Shani pradosh vrat 2022: కార్తీక మాసం మొదటి ప్రదోష వ్రతం మరో రెండు రోజుల్లో అంటే 22 అక్టోబర్ 2022, శనివారం నాడు వస్తుంది. కార్తీక మాసంలోని కృష్ణ పక్షం త్రయోదశి నాడు ఆచరించే ప్రదోష వ్రతం చాలా శుభఫలితాలను ఇస్తుంది. అంతేకాకుండా ధంతేరాస్ ముందు రోజు అయిన శనివారం నాడు వస్తుంది కాబట్టి దీనిని శని ప్రదోష వ్రతం అంటారు. దీంతో మీకు శివుడు, శనిదేవుడు, లక్ష్మీదేవిల అనుగ్రహం ఉంటుంది. సూర్యాస్తమయం తర్వాత ప్రదోషకాలం ప్రారంభమవుతుంది. ప్రదోష వ్రతంలో శివుడిని పూజిస్తారు. ఈరోజున శివుడిని ప్రసన్నం చేసుకోవడం ద్వారా శని యెుక్క అశుభ ప్రభావాలు తొలగిపోతాయి. శని ప్రదోష వ్రతం ముహూర్తం మరియు పరిహారం తెలుసుకుందాం.
శని ప్రదోష వ్రత 2022 ముహూర్తం
కార్తీక కృష్ణ త్రయోదశి తిథి ప్రారంభం - 22 అక్టోబర్ 2022, సాయంత్రం 06.02
కార్తీక కృష్ణ త్రయోదశి తేదీ ముగింపు - 23 అక్టోబర్ 2022, సాయంత్రం 06.03
శివపూజ ముహూర్తం - సాయంత్రం 06.07 - రాత్రి 08.36(22 అక్టోబర్ 2022)
శని ప్రదోష వ్రతం ప్రాముఖ్యత
వైవాహిక జీవితం బాగుండటానికి, సంతానాన్ని పొందడానికి, అప్పుల బాధ నుండి విముక్తి కోసం, ఉద్యోగ, వ్యాపారాల్లో పురోభివృద్ధి, శని యెుక్క సడే సతి మరియు ధైయా నుండి బయటపడటానికి ప్రదోష వ్రతాన్ని ఆచరిస్తారు.
శని ప్రదోష వ్రతం కోసం పరిహారాలు
>> శని యెుక్క అశుభ ప్రభావం తగ్గడానికి... ఈ రోజున తలస్నానం చేసి శివలింగానికి నల్ల నువ్వులను సమర్పించండి. దీనివల్ల ఆర్థిక పరిస్థితి మెరుగుపడటంతోపాటు మీ జీవితంలోని కష్టాలన్నీ తొలగిపోతాయి
>> శని ప్రదోష వ్రతం రోజున పేదవారికి ఆహారం, బట్టలు లేదా చెప్పులు దానం చేయడం చాలా పుణ్యం. దీనితో శనిదేవుడు చాలా సంతోషించి మీపై వరాల జల్లు కురిపిస్తాడు.
>> ప్రదోష కాలంలో భోలేనాథ్‌కు రుద్రాభిషేకం చేసిన తర్వాత, శివ చాలీసా పారాయణం చేయడంతోపాటు శని స్తోత్రాన్ని పఠించాలి. ఇది పితృ దోషం మరియు సాడేసతి యొక్క అశుభ ప్రభావాలను తగ్గిస్తుంది.
Also Read: Shani Margi 2022: అక్టోబరు 23న శని గమనంలో పెను మార్పు...మూడు నెలల పాటు ఈ 5 రాశులకు డబ్బే డబ్బు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook