Manchu Manoj Second Marriage : ఎవడి దూల వాడిది.. నా లైఫ్ మాత్రం.. మనోజ్ రెండో పెళ్లి మీద మంచు లక్ష్మీ రియాక్షన్

Manchu Manoj Second Marriage మంచు మనోజ్ రెండో పెళ్లి మీద గత కొన్ని రోజులుగా వస్తున్న రూమర్లు అందరికీ తెలిసిందే. భూమా మౌనికా రెడ్డితో మంచు మనోజ్ గత కొన్నేళ్లు లివింగ్ రిలేషన్‌లో ఉన్నాడని, త్వరలోనే పెళ్లి చేసుకుంటాడని కథనాలు వస్తున్నాయి.   

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 8, 2022, 06:05 PM IST
  • మంచు లక్ష్మీ బర్త్ డే స్పెషల్
  • మంచు మనోజ్ రెండో పెళ్లిపై రూమర్లు
  • స్పందించిన మంచు లక్ష్మీ
Manchu Manoj Second Marriage : ఎవడి దూల వాడిది.. నా లైఫ్ మాత్రం.. మనోజ్ రెండో పెళ్లి మీద మంచు లక్ష్మీ రియాక్షన్

Manchu Manoj Second Marriage : గత కొన్ని రోజులుగా మంచు మనోజ్ రెండో పెళ్లి మీద జరుగుతున్న ప్రచారం గురించి అందరికీ తెలిసిందే. మంచు మనోజ్- భూమా మౌనిక రెడ్డి గత కొన్నాళ్లుగా సహజీవనం చేస్తున్నారని.. వీళ్లిద్దరూ త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారనే కథనాలు కోకొల్లలుగా వస్తూనే ఉన్నాయి. అయితే వీటిపై మాత్రం మంచు మనోజ్ అధికారికంగా ప్రకటించలేదు. తాజాగా మంచు లక్ష్మీ స్పందించింది.

నేడు (అక్టోబర్ 8) మంచు లక్ష్మీ బర్త్ డే. ఈ క్రమంలో మీడియాతో ముచ్చటించింది మంచు లక్ష్మీ. ఈక్రమంలోనే మంచు మనోజ్ రెండో పెళ్లికి సంబంధించిన ప్రశ్నలు ఎదురయ్యాయి. దీనిపై మంచు లక్ష్మీ రియాక్ట్ అయింది. తమ్ముడి రెండో పెళ్లి మీద కౌంటర్లు వేసినట్టుగా కామెంట్లు చేసింది.

మనోజ్ పెళ్లి చేసుకుంటుంటే.. తానేం అంటానండీ బాబూ.. ఎవడి దూల వాడిది.. ఎవరి బతుకు వాళ్లని బతకనీయండి అని అనేసింది. హానెస్ట్ లవ్‌ని తాను బ్లెస్ చేస్తానని చెప్పింది. ఈ విషయంలో తాను హ్యాపీగానే ఉన్నానని పేర్కొంది. లైఫ్‌లో రెండే రెండు ఎమోషన్స్.. ఒకటి లవ్.. రెండు భయమని చెప్పుకొచ్చింది. లైఫ్‌ని లవ్‌తో లీడ్ చేస్తున్నామా? లేదంటే భయంతో లీడ్ చేస్తున్నామో తెలుసుకోవాలనీ, తన లైఫ్‌ని తాను లవ్‌తోనే లీడ్ చేస్తున్నాని చెప్పుకొచ్చింది.

ఇక తమ ఫ్యామిలీ మీద వస్తోన్న ట్రోలింగ్, మా రాజకీయాల మీద సైతం స్పందించింది. మా అంటే బుల్ షిట్.. ఒక పొలిటికల్ సిస్టమ్‌లో బురద జల్లుతూ ఉంటారని ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. రంగలోకి దిగిన తరువాత మంచితో పాటు చెడుని కూడా యాక్సెప్ట్ చేయాలని చెప్పింది. 

వాళ్లు నిన్ను చెడు అంటే నువ్ చెడ్డోడివి అయిపోతావా? ఈ ఫ్యాన్స్ ఎందుకు కొట్టుకుని ఫీల్ అవుతారో.. ఎదుటి హీరోల గురించి ఎందుకు నెగిటివ్‌గా మాట్లాడతారో తెలియదని ఫ్యాన్ వార్ గురించి మాట్లాడింది. తామంతా అద్దాల మేడలోనే ఉంటామని.. రాళ్లు వేయడానికి రెడీగా ఉంటారని కౌంటర్లు వేసింది.

తాము ఇప్పటివరకూ మోహన్ బాబు బిడ్డలుగా.. ఎక్కడికి వెళ్లినా ప్రేమ అందుకోవడమే తెలుసని, కానీ ఈ నెగిటివిటీ ఎక్కడ నుంచి వస్తుందో తెలియడం లేదని పేర్కొంది. వీటి ద్వారా కూడా తాం పాఠం నేర్చుకుంటున్నామని తెలివిగా సమాధానాలు ఇచ్చింది.

Also Read : Mohan Raja Father : లూసిఫర్‌ కంటే ‘గాడ్‌ఫాదర్‌’ చాలా బాగుందట

Also Read : Gunasekhar Daughter : గుణ శేఖర్ కూతురి ఎంగేజ్మెంట్

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook 

Trending News