Shocking: యూపీలో షాకింగ్ ఘటన... గుండెపోటుతో కుర్చీలోనే ప్రాణాలు వదిలిన జిమ్‌ ట్రైనర్‌..వైరల్ అవుతున్న వీడియో..

Shocking Incident: యూపీలోని షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఘజియాబాద్ కు చెందిన జిమ్ ట్రైనర్ కూర్చున్న కుర్చీలోనే గుండెపోటుతో ప్రాణాలు వదిలాడు. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Oct 20, 2022, 10:41 AM IST
Shocking: యూపీలో షాకింగ్ ఘటన...  గుండెపోటుతో కుర్చీలోనే ప్రాణాలు వదిలిన జిమ్‌ ట్రైనర్‌..వైరల్ అవుతున్న వీడియో..

Shocking Incident: ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్ జిల్లాలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. గుండెపోటు రావడంతో తను కూర్చున్న కుర్చీలోనే ప్రాణాలు వదిలాడు ఓ జిమ్‌ ట్రైనర్‌ (gym trainer). ఇది ఆదివారం రాత్రి జరిగింది. ఈ ఘటన సీసీటీవీ కెమెరాలో రికార్డైంది. అది కాస్తా సోషల్ మీడియాలో వైరల్ అయింది. 

33 ఏళ్ల జిమ్ ట్రైనర్ ఆదిల్ కు నగరంలోని షాలిమార్ గార్డెన్ ప్రాంతంలో జిమ్‌ ఉంది. అతడికి రోజూ వ్యాయామం చేయడం అలవాటు. ఎప్పటిలాగే ఆదివారం కూడా జిమ్ కు వెళ్లి తన పనిచేసుకుంటూ ఉన్నాడు. ఇంతలో ఒక్కసారిగా కుర్చీలో వెనక్కి ఒరిగి సడన్ గా మృతి చెందడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. జిమ్ ట్రైనర్‌ను అతని సహచరులు ఆసుపత్రికి తరలించగా.. మార్గమధ్యలోనే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. జ్వరం వచ్చినా జిమ్‌కి వెళ్లడం మానేవాడు కాదని అతడి కుటుంబసభ్యులు తెలిపారు. మృతుడికి భార్య, నలుగురు పిల్లలు ఉన్నారు. ఈ ఘటనతో ఆ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఆదిల్‌ జిమ్ తో పాటు రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా చేసేవాడు.

గతంలో..
రెండు వారాల కిందట ఇలాంటి ఘటనే ఒకటి చోటుచేసుకుంది. నవరాత్రుల సందర్భంగా ఓ వ్యక్తి గర్భా ఆడుతూ గుండెపోటుతో మరణించాడు. ఇలానే మరో సంఘటన సెప్టెంబరు  7న బరేలీలో జరిగింది. తన పుట్టినరోజు వేడుకలో డ్యాన్స్ చేస్తూ 48 ఏళ్ల వ్యక్తి సడన్ గా కిందపడిపోయి మృతి చెందాడు. 

Also Read: Lion Viral Video: తల్లిని మించిన యోధులు ఎవరూ లేరనే దానికి లైవ్ ఉదాహరణ.. ఏకంగా సింహాన్ని తరిమికొట్టిందిగా! 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News