Budh Rashi Parivartan 2022 Effects: వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం, ఒక గ్రహం ఒక రాశి నుండి మరొక రాశికి మారినప్పుడు.. దాని యెుక్క ప్రభావం ప్రజలందరిపై కనిపిస్తుంది. గ్రహాల యువరాజైన బుధుడు వ్యాపారం, మేధస్సు మరియు కమ్యూనికేషన్ కు కారకుడిగా భావిస్తారు. నిన్న అంటే అక్టోబరు 26 మధ్యాహ్నం 1:47 గంటలకు బుధుడు తన రాశిని మార్చి తులరాశిలో (Budh Gochar 2022) సంచరించాడు. మళ్లీ బుధుడు ననంబరు 13న వృశ్చికరాశిలోకి ప్రవేశించనున్నాడు. తులరాశిలో బుధుడి సంచారం ఏ రాశులవారికి మేలు చేస్తుందో తెలుసుకుందాం.
బుధుడి సంచారం ఈ రాశులకు శుభప్రదం
మేషం (Aries)- మేష రాశి వారికి బుధుడు మార్పు వల్ల అపారమైన ప్రయోజనం లభిస్తుంది. ఈ సమయంలో మీరు సరైన నిర్ణయం తీసుకోగలుగుతారు. పార్టనర్ షిప్ తో చేసే పనులు లాభిస్తాయి. విహారయాత్రకు వెళ్లే అవకాశం ఉంది. ధనలాభం ఉంటుంది.
మిథునరాశి (Gemini)- బుధుడి మార్పు మిథునరాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. మీరు మీ కెరీర్‌లో పురోగతిని సాధిసస్తారు. విద్యా రంగానికి సంబంధించిన వ్యక్తులకు ప్రయోజనం ఉంటుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది.
కర్కాటకం (Cancer)- బుధ సంచారం కర్కాటక రాశి వారికి జీవితంలో శాంతిని కలిగిస్తుంది. ఈ సమయంలో మీరు లాభాలను పొందుతారు. ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగం చేస్తున్న వారికి ప్రమోషన్ లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. విద్యార్థులు ప్రయోజనం పొందుతారు.
సింహం (Leo)- బుధ సంచారం సింహ రాశి వారికి వరం. ఈ సమయంలో మీ సంబంధాలు మెరుగుపడతాయి. అన్నదమ్ముల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. మతపరమైన కార్యక్రమాల పట్ల ఆసక్తి కలుగుతుంది. కుటుంబంలో సంతోషం నెలకొంటుంది.
ధనుస్సు (Sagittarius)- బుధుడు మార్పు ధనుస్సు రాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ సమయంలో మీరు డబ్బు సంపాదించడానికి కొత్త మార్గాలను అన్వేషిస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కుటుంబంలో ఆనందం ఉంటుంది. పాత మిత్రులను కలిసే అవకాశం ఉంది.
Also Read: Lakshmi Narayana Yogam: బుధ-శుక్రుల లక్ష్మీనారాయణ యోగం.. ఈ 3 రాశులవారి ఖజానా నిండటం ఖాయం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook