Tamil Nadu Fishermen: తమిళనాడు జాలర్ల వలకు రూ.50 కోట్ల విలువైన అంబర్ గ్రిస్ దొరికింది. సముద్రంలో చేపల వేటకు వెళ్లిన సమయంలో 38.6 కిలోల అంబర్ గ్రిస్ లభ్యమైంది. అంబర్ గ్రిస్ అనేది తిమింగలం వాంతి అని అంటారు. దీనిని సుగంధ ద్రవ్యాల తయారీలో ఉపయోగిస్తారు. మార్కెట్లో దీనికి విపరీతమైన డిమాండ్ ఉంది. తిమింగలాల కడుపులో తయారయ్యే దీనిని అవి వాంతి రూపంలో బయటకు పంపుతాయి.
దీనిని ఫ్లోటింగ్ గోల్డ్‌గా పిలుస్తారు. అత్యంత విలువైన అంబర్ గ్రిస్..కల్పానక్కం సమీపంలో జాలర్ల వలకు చిక్కింది. దీని విలువ రూ.50 కోట్లకుపైగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. చెంగల్పట్టు జిల్లా కల్పాక్కం సమీపంలోని కడపాక్కానికి చెందిన ఇంద్రకుమార్, మాయకృష్ణన్, కర్ణన్, శేఖర్ కలిసి చేపల వేటకు వెళ్లారు. చేపల కోసం వల వేయగా బరువైన వస్తువు పడినట్లు కనిపించింది. వెంటనే బయటకు తీయగా అంబర్ గ్రిస్ అని గుర్తించారు.
దీనిపై అచ్చిరుపాక్కం అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. జాలర్ల వద్దకు చేరుకున్న అధికారులు అంబర్ గ్రిస్‌ను స్వాధీనం చేసుకున్నారు. విలువైన వస్తువు ఇచ్చిన మత్స్యకారులను వారు అభినందించారు. ఇందులో కొంత సొమ్ము జాలర్లకు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. విలువైన వస్తువులు దొరకడం పట్ల మత్స్యకారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అంబర్ గ్రిస్‌ను అటవీ అధికారులు..ల్యాబ్‌కు పంపనున్నట్లు తెలుస్తోంది.
Also read:IND vs SA: టీమిండియాను వెంటాడుతున్న డెత్ ఓవర్ల ఫోబియా..అలా చేస్తామన్న రోహిత్ శర్మ..!
Also read:Weather Alert: తెలుగు రాష్ట్రాలకు అల్పపీడనం ముప్పు..వాతావరణ శాఖ హెచ్చరికలు ఇవే..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook