పాకిస్తాన్‌లో 30% పెరిగిన ముస్లిమేతర ఓటర్లు..హిందువులే టాప్

పాకిస్తాన్‌‌లో జూన్ 25న సాధారణ ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే.

Last Updated : May 28, 2018, 10:58 PM IST
పాకిస్తాన్‌లో 30% పెరిగిన ముస్లిమేతర ఓటర్లు..హిందువులే టాప్

పాకిస్తాన్‌‌లో జూన్ 25న సాధారణ ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ముస్లిం మెజారిటీ దేశమైన పాకిస్తాన్‌లో ముస్లిమేతర ఓటర్ల సంఖ్య గతంలో కంటే పెరిగిందని పాకిస్తాన్‌కు చెందిన ద్వాన్ న్యూస్ నివేదికొకటి పేర్కొంది. 2013లో 27 లక్షలుగా ఉన్న ముస్లిమేతర ఓటర్ల సంఖ్య ఈ ఏడాది 30 శాతం పెరిగి 36 లక్షలకు చేరిందని తెలిపింది. ముస్లిమేతర మైనారిటీ ఓటర్లలో హిందూ ఓటర్ల సంఖ్యనే అధికం. 2013 ఎన్నికల సమయంలో 14 లక్షలుగా ఉన్న హిందూ ఓటర్ల సంఖ్య ప్రస్తుతం 17 లక్షలకు చేరింది.

హిందువుల తర్వాత అత్యధిక మైనారిటీ ఓటర్లుగా క్రైస్తవులు (16లక్షలు) ఉన్నారని, పార్శి ఓటర్ల సంఖ్య కూడా పెరిగిందని నివేదిక పేర్కొంది. ఈ నెల 31తో ప్రస్తుత ప్రభుత్వ పదవీ కాలం గడవు ముగుస్తుంది. దీంతో పాకిస్తాన్‌ ఎన్నికల కమిషన్‌ (ఈసీపీ) ఆ దేశ అధ్యక్షుడి అనుమతి కోరుతూ లేఖ రాయగా.. జూలై 25, 27 మధ్య ఎన్నికలు నిర్వహించేందుకు అనుమతి లభించింది. కాగా వరుసగా రెండవసారి ఎన్నికైన ఈ ప్రభుత్వం ఐదు సంవత్సరాల పదవీకాలం పూర్తిచేసింది. ప్రస్తుత ప్రభుత్వం 2013లో ఎన్నికయింది.

Trending News