Accident News: ఘోర రోడ్డు ప్రమాదంలో 12 మంది మృతి..17 మంది మిస్సింగ్?

Uttarakhand Accident News:  ఉత్తరాఖండ్‌లోని జోషిమత్‌లో చోటు చేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదంలో 12 మంది మృతి చెందినట్లు నిర్ధారించారు అధికారులు. ఆ వివరాల్లోకి వెళితే 

Written by - Chaganti Bhargav | Last Updated : Nov 18, 2022, 10:34 PM IST
 Accident News: ఘోర రోడ్డు ప్రమాదంలో 12 మంది మృతి..17 మంది మిస్సింగ్?

Max Vehicle Fall Into Deep Ditch In Uttarakhand: ఉత్తరాఖండ్‌లోని జోషిమత్‌లో ఒక ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 12 మంది మృతి చెందినట్లు నిర్ధారించారు అధికారులు. ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి మరియు చిక్కుకున్న వారిని తరలించే ప్రయత్నాలు జరుగుతున్న క్రమంలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. జోషిమత్ బ్లాక్‌లోని ఉర్గాం-పల్లా జఖోలా మోటార్‌వేపై వెళుతున్న వాహనం అకస్మాత్తుగా బ్యాలెన్స్ కోల్పోయి కాలువలో పడిపోయిందని చెబుతున్నారు.

ఇక మృతుల్లో 10 మంది పురుషులు, ఇద్దరు మహిళలు ఉన్నారు. జిల్లా మేజిస్ట్రేట్ హిమాన్షు ఖురానా, పోలీసు సూపరింటెండెంట్ ప్రమేంద్ర దోబాల్‌తో పాటు ఎస్‌డిఆర్‌ఎఫ్, ఎన్‌డిఆర్‌ఎఫ్, పోలీసు మరియు పరిపాలన బృందాలు సమాచారం అందుకున్న సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. ఇప్పటి వరకు 12 మృతదేహాలను వెలికి తీయగా, మరికొంత మంది చిక్కుకుపోయారా? లేదా? అనే విషయాన్ని తెలుసుకునేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు, వారిని చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

ఇక గాయపడిన వారి నుంచి అందుతున్న సమాచారం మేరకు ఈ వాహనంలో ఇంకా 17 మంది ఉన్నారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఉర్గాం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ఇక కాలువ లోతుగా ఉండడంతో సహాయక చర్యలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రెస్క్యూ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోందని,  స్థానికులు కూడా సహాయ, సహాయ సహకారాలు అందిస్తున్నారని అంటున్నారు. అందుకుతున్న సమాచారం మేరకు మ్యాక్స్ వాహనం జోషిమత్ నుంచి ప్రయాణికులతో కిమానా గ్రామానికి వెళ్తోంది.

మధ్యాహ్నం 3 గంటల సమయంలో పల్లా గ్రామ సమీపంలోని లోతైన లోయలోకి వాహనం అదుపుతప్పి వెళ్లిందని అంటున్నారు. ప్రమాదంపై స్థానికులు సమాచారం అందుకున్న వెంటనే అధికారులు, పోలీసులకు సమాచారం అందించారు. ఘటనపై సమాచారం అందిన వెంటనే సహాయక చర్యలు ప్రారంభించినట్లు జిల్లా మేజిస్ట్రేట్ తెలిపారు. అదే సమయంలో ప్రమాదానికి కారణం వాహనం ఓవర్‌లోడ్‌ కావడమేనని ప్రత్యక్ష సాక్షులు అయిన  గ్రామస్తులు చెబుతున్నారు. ఈ ప్రమాదంపై ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి సంతాపం తెలిపారు. ఆయన జిల్లా మేజిస్ట్రేట్ తో కూడా ఫోన్‌లో మాట్లాడారు. ఈ రెస్క్యూ ఆపరేషన్‌ను త్వరితగతిన పూర్తి చేయాలని, వీలైనంత ఎక్కువ మందిని రక్షించడంపై దృష్టి పెట్టాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.

Also Read: Balakrishna Fans: బాలకృష్ణ ఫాన్స్ రచ్చ.. మహేష్ బాబు థియేటర్ ధ్వంసం!

Also Read: Das Ka Dhamki - Trailer: ఫ** ఆఫ్ అంటూ రెచ్చిపోయిన విశ్వక్.. గెటవుట్ పదాన్ని కూడా వదల్లేదుగా !

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News