Dhanteras Cow Upay: దీపావళి పండుగకన్న ముందే ధన్‌తేరస్ పండగ ప్రారంభమవుతుంది. అయితే ఈ పండగకు భారత్‌లో ఎంతో ప్రముఖ్యత ఉంది. ప్రతి సంవత్సరం అమావాస్యకు ముందు జరుపుకునే ఈ పండగ రోజున భక్తులంతా శ్రీ మహా విష్ణువును ఆరాధన చేస్తారు. దీపావళీ పండగ ప్రతి ఏడాది అమావాస్య రోజున వస్తుంది. అందుకే భారతీయులు లక్ష్మిదేవి అనుగ్రహం కోసం ఆ రోజు అమ్మవారి పూజిస్తారు. పండగ రోజున భక్తి శ్రద్ధలతో లక్ష్మి దేవిని పూజించడం వల్ల ఆర్థిక పరమైన కష్టాలన్ని తొలగిపోతాయని భారతీయులు నమ్మకం. దీపావళీకి ఐదు రోజుల ముందునుంచే కొన్ని పరిహారాలు పాటిస్తారు. ఇలా చేయడం వల్ల కుబేరుని అనుగ్రహంతో పాటు అమ్మవారి అనుగ్రహం ఎల్లపు లభిస్తుందని జోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ధన త్రయోదశి రోజున (రోజున) ఇట్లో పలు రకాల పరిహారాలు పాటిస్తే అన్ని రకాల ప్రయోజనాలు కలుగుతాయని జోతిష్య శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు. అయితే ఈ పరిహారాలేంటో మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నం.
ధన త్రయోదశి రోజున ఆవుకు ఇలా ఆహారాలు తిని పించండి:
>>హిందూ మతంలో ఆవుకు ఎంతో ప్రాధాన్యతను ఇచ్చారు. సాక్ష్యాత్తు ఆవులో లక్ష్మిదేవితో పాటు 33 దేవతలు ఉంటాయని హిందువు భక్తులు నమ్ముతారు. అయితే ధన త్రయోదశి రోజున గోవుకు పలు ఆహారాలను తినిపించడం వల్ల లక్ష్మీదేవి ఆశీర్వాదం పొందవచ్చని జోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.
>>ధన్తేరస్, దీపావళి పండగలు భారతీయులకు చాలా పవిత్రమైనవి. అయితే ఈ రెండు రోజులు ఆవుకు తెల్ల బియ్యం, రొట్టెలు తినిపిస్తే ఆర్థిక సమస్యలు దూరమవడమేకాకుండా ఐశ్వర్యం, సంపదలు చేకూరుతాయని జోతిష్య శాస్త్ర నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అంతేకాకుండా కోరుకున్న కోరికలు కూడా త్వరలోనే నెరవేరుతాయి. అయితే తప్పకుండా ఆవుకు లక్ష్మి పూజ చేసిన తర్వాతే ఇలా తినిపిస్తే అనుగ్రహం లభిస్తుంది.
>>ఇలా ఆవుకు తినిపిస్తే పూర్వ జన్మలో చేసిన పాపాల నుంచి కూడా విముక్తి లభిస్తుంది. అయితే ధన త్రయోదశి రోజున ఆవుకి నువ్వులు లేదా నువ్వుల లడ్డూలు తినిపించడం వల్ల రెట్టింపు ప్రయోజనాలు పొందవచ్చు.
>>ధంతేరస్, దీపావళి రోజున ఆవుకు మూడు పిడికెల గోధుమ గింజలు తినిపిస్తే..కుటుంబంలో అన్ని రకాల సమస్యలు తీరుతాయి. అంతేకాకుండా దీర్ఘకాలిక వ్యాధులు కూడా సులభంగా నయమవుతాయి.
Also Read : Vishnu Manchu Ginna Collections : జిన్నా పరిస్థితి మరీ దారుణంగా.. 50 షోలకు 49 టికెట్లు తెగాయా?
Also Read : Kantara 7 Days collection : ఏడురోజులకు ఐదురెట్ల లాభాలు.. ఆగని కాంతారా కాసుల వర్షం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook