Virat Kohli: టీ20 ప్రపంచకప్‌ 2022.. తొలి బ్యాటర్‌గా విరాట్ కోహ్లీ అరుదైన రికార్డు!

Virat Kohli becomes 1st batter to Leading Run-scorer in two T20 World Cups. రెండు టీ20 ప్రపంచకప్‌లలో అత్యధిక పరుగులు చేసిన తొలి బ్యాటర్‌గా టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ నిలిచాడు.   

Written by - P Sampath Kumar | Last Updated : Nov 14, 2022, 02:29 PM IST
  • తొలి బ్యాటర్‌గా కోహ్లీ అరుదైన రికార్డు
  • ఆరు మ్యాచ్‌లు ఆడి 296 పరుగులు
  • 27 మ్యాచ్‌ల్లో 1141 పరుగులు
Virat Kohli: టీ20 ప్రపంచకప్‌ 2022.. తొలి బ్యాటర్‌గా విరాట్ కోహ్లీ అరుదైన రికార్డు!

Virat Kohli becomes first batter to Leading Run-scorer in two T20 World Cups: టీ20 ప్రపంచకప్‌ 2022లో ఇప్పటికే ఎన్నో రికార్డులు ఖాతాలో వేసుకున్న టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ.. తాజాగా మరో రికార్డు బద్దలు కొట్టాడు. రెండు టీ20 ప్రపంచకప్‌లలో అత్యధిక పరుగులు చేసిన తొలి బ్యాటర్‌గా నిలిచాడు. తాజాగా ఆస్ట్రేలియా గడ్డపై ముగిసిన పొట్టి ప్రపంచకప్‌లో భారత్‌ సెమీ ఫైనల్‌లోనే నిష్క్రమించినప్పటికీ.. కోహ్లీ మ్రాతం టాప్‌ స్కోరర్‌గానే టోర్నీని ముగించాడు. మెగా టోర్నీలో ఆరు మ్యాచ్‌లు ఆడి 98.66 సగటుతో 296 పరుగులు చేశాడు.

టీ20 ప్రపంచకప్‌ 2022లో విరాట్ కోహ్లీ ఆరు మ్యాచులు ఆడి 98.66 సగటుతో 296 పరుగులు చేశాడు. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో (82 నాటౌట్) ఒంటిచేత్తో జట్టును గెలిపించాడు. ఆపై బంగ్లాదేశ్‌ 64, నెదర్లాండ్స్‌ జట్లపై 62 రన్స్ చేసిన కోహ్లీ.. ఇంగ్లండ్‌పై 50 పరుగులు బాదాడు. మెగా టోర్నీలో మొత్తంగా నాలుగు అర్థ సెంచరీలు చేశాడు. కోహ్లీ తర్వాత నెదర్లాండ్స్‌కు చెందిన మాక్స్‌ ఓడౌడ్‌ 8 మ్యాచ్‌ల్లో 242 పరుగులతో ఈ జాబితాలో రెండో స్థానంలో ఉన్నాడు. టీమిండియా స్టార్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ (ఆరు మ్యాచ్‌లు కలిపి 239 పరుగులు) మూడో స్థానంలో ఉన్నాడు.

2014లో జరిగిన టీ20 ప్రపంచకప్‌లో కూడా విరాట్‌ కోహ్లీ టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. మొత్తం ఆరు మ్యాచ్‌లు ఆడిన కోహ్లీ 106.33 సగటుతో 319 రన్స్ చేశారు. ఇందులో నాలుగు అర్ధ సెంచరీలు ఉన్నాయి. విరాట్ అత్యధిక స్కోరు 77గా ఉంది. ఇలా రెండు ప్రపంచకప్‌లలో లీడింగ్‌ స్కోరర్‌గా నిలవడం కోహ్లీకి మాత్రమే సాధ్యమైంది. ఇప్పటివరకు జరిగిన అన్ని టీ20 ప్రపంచకప్‌లలో కలిపి అత్యధిక రన్స్‌ చేసిన ప్లేయర్ కూడా కోహ్లీనే కావడం విశేషం. మొత్తం 27 మ్యాచ్‌ల్లో 81.50 సగటుతో 1141 పరుగులు చేశాడు. ఇందులో 14 హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి. 

Also Read: మీన రాశిలోకి బృహస్పతి సంచారం.. నవంబర్ 24 నుంచి ఈ ఐదు రాశుల వారికి డబ్బేడబ్బు!

Also Read: ICC Team: ఐసీసీ అత్యుత్తమ టీమ్.. భారత్ నుంచి ఇద్దరి చోటు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

 

Trending News