Lion Viral Video: తల్లిని మించిన యోధులు ఎవరూ లేరనే దానికి లైవ్ ఉదాహరణ.. ఏకంగా సింహాన్ని తరిమికొట్టిందిగా!

Lion Attacks Baby Giraffe: ప్రపంచంలో తల్లిని మించిన యోధులు ఎవరు లేరు అనే​ డైలాగ్ ను లైవ్ లో నిరూపించింది ఒక తల్లి జిరాఫీ, తన పిల్లను ఎటాక్ చేసిన సింహాన్ని ఏమి  చూడండి 

Written by - Chaganti Bhargav | Last Updated : Oct 19, 2022, 07:04 PM IST
Lion Viral Video: తల్లిని మించిన యోధులు ఎవరూ లేరనే దానికి లైవ్ ఉదాహరణ.. ఏకంగా సింహాన్ని తరిమికొట్టిందిగా!

 Lion Attacks Baby Giraffe: ప్రపంచంలో తల్లిని మించిన యోధులు ఎవరు లేరు అనే విషయం అందరూ అంగీకరించి తీరాల్సిందే. అమ్మ ప్రేమ గురించి మనం అనునిత్యం వింటూనే ఉంటాం, చూస్తూనే ఉంటాం. ఎంతోమంది తల్లి ప్రేమ గురించి ఎంతో గొప్పగా చెబుతూ ఉంటారు. కేజీఎఫ్ లాంటి సూపర్ హిట్ సినిమాలో కూడా అమ్మ ఔన్నత్యాన్ని చాటి చెప్పే విధంగా తన తల్లికి ఇచ్చిన మాట కోసం యష్ లాంటి హీరో ప్రపంచంలో ఉన్న బంగారం మొత్తాన్ని సాధించేందుకు సిద్ధమవుతాడు.

అలాంటి తల్లి ప్రేమ గురించి ఎంత చెప్పినా తక్కువే. కేజిఎఫ్ సినిమాలో యష్ ఒక డైలాగ్ చెబుతాడు. ఈ ప్రపంచంలో అమ్మకి మించిన యోధులు ఇంకెవరూ లేరు అని, అది చాలా సందర్భాలలో నిజమే అనిపిస్తూ ఉంటుంది. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అయిన ఒక జంతువుల వీడియో కూడా అదే నిర్వచనం చెబుతోంది. ఈ మధ్యకాలంలో ఎక్కువగా జంతువుల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చిన్నపిల్లలు మాత్రమే కాకుండా పెద్దవారు సైతం ఈ వీడియోలు చూడటానికి ఆసక్తి చూపిస్తున్నారు.

 
 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Animal Power (@animals_powers)

తాజాగా ఇంస్టాగ్రామ్ లో ఒక వీడియో వైరల్ అయింది. చాలా తక్కువ నడివి ఉన్న ఆ వీడియోలో ఒక జిరాఫీ పిల్ల మీద సింహం ఎటాక్ చేయడానికి వెళితే దాన్ని తల్లి జిరాఫీ తరిమి కొట్టింది. అసలు విషయానికి వస్తే అడవిలో ఒక జిరాఫీ పిల్ల సేద తీరుతూ ఉండగా ఎక్కడి నుంచి వచ్చిందో కానీ ఒక మాయదారి సింహం వచ్చి రావడమే గొంతు పట్టుకుంది. గొంతు పట్టుకుంటే కదలలేక అల్లాడిపోతున్న జిరాఫీ పిల్ల పని అయిపోయిందని వీడియో చూస్తున్న వారందరూ భావిస్తున్న సమయంలో తల్లి జిరాఫీ ఎక్కడ ఉందో గాని పరుగు పరుగున వచ్చి సింహం మీద ఎటాక్ చేయబోయింది.

జిరాఫీ పరిగెత్తుకుంటూ రావడం చూసిన సింహం ఒక్కసారిగా షాక్ తిని పిల్ల జిరాఫీ గొంతు కొరకడం ఆపేసి కళ్ళు అప్పగించి చూస్తూ ఉండిపోయింది. ఇక తన మీద దాడి చేస్తుందేమో అనే ఉద్దేశంతో ఆ పిల్ల జిరాఫీని వదిలి పరుగు లంకించుకుంది. తల్లి ప్రేమ అంటే ఇదేనని ఒక కోడి కూడా తన కోడి పిల్లల్ని ఏదైనా చేయడానికి వస్తే ఎదురు తిరుగుతుందని పలువురు కామెంట్ చేస్తున్నారు. బహుశా ఇదేనేమో తల్లి ప్రేమంటే అంటూ కామెంట్లు వస్తున్న ఈ వీడియోకి చాలా తక్కువ సమయంలోనే  మంచి లైక్స్ వచ్చాయి అలాగే పెద్ద ఎత్తున కామెంట్లు కూడా చేస్తున్నారు నెటిజన్లు. 

Also Read: Black King Kobra: లేడీ స్నేక్ స్నాచర్‌కు చుక్కలు చూపించిన బ్లాక్ కింగ్ కోబ్రా.. 'తగ్గేదేలే' అంటూ ఒట్టిచేతులతో పట్టేసుకుంది!

Also Read: Viral Video: ఆ వీడియో తీసినందుకు.. ఇద్దరు యువకులను 4 గంటలు చితకబాదిన ఆసుపత్రి నర్సులు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

  

Trending News