ప్రస్తుత జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్ల కారణంగా వివిధ రకాల అనారోగ్య సమస్యలు వెంటాడుతుంటాయి. ముఖ్యంగా చలికాలంలో మరింతగా ఉంటుంది ఈ సమస్య. మరి ఈ సమస్య నుంచి ఉపశమనం పొందేందుకు ఏం చేయాలి..
చలికాలంలో సాధారణంగా రోగ నిరోధక శక్తి పడిపోతుంటుంది. ఎప్పుడైతే ఇమ్యూనిటీ పడిపోతుందో..వివిధ రకాల ఇన్ఫెక్షన్లు, రోగాలు దరిచేరుతుంటాయి. వ్యాధుల ముప్పు ఎక్కువౌతుంది. అదే సమయంలో దేశంలోని కొన్ని ప్రాంతాల్లో చలికాలం వస్తే చాలు కాలుష్యం పెరిగిపోతుంటుంది. ఇదంతా కంటి వెలుగుపై కూడా తీవ్ర ప్రభావం చూపిస్తుంటుంది. కంటి వెలుగు తగ్గిపోతుంది. ఈ సమస్య నుంచి విముక్తి పొందేందుకు ప్రకృతిలో లభించే ఓ పదార్ధం పుష్కలంగా ఉపయోగపడుతుంది. కంటి వెలుగును పెంచడమే కాకుండా..ఇమ్యూనిటీని పటిష్టం చేస్తుంది.
ఉసిరి జ్యూస్ ప్రయోజనాలు
ఇమ్యూనిటీ పడిపోతున్నప్పుడు ఉసిరి జ్యూస్ అద్భుతంగా ఉపయోగపడుతుంది. కంటి వెలుగును పెంచుతుంది. రోజూ క్రమం తప్పకుండా తీసుకుంటే శరీరంలో రెడ్ బ్లడ్ కౌంట్, హిమోగ్లోబిన్ స్థాయి పెరుగుతుంది. ఇందులో ఉన్న విటమిన్ సి , ఫ్లెవనాయిడ్స్ ఇందుకు అద్భుతంగా ఉపయోగపడతాయి. చర్మానికి సంరక్షణ కల్గిస్తాయి. డార్క్ స్పాట్, పిగ్మంటేషన్ తగ్గుతుంది.
ఉసిరి జ్యూస్ అనేది కంటి వెలుగు పెంచడంలో దోహదపడుతుంది. దీంతోపాటు శరీరాన్ని హైడ్రేట్ చేస్తుంది. దీంతో శరీరంలో నీటి కొరత ఏర్పడదు. ఇమ్యూనిటీ సామర్ధ్యాన్ని పెంచుతుంది. ఫలితంగా ఏ విధమైన రోగాలు దరిచేరవు. ఇందులో ఉన్న ఫైటోన్యూట్రియంట్స్ ఇమ్యూనిటీని మెరుగుపరుస్తాయి. కళ్లు ఎర్రబడకుండా కాపాడుతుంది. ఉసిరి జ్యూస్‌తో మలబద్ధకం, అజీర్ణం సమస్యలు దూరమౌతాయి. కడుపుకు సంబంధించిన చాలా రకాల రోగాలు దూరమౌతాయి.
Also read: Weight loss tips: బరువు తగ్గడానికి చలికాలంలో పాటించాల్సిన సులభమైన చిట్కా ఇదే..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook