PawanKalyan with Meher Ramesh: పవన్ తో సినిమా చేసి తీరతానన్న మెహర్ రమేష్..టెన్షన్లో మెగా ఫాన్స్!

Meher Ramesh film with PawanKalyan: మెగాస్టార్ చిరంజీవితో భోళా శంకర్ చేస్తున్న మెహర్ రమేష్ ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ తో సినిమా చేస్తానని ప్రకటించడంతో మెగా ఫాన్స్ టెన్షన్ పడ్డారు. ఆ వివరాల్లోకి వెళితే 

Written by - Chaganti Bhargav | Last Updated : Oct 24, 2022, 02:55 PM IST
PawanKalyan with Meher Ramesh: పవన్ తో సినిమా చేసి తీరతానన్న మెహర్ రమేష్..టెన్షన్లో మెగా ఫాన్స్!

Meher Ramesh Ready to do a film with PawanKalyan: దర్శకుడు మెహర్ రమేష్ తెలుగులో బిల్లా, శక్తి, కంత్రి వంటి సినిమాలతో మంచి పేరు తెచ్చుకున్నారు. చివరిగా షాడో సినిమాతో ఆయన సినిమాలు చేయడం ఆపేశారు. సుదీర్ఘ విరామం తర్వాత ఆయన మెగాస్టార్ చిరంజీవి హీరోగా తమిళంలో సూపర్ హిట్గా నిలిచిన వేదాళం అనే సినిమాని తెలుగులో రీమేక్ చేస్తున్నారు. వాస్తవానికి ఈ వేదాళం సినిమాని తెలుగులో ఆవేశం పేరుతో డబ్బింగ్ చేసి రిలీజ్ చేశారు.

కానీ సబ్జెక్ట్ నచ్చడంతో మెగాస్టార్ చిరంజీవి ఆ సినిమా చేయడానికి సిద్ధమయ్యారు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ప్రస్తుతానికి ఈ సినిమాను నిర్మిస్తోంది, బిల్లా సినిమా రీ రిలీజ్ అవుతున్న నేపథ్యంలో మరోసారి మెహర్ రమేష్ పేరు ఒక్కసారిగా తెర మీదకు వచ్చింది. ప్రభాస్ లాంటి హీరోతో స్టైల్ సెంటర్ బిల్లా చేసిన ఆయనతో పలు యూట్యూబ్ ఛానల్స్ ఇంటర్వ్యూలు నిర్వహించాయి. ఈ సందర్భంగా తాను పవన్ కళ్యాణ్ తో ఒక సినిమా చేయబోతున్నానని మెహర్ రమేష్ ప్రకటించారు.

నేను మెంటల్ గా ఫిక్స్ అయిపోయానని కచ్చితంగా ఆయనతో సినిమా చేసి తీరుతానని రమేష్ కామెంట్ చేయడం ఆసక్తికరంగా మారింది. నిజానికి వేదాళం శంకర్ విషయంలోనే మెగా అభిమానులు చాలా టెన్షన్ పెట్టుకున్నారు, ఇప్పటికే ఆచార్య లాంటి భారీ డిజాస్టర్ తర్వాత గాడ్ ఫాదర్ కొంత వరకు వారిని తలెత్తుకునేలా చేసింది. కానీ భోలా శంకర్ రిజల్ట్ ఎలా ఉండబోతుందో అని వారంతా టెన్షన్ లో ఉన్నారు. ఇలాంటి సమయంలో తాను పవన్ కళ్యాణ్ తో కూడా సినిమా చేస్తానని మెహర్ మెహర్ రమేష్ ప్రకటించడంతో ఇప్పుడు పవన్ అభిమానుల్లో ఆందోళన నెలకొంది.

మెహర్ రమేష్ పవన్ కళ్యాణ్ తో సినిమా చేసే అవకాశాలు లేకపోలేదు, ఎందుకంటే పవన్ కళ్యాణ్ చిరంజీవి కుటుంబాలకు మెహర్ రమేష్ దగ్గర బంధువు కావడంతో కచ్చితంగా ఆయనకు కలిసి వస్తుంది అని ఉద్దేశంతో అయినా మెగా కుటుంబాల హీరోలు ఆయనతో  సినిమాలు చేయడానికి ముందుకు వస్తారని ఒకవేళ ఏమైనా తేడా పడితే అభిమానులుగా తాము తలెత్తుకోలేకపోతున్నామని అభిమానులు అంతా టెన్షన్ పడుతున్న పరిస్థితి కనిపిస్తోంది.

అయితే ఏ దర్శకుడు కూడా సినిమా పోవాలనే ఉద్దేశంతో చేయడు, ఒక్కోసారి ప్రేక్షకుల అంచనాలను అందుకోవాలని ఎంత ప్రయత్నించినా వర్కౌట్ కాకపోవచ్చు. ఈ నేపథ్యంలో ఈసారి ఎలా అయినా హిట్ అందుకోవాలని ఉద్దేశంతో భోళా శంకర్ సినిమాకి చాలా కసిగా పనిచేస్తున్నాడు మెహర్ రమేష్. ఈ భోళా శంకర్ సినిమా కనుక హిట్టు టాక్ తెచ్చుకుంటే పవన్ కళ్యాణ్ తో చేయబోయే సినిమా విషయంలో ఆయన అభిమానులు పెద్దగా టెన్షన్ పెట్టుకోవక్కర్లేదని అంచనాలు ఉన్నాయి. మరి చూడాలి భవిష్యత్తులో ఏం జరగబోతోంది అనేది.

Also Read: DJ Tillu Sequel: టిల్లు స్క్వేర్.. డీజే టిల్లుకి డబుల్ డోస్.. పూజా హెగ్డేకే స్కెచ్ వేశారు కానీ!

Also Read: Bandala Ganesh - Diwali 2022 : దీపావళి బాంబులకు పెట్టిన ఖర్చు ఎంతంటే?.. బండ్లన్నతో అట్లుంటది.. అన్ని లక్షలా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News