Multibagger stocks: షేర్ మార్కెట్‌లో వేలాది కంపెనీల షేర్లు అందుబాటులో ఉన్నాయి. అటు మల్టీబ్యాగర్ స్టాక్స్ కూడా పెద్దసంఖ్యలోనే ఉన్నాయి. కొన్ని కంపెనీల షేర్లు అమాంతంగా పెరుగుతూ ఊహించని లాభాలు ఆర్జిస్తున్నాయి. ఆ వివరాలు మీ కోసం
షేర్ మార్కెట్‌లో పెద్ద పెద్ద కంపెనీల షేర్లతో పాటు చిన్న కంపెనీల షేర్లు కూడా ఉన్నాయి. తక్కువ వ్యవధిలోనే ఎక్కువ రిటర్న్స్ అందిస్తున్నాయి. నిరంతరం లాభాలు కురిపిస్తున్నాయి. ఇన్వెస్టర్లకు భారీగా లాభాలు ఆర్జించే మల్టీబ్యాగర్ స్టాక్స్ ఉన్నాయి. వివిధ కంపెనీల షేర్లు అధిక లాభాలు ఇస్తున్నాయి. ఇందులో కొన్ని ఫైనాన్స్ కంపెనీల షేర్లు ఇన్వెస్టర్లను కోటీశ్వరుల్ని చేసింది.
ఇందులో ప్రముఖంగా చెప్పుకోవల్సింది బజాజ్ ఫైనాన్స్ షేర్ గురించి. బజాజ్ కంపెనీ షేర్ బోనస్ కూడా ఇస్తోంది. బజాజ్ గ్రూప్ ఫైనాన్స్ కంపెనీ సెప్టెంబర్ 2016లో 1కి 1 నిష్పత్తిలో బోనస్ ఇచ్చింది. కోవిడ్ తరువాత బజాజ్ కంపెనీ షేర్ భారీగా పెరిగింది. మే 2020 తరువాత బజాజ్ ఫైనాన్స్ దాదాపు 275 శాతం పెరిగింది.
అటు 20 ఏళ్ల క్రితం అంటే 2002 నవంబర్ 8న బజాజ్ కంపెనీ షేర్ విలువ 4.20 రూపాయలుంది. ఆ సమయంలో 4.5 రూపాయల చొప్పున ఓ లక్ష రూపాయలు ఇన్వెస్ట్ చేసుంటే..ఆ ఇన్వెస్టర్లకు 22, 222 షేర్లు లభించేవి. అవి 2016లో లభించిన బోనస్ షేర్‌తో రెట్టింపై..44,444 షేర్లు అయ్యాయి.
ప్రస్తుతం బజాజ్ ఫైనాన్స్ షేర్ 2022 అక్టోబర్ 7వ తేదీన ఎన్ఎస్ఈలో 7344 రూపాయలు ధరకు చేరుకుంది. అటు 52 వారాల కనిష్ట ధర 5220 రూపాయలుంది. 52 వారాల గరిష్టధరతో ఆల్ టైమ్ హై ప్రైస్ 8050 రూపాయలైంది. ఈ పరిస్థితుల్లో 8050 రూపాయల చొప్పున 44, 444 షేర్ ధర 35 కోట్ల 77 లక్షల 74 వేల 200 రూపాయలుగా మారింది. అదే 7344 రూపాయల ధరపై 44,444 షేర్ల ధర 32 కోట్ల 63 లక్షల 96 వేల 736 రూపాయలైంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook