Gigantic Goldfish: గాలానికి 20 ఏళ్ల గోల్డ్ ఫిష్.. బరువు 30 కిలోల పైమాటే..

30 Kgs Gigantic Goldfish: ఈ చేప వయస్సు 20 ఏళ్లు ఉంటుందట. అయినా చేపలకు వయస్సు ఎవరు చెప్పొచ్చారు అని ఆశ్చర్యం వేస్తోంది కదా. మీకే కాదు.. ఈ చేపకు 20 ఏళ్లు అనగానే చాలామందికి వచ్చే సందేహం ఇదే. కానీ ఈ చేపకు ఎంత వయస్సుందో చెప్పడానికి ఓ కారణం ఉంది.

Written by - Pavan | Last Updated : Nov 24, 2022, 12:37 PM IST
  • జాలరి చేతికి చిక్కిన భారీ గోల్డ్ ఫిష్
  • ఈ గోల్డ్ ఫిష్ బరువు 30 కిలోలు
  • 20 ఏళ్ల కిందటే చేపల చెరువులోకి వదిలిన ఫిషర్‌మేన్
Gigantic Goldfish: గాలానికి 20 ఏళ్ల గోల్డ్ ఫిష్.. బరువు 30 కిలోల పైమాటే..

30 Kgs Gigantic Goldfish: వల విసిరి చేపలు పట్టడం జాలర్లకు జీవనాధారం అయితే.. గాలం వేసి చేపలు పట్టడం చాలా మందికి ఓ సరదా. చిన్నప్పుడు చెరువుల్లో, కాలువల్లో, బావుల్లో గాలం వేసి చేపలు పట్టడం లాంటి తీపి గుర్తులు చాలామందికి ఉండే ఉంటాయి. మిత్రులతో పోటాపోటీగా పెద్ద పెద్ద చేపలు పట్టడం గుర్తుండే ఉంటుంది. గాలానికి ఎంత పెద్ద చేప పడితే అంత ఎక్కువ సంబరం. ప్రపంచాన్నే జయించినంత ఆనందం. కానీ మీ గాలానికి ఎప్పుడైనా 30 కిలోల చేప చిక్కిందా ? ఆ చేప కూడా ఇదిగో ఇలా బంగారు వర్ణంలో మెరిసే గోల్డ్ ఫిష్ చిక్కిందా ? చిక్కి ఉండకపోవచ్చు కదా..  కానీ ఇదిగో ఈ ఫోటోలో మనం చూస్తున్న జాలరి చేతికి అలాంటి గోల్డ్ ఫిష్ చిక్కింది.

ఈ చేప వయస్సు 20 ఏళ్లు ఉంటుందట. అయినా చేపలకు వయస్సు ఎవరు చెప్పొచ్చారు అని ఆశ్చర్యం వేస్తోంది కదా. మీకే కాదు.. ఈ చేపకు 20 ఏళ్లు అనగానే చాలామందికి వచ్చే సందేహం ఇదే. కానీ ఈ చేపకు ఎంత వయస్సుందో చెప్పడానికి ఓ కారణం ఉంది. ఈ చేపను పట్టుకుంది చెరువులోనో లేక సముద్రంలోనో కాదు.. ఫ్రాన్స్ లో ఫిషరీని నిర్వహిస్తున్న బ్రిట్ జేసన్ కౌలర్ అనే బ్రిటిషర్ తన ఫిషరీలో సరిగ్గా 20 ఏళ్ల క్రితం ఈ చేపను చిన్నగా ఉన్నప్పుడే వదిలాడట. అది కాస్తా పెరిగి పెద్దదయి ఇలా ఇంత భారీ సైజుకి ఎదిగింది. 

లెదర్ కార్ప్ అండ్ కోయి అనే హైబ్రిడ్ రకానికి చెందిన ఈ చేపకు ముద్దుగా క్యారట్ అనే పేరు పెట్టారు. క్యారట్ అనే పేరు ఎందుకు పెట్టారో మీకు ఈపాటికే అర్థమై ఉంటుంది. చూశారు కదా అచ్చం క్యారట్ రంగులోనే ఉంది కదా. అందుకే ఆ పేరు పెట్టుకున్నాడు. ఈ చేపల చెరువులో క్యారట్ ఉందని తెలుసుకానీ ఇప్పటివరకు ఇది ఎప్పుడూ నాకు దొరకలేదు. క్యారట్ అంత ఈజీగా దొరికే రకం కాదు. ఇన్నాళ్లకు ఇప్పుడిలా చేతికి చిక్కింది అంటున్నాడు బ్రిట్ జేసన్. 

జేసన్‌కి ఈ చేప అంటే ఎంత ఇష్టం అంటే.. అన్ని చేపల్లో ఈ చేపతో వ్యాపారం చేయాలని, భారీ ధరకు అమ్ముకుని సొమ్ము చేసుకోవాలని జేసన్ అనుకోవడం లేదు. అందుకే దాన్ని మళ్లీ నీళ్లలోకి వదిలేశాడు. అంతకంటే ముందుగా ఆ చేపను చేతిలోపట్టుకుని ఫోటోలకు ఫోజిచ్చాడు. ఇప్పటివరకు పట్టుకున్న ఈ రకం చేపల్లో ఇదే రెండో అతి పెద్ద చేప అని ఫిషరీస్ సైన్స్ సబ్దెక్టు మీద పట్టున్న వాళ్లు చెబుతున్నారు.

Also Read : Woman Collapses mid-air: విమానం గాల్లో ఉండగా గుండెనొప్పితో కుప్పకూలిన మహిళ.. తరువాత ఏమైందంటే..

Also Read : Watch Now: కాటేసే నాగరాజుకే కిస్‌ ఇచ్చిన బలరాజు..నెట్టింట తెగ చెక్కర్లు కొడుతున్న వైరల్‌ వీడియో..

Also Read : Rhino In Football Ground: ఫుట్‌బాల్‌ గ్రౌండ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఖడ్గమృగం.. ఆటగాళ్లు ఏం చేశారో చూడండి..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News