Kidney Care Tips: ఈ ఫ్రూట్స్ తింటే చాలు జీవించినంతకాలం మీ కిడ్నీలు సేఫ్

Kidney Care Tips: శరీరంలో గుండె తరువాత అతి ముఖ్యమైన అంగం కిడ్నీలు. కిడ్నీల అనారోగ్యం ప్రాణాంతకం కావచ్చు. అందుకే కిడ్నీలు ఎప్పుడూ ఆరోగ్యంగా, పటిష్టంగా ఉండాలి.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Oct 18, 2022, 11:02 PM IST
Kidney Care Tips: ఈ ఫ్రూట్స్ తింటే చాలు జీవించినంతకాలం మీ కిడ్నీలు సేఫ్

శరీరంలో గుండెతో పాటు ఊపిరితిత్తులు, కిడ్నీలు చాలా ముఖ్యమైన అంగాలు. కిడ్నీలు పోషించే పాత్ర అత్యంత కీలకం. కిడ్నీలు పూర్తి ఆరోగ్యంగా ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉంటాం. కిడ్నీలు ఎప్పటికీ ఆరోగ్యంగా పటిష్టంగా ఉండాలంటే ఏం తినాలో తెలుసుకుందాం..

కీరాలో 80 శాతం ఉండేది నీళ్లే. ఇందులో ప్రోటీన్లు, ఫైబర్, మెగ్నీషియం, ఫాస్పరస్, విటమిన్ ఏ, బి, కే, పొటాషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి.

జైతూన్ ఆయిల్ ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో ఉండే మోనో శాచ్యురేటెడ్ ఫ్యాట్ కారణంగా కిడ్నీలు ఎక్కువకాలం ఆరోగ్యంగా ఉంటాయి.

వెల్లుల్లిని ఆయుర్వేదంలో ఔషధంగా పిలుస్తారు. వెల్లుల్లిలో విటమిన్ సి, మాంగనీస్, విటమిన్ బి6 ఉన్నాయి. ఇందులో యాంటీ స్వెల్లింగ్ గుణాలు ఎక్కువ. 

ఆకుపచ్చని ఆకు కూరల్లో ఫైబర్, మినరల్స్, విటమిన్లతో పాటు యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉన్నాయి. ఇవి కిడ్నీ ఆరోగ్యానికి మేలు చేస్తాయి.

కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ తగినంత నీరు తప్పకుండా తాగాలి. నీళ్లు ఎక్కువ తాగడం ఆరోగ్యానికి మంచిదే. దీనివల్ల శరీరంలోని విష పదార్ధాలు బయటకు తొలగిపోతాయి.

యాపిల్‌లో పేక్టిన్ అనే ఫైబర్ ఉంటుంది. ఇది కిడ్నీ సంబంధిత సమస్యల్ని దూరం చేస్తుంది. కిడ్నీ డ్యామేజ్ ముప్పును తగ్గిస్తుంది

కాలిఫ్లవర్‌లో సోడియం, పొటాషియం, ఫాస్పరస్‌తో పాటు విటమిన్లు, ఫోలెట్ ఉంటాయి. ఇవి కిడ్నీ ఆరోగ్యానికి దోహదపడతాయి.

సాల్మన్, టూనా ఫిష్ ఆరోగ్యానికి చాలా మంచిది. చేపల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ పుష్కలంగా లభిస్తుంది. ఇది రక్తపోటును నియంత్రిస్తుంది. 

బ్లూబెర్రీలో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. బ్లూబెర్రీలో సోడియం, ఫాస్పరస్, పొటాషియం కూడా ఉంటాయి

Also read: Health Tips: ఒక్క ఫ్రూట్ చాలు, శరీరానికి కావల్సిన అన్ని పోషకాలకు గ్యారంటీ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu  

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News