Dhanteras 2022: ధన్తేరస్, దీపావళి రోజు ఈ ఒక్క పని చేయండి.. లక్ష్మి దేవి మీ ఇంటి తలుపు తట్టడం ఖాయం..

Dhanteras 2022 On Jand Plant: ధన్తేరస్, దీపావళి సందర్భంగా పలు రాశులపై శని ప్రభావవం పడబోతోంది. అయితే ఈ కారణంగా అన్ని రాశులవారు ఈ చెట్టు పాటు, లక్ష్మి దేవిని పూజించడం వల్ల మంచి ప్రయోజనాలు పొందుతారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 21, 2022, 11:33 AM IST
  • అక్టోబర్ 22, 23 తేదీల్లో ఈ ఒక్క పని చేయండి.
  • లక్ష్మి దేవి మీ ఇంటి తలుపు తట్టడం ఖాయం.
  • ఆర్థికపరమైన సమస్యలు కూడా దూరమవుతాయి.
Dhanteras 2022: ధన్తేరస్, దీపావళి రోజు ఈ ఒక్క పని చేయండి.. లక్ష్మి దేవి మీ ఇంటి తలుపు తట్టడం ఖాయం..

Dhanteras 2022 On Jand Plant: ధన్తేరస్, దీపావళి సందర్భంగా గ్రహాల రాశుల కలయికలు అందరికీ ప్రయోజనాలు చేకూర్చే విధంగా ఉన్నాయని జోతిష్య శాస్త్రంలో పేర్కొంది.  కార్తీక మాసంలోని త్రయోదశి తిథి అక్టోబర్ 22 సాయంత్రం నుంచి ప్రారంభం కానుంది. అయితే ఈ ఘడియలు అక్టోబర్ 23 వరకు కొనసాగుతాయి. అయితే ఇదే క్రమంలో శని గ్రహం అక్టోబర్‌ 23న మకరరాశిలోకి సంచరించబోతున్నాడు. దీని ప్రభావవం అన్ని రాశులపై పడే ఛాన్స్‌ ఉంది. అయితే ఈ నెల 23 ఎంతో ప్రత్యేకమైన రోజుగా భావించ వచ్చు. శనికి శమీ మొక్కకు ప్రత్యేక సంబంధం కలిగి ఉంది. శమీ మొక్క శని దేవునికి చాలా ప్రీతికరమైనది. ధన్తేరస్ రోజు కుబేరునికి శమీ మొక్కలను కూడా సమర్పిస్తారు. అయితే ఈ క్రమంలో (ధంతేరస్, దీపావళీ ) జమ్మి చెట్టు నాటడం వల్ల ఆర్థిక పరమైన సమస్యలు తీరుతాయని శాస్త్ర నిపుణులు తెలుపున్నారు.

జమ్మి చెట్టుకు హిందూ మత గ్రంథాలో చాలా ప్రముఖ్యతను ఇచ్చారు. జ్యోతిషశాస్త్రంలో ఈ చెట్టు  సంపదను ఇచ్చే మొక్కగా పరిగణిస్తారు. అయితే ఈ దీపావళి రోజున ఈ మొక్కను పూజించడం వల్ల అన్ని రకాల ఆర్థిక పరమైన సమస్యలు తీరుతాయని శాస్త్రం పేర్కొంది. అంతేకాకుండా లక్ష్మి దేవి అనుగ్రహం కూడా లభిస్తుందని శాస్త్రంలో పేర్కొన్నారు. శని దేవుని చెడు ప్రభావవం కూడా ఈ క్రమంలో సులభంగా తగ్గే ఛాన్స్‌ కూడా ఉంది. కాబట్టి తప్పకుండా ఈ క్రమంలో జమ్మి చెట్టును పూజించాలని శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు.

జమ్మి చెట్టుని పూజించడం వల్ల కలిగే ప్రయోజనాలు:
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. ధంతేరస్ లేదా దీపావళి రోజున జమ్మి చెట్టుని నాటి..ప్రత్యేక పూజలు చేయడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలుగొచ్చు. అయితే దీపావళీని పురష్కరించుకుని మంచినీటిని సమర్పించండం చాలా మంచిదని శాస్త్రం చెబుతోంది. ఇంట్లోని ప్రతికూల శక్తి కూడా దూరమవుతుందని శాస్త్రం భావిస్తోంది. అంతేకాకుండా ఈ క్రమంలో మూడు రోజుల పాటు ఈ పూజలు చేయడం వల్ల ఆర్థికపరమైన సమస్యలు కూడా దూరమవుతాయి.

(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ అంచనాలు, సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దానిని నిర్ధారించలేదు.)

Also Read : Electricity Bill fraud: ఆన్‌లైన్ కరెంటు బిల్లు చెల్లిస్తున్నారా..జాగ్రత్త, ఒక్క క్లిక్‌తో ఎక్కౌంట్ ఖాళీ కావచ్చు

Also Read : Free OTT Platforms: నెట్‌ఫ్లిక్స్, అమెజాన్, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఏడాది ఉచితంగా కావాలా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News