Srisailam reservoir: శ్రీ శైలం గేట్లను అధికారులు మూసివేశారు. దీంతో గంగపుత్రులు భారీగా ప్రాజెక్టు మీదకు చేరుకున్నారు. వందల సంఖ్యలో తమ పడవళ్లలో చేపల కోసం వెళ్లారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Independence Day 2023 Guests: ఆగస్టు 15 నాడు స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఎర్రకోట పై జాతీయ జండా ఎగరవేసి జాతిని ఉద్దేశించి కీలకమైన ఉపన్యాసం చేస్తారు. మనకు స్వేచ్ఛను ప్రసాదించిన ఎందరో స్వాతంత్ర్య సమరయోధులను, మహనీయులను స్మరించుకుంటూ సాగే ఆ ప్రసంగంలో స్వాతంత్ర్యం అనంతరం మన దేశం సాధించిన ప్రగతిని కూడా వివరిస్తారు. అంతటి కీలకమైన మన పంద్రాగస్టు పండగని ప్రత్యక్షంగా వీక్షించేందుకు ఎవరెవరు అతిథులుగా వస్తున్నారు అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
Pawan Kalyan Visits Yetimoga oF Kakinada: 'దానశీలి శ్రీ మల్లాడి సత్యలింగ నాయకర్ వారసులు మీరు.. తన, మన బేధం లేకుండా ప్రతి ఒక్కరికీ సాయం చేసిన ఆ గొప్ప వ్యక్తి తరాల సంపద మీరు.. ప్రభుత్వం విదిలించే అరకొర సాయానికి దేహీ అనాల్సిన పని మీకు లేదు. మీరు పది మందికీ మత్స్యసంపదను పంచే సంపద సృష్టికర్తలు. మీరంతా స్వయంశక్తి సాధించే దిశగా పుట్టిందే జనసేన షణ్ముఖ వ్యూహం.. ప్రతి మత్స్యకారుడు ఆర్థికాభివృద్ధి సాధించి ఆనందంగా ఉండాలన్నదే మా లక్ష్యం' అని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.
YSR Matsyakara Bharosa Scheme News: రాష్ట్రవ్యాప్తంగా సముద్రంలో వేటకు వెళ్లే 1,23,519 మత్స్యకార కుటుంబాలకు ప్రతీ ఏడాది వేట నిషేధ సమయం అయిన ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 మధ్య కాలంలో ఆ కుటుంబాలు ఇబ్బంది పడకూడదని ఒక్కొక్క కుటుంబానికి రూ.10 వేల చొప్పున రూ.123.52 కోట్ల ఆర్థిక సాయం అందించనున్నట్టు ఏపీ సర్కారు ప్రకటించింది.
Boats Capsize: గుజరాత్లోని నవబందర్ ప్రాంతంలో సుమారు 15 పడవలు సముద్రంలో మునిగిపోయాయి. పలువురు మత్స్యకారులు గల్లంతు కాగా...అందులో నలుగురు సురక్షితంగా బయటపడినట్లు సమాచారం.
Mumbai: మహారాష్ట్రలోని ఓ మత్స్యకారుడిని ఊహించని రీతిలో అదృష్టం వరించింది. రోజూ మాదిరిగానే చేపల వేటకు వెళ్లిన అతడికి ఈసారి కోట్లు విలువ చేసే 157 ఘోల్ చేపలు దొరికాయి. పాల్గఢ్ జిల్లా ముర్బె గ్రామానికి చెందిన చంద్రకాంత్ వీటిని వేలం వేయగా..రూ.1.33 కోట్లు పలికాయి. దాంతో చంద్రకాంత్ ఎవరూ ఊహించని విధంగా కోటీశ్వరుడయ్యాడు.
YSR Matsyakara Bharosa Latest News: గత ఏడాది మే 6న మత్స్యకారులకు రెండో ఏడాది నగదు బ్యాంక్ ఖాతాలకు చేరింది. ఈ ఏడాది వైఎస్సార్ మత్స్యకార భరోసా పథకం నగదును ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు విడుదల చేశారు. మత్స్యకారుల బ్యాంకు ఖాతాల్లో రూ.10000 జమ కానుంది.
ఆంధ్రప్రదేశ్ కోస్తాతీరం ఇకపై అభివృద్ధికి నోచుకోనుంది. రాష్ట్రంలో నాలుగు ఫిషింగ్ హార్బర్లకు ముఖ్యమంత్రి వైెఎస్ జగన్ శంకుస్థాపన చేశారు. మరో నాలుగు త్వరలో ప్రారంభం కానున్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.