Sourav Ganguly: తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన దాదా సతీమణి..!

Sourav Ganguly's Wife: సౌరవ్ గంగూలీ భార్య డోనా గంగూలీ మంగళవారం రాత్రి తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు గోప్యంగా ఉంచారు.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Oct 6, 2022, 06:49 AM IST
Sourav Ganguly: తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన దాదా సతీమణి..!

Sourav Ganguly's Wife Admitted To Hospital: బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ భార్య డోనా తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. జ్వరం, కీళ్ల నొప్పులు, దద్దుర్లు రావడంతో ఆమె మంగళవారం అర్థరాత్రి కోల్‌కతాలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేర్పించారు. అయితే ఆమెకు (Dona Ganguly) చికున్‌గున్యా (Chikungunya) ఉన్నట్లు వైద్యులు తేల్చారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని వుడ్‌ల్యాండ్స్ హాస్పిటల్  ఎండీ డాక్టర్ రూపాలి బసు అన్నారు. డోనా ఆరోగ్య స్థితిని నిశితంగా పరిశీలిస్తున్నట్లు బసు తెలిపారు. 

అయితే డోనా ఆస్పత్రిలో అడ్మిట్ అయిన సమయంలో దాదా (Sourav Ganguly) ఆమె వెంట లేడు. విషయం తెలుసుకున్న గంగూలీ హుటాహుటిన ఆస్పత్రికి వచ్చినట్లు తెలుస్తోంది. గంగూలీ, డోనాలు చిన్ననాటి మిత్రులు. వారు లవ్ చేసుకుని 1997లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. వీరికి సోనా అనే కూతురు ఉంది. ఈమె  లండన్‌లో చదువుకుంటోంది. అయితే డోనా ఒడిశా సంప్రదాయ నృత్యకారిణి. ఇప్పటికే డోనా అనేక ప్రదర్శనలు ఇచ్చారు.

Also Read: Ind vs SA T20 Match: చివరి టీ20లో రాణించిన సౌత్ ఆఫ్రికా, 49 పరుగుల తేడాతో ఇండియాపై విజయం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

 

 

 

Trending News