Rajamouli : ఆ సినిమా తరహాలోనే మహేష్ బాబుతో మూవీ..అసలు విషయం బయటపెట్టిన జక్కన్న!

Rajamouli Movie with Mahesh Babu: మహేష్ బాబుతో తాను చేయబోయే సినిమా గురించి ఆసక్తికర అప్డేట్ ఇచ్చారు డైరెక్టర్ రాజమౌళి, ఆ వివరాల్లోకి వెళితే 

Written by - Chaganti Bhargav | Last Updated : Nov 20, 2022, 08:23 AM IST
Rajamouli : ఆ సినిమా తరహాలోనే మహేష్ బాబుతో మూవీ..అసలు విషయం బయటపెట్టిన జక్కన్న!

Rajamouli Movie with Mahesh Babu is an adventure film on the lines of Indiana Jones: ఆర్ఆర్ఆర్ తర్వాత మహేష్ బాబుతో రాజమౌళి ఒక సినిమా చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రాజెక్ట్ అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు కానీ అటు మహేష్ బాబు ఇటు రాజమౌళి ఇద్దరూ కూడా తాము కలిసి సినిమా చేస్తున్నట్లు పలు సందర్భాల్లో వెల్లడించారు. ప్రస్తుతం రాజమౌళి ఆర్ఆర్ఆర్ ని ఆస్కార్ బరిలో నిలబడిన నేపద్యంలో పెద్ద ఎత్తున అమెరికాలో సినిమాని ప్రమోట్ చేసే పనిలో ఉన్నారు.

ఈ సందర్భంగా అక్కడి అనేక మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. తాజాగా ఇంగ్లీష్ మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చిన రాజమౌళి మహేష్ బాబు సినిమా గురించి ఒక అప్డేట్ ఇచ్చారు. మీ తదుపరి సినిమా ఎలా ఉండబోతుంది అని అడిగిన మీడియా ప్రతినిధులకు ఇప్పుడే ఈ సినిమా గురించి చెప్పడం కష్టమని చెప్పుకొచ్చారు. సాధారణంగా తన సినిమాలన్నింటికీ తన తండ్రి స్క్రిప్ట్ ఇస్తారని తన తండ్రితో కలిసి ఈ సినిమా స్క్రిప్ట్ పని రెండు నెలల క్రితం ప్రారంభించామని చెప్పుకొచ్చారు.

ఇప్పుడే చెప్పడం కష్టమని అయితే ఈ సినిమా మాత్రం తనకు బాగా నచ్చిన హాలీవుడ్ మూవీ ఇండియానా జోన్స్ తరహాలో ఉండబోతుందని చాలాకాలంగా ఒక అడ్వెంచర్స్ మూవీ చేయాలని దాని ప్రయత్నిస్తున్నానని అది ఈ సినిమానే కాబోతోందని చెప్పుకొచ్చారు. తనకు అడ్వెంచర్ థ్రిల్లర్స్ అంటే చాలా ఇష్టమని అందుకే ఈ సినిమా ఒక గ్లోబ్ ట్రోటింగ్ అడ్వెంచర్ మూవీగా రూపొందించబోతున్నామని రాజమౌళి ప్రకటించారు.

ఇక ఈ ప్రాజెక్టుకు సంబంధించిన మిగతా వివరాలు బయటకు రాలేదు కానీ కేఎల్ నారాయణ ఈ సినిమా నిర్మాతగా వ్యవహరించనున్నారు. ఇక ప్రస్తుతానికి మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో సినిమా చేస్తున్నారు. మహేష్ బాబు 28వ సినిమాగా రూపొందుతున్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది.

ఇప్పటికే ఒక షెడ్యూల్ షూట్ పూర్తయింది కానీ ఇప్పుడు కథ పూర్తిగా మార్చేసినట్లు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో సినిమా షూటింగ్ మళ్లీ జరుపుతారా లేదా అనే విషయం మీద సందిగ్ధత నెలకొంది. మొత్తం మీద రాజమౌళి ఇచ్చిన అప్డేట్ తో మాత్రం మహేష్ ఫాన్స్ లో కొత్త జోష్ మాత్రం నెలకొంది అని చెప్పక తప్పదు.

Also Read: Director Madan: టాలీవుడ్లో మరో విషాదం.. క్లాసిక్ సినిమా అందించిన డైరెక్టర్ మృతి!

Also Read: Disha Patani New Boyriend: టైగర్ ను వదిలేసి కొత్త బాయ్ ఫ్రెండ్ తో దిశా చెట్టాల్ పట్టాల్.. అందాల ఆరబోతకు నో లిమిట్స్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News