ICC T20 WC 2022: ఈనెల 13 నుంచి టీ20 వరల్డ్ కప్ ప్రారంభంకానుంది. ఈసారి కూడా టీమిండియానే హాట్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. భారత్ తన తొలి మ్యాచ్‌లోనే దాయాది దేశం పాకిస్థాన్‌తో తలపడనుంది. ఈఏడాది వరల్డ్ కప్‌లో టీమిండియా, పాకిస్థాన్, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్ జట్లు ఒకే టీమ్‌లో ఉన్నాయి. గ్రూప్‌లో టీమిండియాకు ప్రతి మ్యాచ్ సవాల్‌గా ఉండనుంది. అన్ని జట్లు బలంగా ఉండటంతో మ్యాచ్ రసవత్తరంగా సాగనుంది.
భారత్, పాకిస్థాన్ మ్యాచ్‌పైనే అందరి చూపు ఉంది. ఎందుకంటే ఐసీసీ టోర్నీల్లో తప్ప..ఏ ఇతర సిరీస్‌లు ఇరుదేశాల మధ్య జరగడం లేదు. అందుకే ఈజట్ల మధ్య పోటీ ఆసక్తికరంగా ఉండనుంది. దాయాది దేశాల పోరుకు క్రికెట్ అభిమానులు ఆతృతంగా ఎదురుచూస్తున్నారు. ఈనెల 23న భారత్, పాకిస్థాన్ మ్యాచ్ జరగనుంది. ఈనేపథ్యంలో టోర్నీని ప్రసారం చేస్తున్న స్టార్ స్పోర్ట్స్..క్రికెట్ అభిమానులకు ట్రీట్ ఇచ్చింది.
టీ20 వరల్డ్ కప్‌లో జరిగే మ్యాచ్‌కు సంబంధించిన ఓ స్పెషల్ ప్రోమోను విడుదల చేసింది. విడుదలైన కాసేపటికే వీడియో వైరల్‌గా మారింది. నెటిజన్లు విపరీతంగా కామెంట్లు పెడుతున్నారు. మ్యాచ్‌లో గెలిచేది మేమే..వరల్డ్ కప్ కూడా మాదే అంటూ నెటిజన్లు స్పందిస్తున్నారు. ప్రస్తుతం టీమిండియా స్వదేశంలో వరుసగా టీ20 సిరీస్‌లను ఆడుతోంది. ఇప్పటికే ఆస్ట్రేలియాతో జరిగిన మూడు టీ20ల సిరీస్‌ను 1-2 ఆధిక్యంతో కైవసం చేసుకుంది.
ప్రస్తుతం సౌతాఫ్రికాతో మూడు టీ20ల సిరీస్ జరుగుతోంది. ఈసిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యంలో ఉంది. ఇవాళ గౌహతి వేదికగా ఇరుదేశాల మధ్య రెండో మ్యాచ్ ప్రారంభంకానుంది. ఈమ్యాచ్‌లో గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలని టీమిండియా స్కెచ్‌లు వేస్తోంది. ఈసిరీస్ తర్వాత టీమిండియా, సఫారీ జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్ జరగనుంది. దీని తర్వాత భారత జట్టు నేరుగా ఆస్ట్రేలియాకు వెళ్తుంది.
ఐతే భారత్‌ను గాయాల బెడద వెంటాడుతోంది. ఇప్పటికే కీలక ప్లేయర్లు టీ20 వరల్డ్ కప్ నుంచి తప్పుకున్నారు. టీమిండియా స్టార్ పేసర్ బుమ్రా సైతం గాయపడ్డారు. ఐతే వరల్డ్ కప్‌లో ఆడతాడా..లేదా అన్న దానిపై క్లారిటీ రావడం లేదు. త్వరలోనే దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
Also read:నష్టాలను మిగిల్చింది.. పుష్పపై డైరెక్టర్ తేజ కామెంట్స్
Also read:IND vs SA: సిరాజ్ ఇన్.. పంత్ డౌట్! దక్షిణాఫ్రికాతో తలపడే భారత తుది జట్టు ఇదే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి