Vastu Tips: వాస్తుశాస్త్రం ప్రకారం బెడ్‌రూమ్‌లో అవి ఉండకూడదా..ఉంటే ఏమౌతుంది.

Vastu Tips: హిందూమతంలో వాస్తుకు చాలా ప్రాముఖ్యత ఉంది. కేవలం ఇంటి నిర్మాణమే కాదు..ఇంట్లో ఏ వస్తువులు ఎక్కడుండాలనేది కూడా వాస్తులో భాగమేనట. ముఖ్యంగా ఆ ఫోటోలు అక్కడుంటే అన్నీ అనర్ధాలని హెచ్చరిస్తోంది వాస్తు శాస్త్రం.. ఆ వివరాలు మీ కోసం..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Oct 11, 2022, 11:45 PM IST
Vastu Tips: వాస్తుశాస్త్రం ప్రకారం బెడ్‌రూమ్‌లో అవి ఉండకూడదా..ఉంటే ఏమౌతుంది.

Vastu Tips:  హిందూధర్మంలో వాస్తుశాస్త్రం అతి ముఖ్యమైంది. ఇంట్లో ఏ వస్తువు ఎక్కడ ఉంచాలి, ఎక్కడ ఉంచకూడదు, ఏ మొక్కలు ఏ దిశలో, ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు ఇలా చాలా కీలకమైన వివరాల ప్రస్తావన ఉంది వాస్తుశాస్త్రంలో. ముఖ్యంగా కొన్ని ఫోటోల్ని బెడ్ రూమ్ లో ఏ మాత్రం ఉంచకూడదట.

ఇంట్లో ఏ వస్తువు ఎక్కడ ఉంచాలనే ప్రస్తావన వాస్తుశాస్త్రంలో ఉంది. ఇంట్లో కొన్ని వస్తువులు పెట్టకూడదని కూడా వాస్తుశాస్త్రం చెబుతోంది. ముఖ్యంగా బెడ్రూమ్స్‌లో కొన్ని వస్తువులు ఉంచడం వల్ల..భార్యాభర్తల జీవితంలో విబేధాలు ఏర్పడుతాయంటున్నారు జ్యోతిష్య పండితులు. అంతేకాకుండా..నెగెటివ్ శక్తి ప్రసరిస్తుంది. భార్యాభర్తల జీవితంలో మాధుర్యం కొనసాగాలంటే..ఎట్టి పరిస్థితుల్లోనూ బెడ్రూమ్‌లో కొన్ని వస్తువులు ఉంచకూడదు. సాధారణంగా అలంకరణలో భాగంగా లేదా...పొరపాటునో ఆ వస్తువుల్ని మనం ఇంట్లో అమర్చుకుంటుంటాం. అందుకే బెడ్రూమ్‌లో ఏ వస్తువులు పెట్టకూడదో పరిశీలిద్దాం..

1. మీ బెడ్‌రూమ్‌లో సముద్రపు కెరటాలు లేదా నీళ్ల ఫోటో ఉంటే వెంటనే తొలగించాలని వాస్తుశాస్త్రం చెబుతోంది. ఎందుకంటే దీనివల్ల భార్యభర్తల మధ్య పరస్పర నమ్మకం తగ్గుతుంది. దాంతోపాటు నీళ్ల ఫోటో అనేది ఆ ఇద్దరి జీవితంలో మూడవ వ్యక్తి ప్రవేశించే సంకేతాలిస్తుంది.

2. మీ బెడ్‌రూమ్‌లో మహాభారత్ లేదా తాజ్‌మహల్ ఫోటో ఉన్నా సరే వెంటనే తొలగించాలి. దీనివల్ల ఇంట్లోనే కాకుండా మనస్సులో కూడా నెగెటివిటీని వ్యాపింపజేస్తుంది. 

3. ఒకవేళ మీ ఇంట్లో హింసాత్మక లేదా క్రూర జంతువు లేదా పక్షి ఫోటో ఉంటే..వెంటనే ఆ ఫోటోను మార్చాల్సిందే. ఎందుకంటే దీనివల్ల ఆ వ్యక్తికి ఆగ్రహం ఎక్కువౌతుంది. అంతేకాదు..పావురం లేదా ఇతర పక్షి ఫోటో బెడ్‌రూమ్‌లో ఉంటే వంశాభివృద్ధిలో కూడా ఆటంకం ఏర్పడుతుంది. 

4. బెడ్‌రూమ్‌లో పూర్వీకుల ఫోటో ఎట్టి పరిస్థితుల్లోనూ ఉంచకూడదు. నిద్రించే చోట పూర్వీకుల ఫోటో ఉండకూడదని వాస్తుశాస్త్రం చెబుతోంది. దీనివల్ల ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ ప్రసారమౌతుంది. 

Also read: Karwa Chauth 2022 Gift Ideas: కర్వా చౌత్ నాడు మీ భార్యకు ఇచ్చే అందమైన బహుమతులివే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu  

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x