Google Chrome Update: మీ గూగుల్ క్రోమ్ అప్‌డేట్ చేశారా..లేకపోతే ఇంతే సంగతులు, వెంటనే చేయండి మరి

Google Chrome Update: గూగుల్ క్రోమ్ వినియోగిస్తున్నారా..అయితే జాగ్రత్త. అత్యంత ప్రమాదకరమైన బగ్ ఒకటి వేధిస్తోంది. ఈ బగ్ నుంచి ఎలా సంరక్షించుకోవాలో గూగుల్ వెల్లడించింది.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Nov 2, 2022, 12:13 AM IST
Google Chrome Update: మీ గూగుల్ క్రోమ్ అప్‌డేట్ చేశారా..లేకపోతే ఇంతే సంగతులు, వెంటనే చేయండి మరి

స్మార్ట్‌ఫోన్, డెస్క్‌టాప్, ల్యాప్‌టాప్, ట్యాప్ ఏదైనా సరే..గూగుల్ క్రోమ్ వినియోగిస్తుంటే మాత్రం అప్రమత్తం కావల్సిందే. గూగుల్ చెప్పినట్టు తక్షణం యాప్ అప్‌డేట్ చేసుకోకపోతే హ్యాకర్లు మిమ్మల్ని నట్టేట ముంచేస్తారు.

గూగుల్ క్రోమ్ యూజర్లకు గూగుల్ అలర్ట్ జారీ చేసింది. ఇటీవలి కాలంలో ఓ ప్రమాదకరమైన బగ్ సమస్యగా మారి వేధిస్తోంది. ఈ బగ్ నుంచి రక్షించుకునేందుకు వెంటనే గూగుల్ క్రోమ్ యాప్‌ను అప్‌డేట్ చేసుకోమంటోంది. ఈ బగ్ అత్యంత ప్రమాదకరమైందని హెచ్చరిస్తోంది. మీ డివైస్‌ను పాడుచేయడమే కాకుండా..మిమ్మల్ని నట్టేముంచేయగలదు కూడా.

సైబర్ సంస్థ అవాస్ట్ జరిపిన సెక్యూరిటీ రీసెర్చ్ అక్టోబర్ 25న హై సీవీఈ 2022-3723 పేరుతో ఓ బగ్‌నిపెట్టింది. అటు గూగుల్ కూడా పరిశోధనకర్తలకు కృతజ్ఞతలు తెలిపింది. ఈ బగ్ నియంత్రించేందుకు కృషి చేసినవారికి అభినందనలు తెలిపారు.

గూగుల్ క్రోమ్ యూజర్లు ఏం చేయాలి

గూగుల్ క్రోమ్‌లో ఈ బగ్ ద్వారా లాభం పొందే హ్యాకర్ల దాడి నుంచి తప్పించుకునేందుకు కంపెనీ బ్రౌజర్‌ను మ్యాక్, లినెక్స్ కోసం లేటెస్ట్ వెర్షన్ 107.0.5304.87 , విండోస్ కోసం 107.0.5304.87/.88 అప్‌డేట్ చేయమని చెబుతోంది. ఈ వెర్షన్ సమస్యల్ని పరిష్కరించేందుకు, బ్రౌజర్ ల్యాప్సెస్ తొలగించేందుకు పనిచేస్తుంది. అందుకే బ్రౌజర్‌ను అప్‌డేట్ చేయాలి.

గూగుల్ క్రోమ్ అప్‌డేట్ ఎలా చేయాలి

గూగుల్ క్రోమ్ అప్‌డేట్ చేసేందుకు ముందుగా సిస్టమ్ బ్రౌజర్ ఓపెన్ చేయాలి. వెబ్‌స్క్రీన్ పైన కార్నర్‌లో మూడు డాట్స్ క్లిక్ చేయాలి. ఆ తరువాత సెట్టింగ్స్‌లో వెళ్లాలి. ఇప్పుడు ఎబౌట్ క్రోమ్ ఓపెన్ చేయాలి. ఒకవేళ లేటెస్ట్ వెర్షన్‌లో లేకపోతే..ఆటోమెటిక్‌గా అప్‌డేట్ చేస్తుంది. ఇంకా అప్‌డేట్ మీకు చేరకపోతే...మ్యాక్, లినెక్స్ కోసం 107.0.5304.87, విండోస్ కోసం 107.0.5304.87/.88 అప్‌డేట్ కోసం నిరీక్షించాలి.

Also read: OPPO A58 5G launch: ఒప్పో నుంచి సరికొత్త స్మార్ట్‌ఫోన్, ఫీచర్లు ఏమిటి, లాంచ్ ఎప్పుడు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu  

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News