వరకూ ఉన్నట్టు తెలుస్తోంది. యూనివర్శిటీ ఎంట్రెన్స్ పరీక్ష కోసం నిర్వహించిన మాక్ టెస్ట్ రాసేందుకు వచ్చారని తెలిసింది. ఎక్కువమంది బాలికలే ఉండటం గమనార్హం.
ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్లు అధికారంలో వచ్చి ఆగస్టుతో ఏడాది పూర్తయింది. అప్పట్నించి వరుసగా దాడులు జరుగతూనే ఉన్నాయి. తాలిబన్ల పాలనకు వ్యతిరేకంగా ఉగ్రసంస్థలు దారుణాలకు పాల్పడున్నట్టు అనుమానిస్తున్నారు.
Also read: China Fire Accident: చైనాలో ఘోర అగ్నిప్రమాదం..17 మంది సజీవ దహనం..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook