T20 World Cup 2022 IND v BAN Match Turning Point: ఆస్ట్రేలియా గడ్డపై జరుగుతున్న టీ20 ప్రపంచకప్ 2022లో భారత్ మరో అద్భుత విజయం అందుకుంది. సూపర్ 12లో భాగంగా బుధవారం బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో డక్‌వర్త్ లూయిస్ పద్దతిలో ఐదు పరుగుల తేడాతో విజయం సాధించింది. బంగ్లా మ్యాచ్ ఓడినా.. రోహిత్ సేనను వణికించింది. ముఖ్యంగా ఓపెనర్ లిటన్ దాస్ (60; 27 బంతుల్లో 7x4, 3x6) మెరుపు ఇన్నింగ్స్‌తో టీమిండియాకు ముచ్చెమటలు పట్టించాడు. భారత బౌలర్లను ఊచకోత కోస్తూ.. 21 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాదాడు. లిటన్ దాటికి ఓ దశలో భారత బౌలర్లు చేతులెత్తేసినా.. వరణుడి పుణ్యమాని మ్యాచ్ రోహిత్ సేన సొంతమైంది.
185 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్‌కు స్టార్ బ్యాటర్ లిటన్ దాస్ మెరుపు ఆరంను ఇచ్చాడు. భారత బౌలర్లకు చుక్కలు చూపిస్తూ.. బౌండరీల వర్షం కురిపించాడు. ఈ క్రమంలో కేవలం 21 బంతుల్లో అర్థ సెంచరీ మార్క్ అందుకున్నాడు. ఆ తర్వాత కూడా లిటన్ జోరు చూపించాడు. లిటన్ జోరును చూసిన అందరూ బంగ్లా సులువుగా గెలుస్తుంది అనుకున్నారు. అయితే వరణుడు టీమిండియాను కరుణించాడు. 7 ఓవర్ తర్వాత చిరుజల్లు పడడంతో మ్యాచ్‌ను కాసేపు నిలిపివేశారు. అప్పటికే బంగ్లా చేయాల్సిన స్కోరు కన్నా 17 పరుగులు ఎక్కువ చేసింది. వర్షం తగ్గకపోతే.. డక్‌వర్త్ లూయిస్ పద్దతిలో బంగ్లాదేశ్ విజేతగా నిలిచేది.
వరుణుడు శాంతించడంతో మ్యాచ్ మళ్లీ మొదలైంది. డక్‌వర్త్ లూయిస్ పద్దతిలో బంగ్లాదేశ్ లక్ష్యాన్ని 16 ఓవర్లలో 151 పరుగులుగా మార్చారు. అప్పటికే 7 ఓవర్లు ఆడిన బంగ్లా.. 9 ఓవర్లలో 85 పరుగులు చేయాల్సి వచ్చింది. 85 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన బంగ్లా దూకుడుగా ఆడింది. అయితే అనూహ్యంగా లిటన్ దాస్ రనౌట్ కావడం మ్యాచ్‌ను మలుపు తిప్పింది. వర్షం తర్వాత మ్యాచ్ మొదలైన మొదటి బంతికి లిటన్ సింగల్ తీశాడు. అశ్విన్ వేసిన రెండో బంతికి శాంటో షాట్ ఆడగా.. మొదటి రన్ పూర్తిచేశారు. రెండో రన్ తీసేందుకు లిటన్ వేగంగా పరుగెత్తాడు.
Fantastic direct throw by KL Rahul to get the main man, Liton Das. pic.twitter.com/zzmfbuScJg
— Mufaddal Vohra (@mufaddal_vohra) November 2, 2022
లెగ్ సైడ్ ఫీల్డింగ్ చేస్తున్న కేఎల్ రాహుల్ వేగంగా కదిలి బంతిని అందుకుని వికెట్లకు విసిరాడు. రాహుల్ సంధించిన డైరెక్ట్ త్రో వికెట్లను గిరాటేసింది. రనౌట్ నుంచి కాపాడుకోవడానికి లిటన్ డైవ్ కొట్టినా.. ఉపయోగం లేకుండా పోయింది. ఇంకేముందు లిటన్ నిరాశగా పెవిలియన్ చేరగా.. భారత ప్లేయర్స్ సంబరాలు చేసుకున్నారు. ఆపై వచ్చిన బంగ్లా బ్యాటర్స్ దాటిగా విజయం ముంగిట నిలిచిపోయారు. మ్యాచ్ టర్నింగ్ పాయింట్ రాహుల్ వేసిన 'డైరెక్ట్ త్రో'. లేదంటే లిటన్ ఒంటిచేత్తో మ్యాచ్ గెలిపించేవాడు. రాహుల్ 'డైరెక్ట్ త్రో'కు ఫిదా అయిన ఫాన్స్ అతడిని ఆకాశానికి ఎత్తేస్తున్నారు. మొన్నటి వరకు విమర్శించిన వారు ఈరోజు ప్రశంసిస్తూన్నారు.
Also Read: IND vs BAN Updates: చివరి బంతి వరకు ఉత్కంఠ.. బంగ్లాపై భారత్ విజయం!
Also Read: How To Lose Weight: బరువు తగ్గే క్రమంలో ఉదయం పూట ఇలా చేస్తున్నారా.. ఇక అంతే సంగతి..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook
IND vs BAN: భారత్, బంగ్లాదేశ్ మ్యాచ్ టర్నింగ్ పాయింట్ ఇదే.. తిట్టినోళ్లే పోగుడుతున్నారుగా (వీడియో)!
ఐదు పరుగుల తేడాతో విజయం
భారత్, బంగ్లాదేశ్ మ్యాచ్ టర్నింగ్ పాయింట్
తిట్టినోళ్లే పోగుడుతున్నారుగా