Woman Collapses Mid-air on Flight: ఢిల్లీ నుంచి పాట్నా వెళ్తున్న ఇండిగో విమానం గాల్లోకి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే చోటుచేసుకున్న రియల్ ఇన్సిడెంట్ ఇది. విమానంలో ప్రయాణిస్తోన్న 59 ఏళ్ల మహిళా ప్రయాణికురాలు ఛాతిలో నొప్పితో బాధపడుతూ ఉన్నట్టుండి సీటులో కుప్పకూలిపోయారు. దీంతో వెంటనే అప్రమత్తమైన ఇండిగో క్యాబిన్ క్రూ.. సదరు ప్రయాణికురాలిని సేవ్ చేసేందుకు ఎవరైనా డాక్టర్లు, నర్సులు ఉంటే ముందుకు రావాల్సిందిగా ప్రయాణికులకు విజ్ఞప్తి చేశారు. ఇండిగో సిబ్బంది ఇచ్చిన పిలుపుతో నలుగురు డాక్టర్లు ముందుకొచ్చారు.
ఆ నలుగురు డాక్టర్లు ఆమెను కాపాడేందుకు రంగంలోకి దిగి తమ వంతు ప్రయత్నాలు తాము మొదలుపెట్టారు. అప్పటికే ఆమె షాక్‌లో స్పృహ కోల్పోయింది. పేషెంట్ బీపీ కూడా చెక్ చేయలేకపోయారు. మణికట్టుపై నాడి పట్టుకుని చూస్తే నాడి కొట్టుకొంటున్న స్పర్శ కూడా తగల్లేదు. అదృష్టంకొద్ది కెరొటిడ్ పల్స్ దొరికింది. కెరోటిడ్ పల్స్ అంటే మెడలో శ్వాస తీసుకునే నాళం కొట్టుకోవడం. అది చూసిన డాక్టర్లు ఆమె ప్రాణాలతోనే ఉందని నిర్ధారించుకున్నారు.
విమానం సిబ్బంది హుటాహుటిన ఫస్ట్ ఎయిడ్ కిట్ తీసుకొచ్చారు. డాక్టర్లు అతి కష్టంమీద ఆమెకు ఐవి కాన్లా అమర్చారు. ఐవి క్యాన్లాను ఆస్పత్రిలో ఉన్న పేషెంట్‌కి అమర్చడానికే కొంత సమయం పడుతుంది. అలాంటిది విమానంలోనూ వారు ఏ మాత్రం ఆలస్యం లేకుండా సకాలంలో ఐవి క్యాన్లా అమర్చగలడం గొప్ప విషయం. వెంటనే క్యాన్లా సహాయంతో అడ్రినల్ డ్రగ్ ఇంజెక్ట్ చేశారు. అలాంటి అత్యవసర పరిస్థితుల్లో క్యాన్లానే లైఫ్ సేవింగ్ డ్రగ్ అన్నమాట.
విమానంలో అత్యవసర వైద్య సహాయం అవసరం ఉన్నందున వీలైనంత త్వరగా పాట్నా ఎయిర్ పోర్టులో ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయ్యేందుకు అనుమతి కోరుతూ పాట్నా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌కి ఇండిగో విమానం పైలట్స్ సమాచారం అందించారు. ఇండిగో పైలట్స్ అందించిన సమాచారంతో అప్రమత్తమైన పాట్నా ఎయిర్ పోర్టు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సిబ్బంది హుటాహుటాని ఫ్లైట్ ల్యాండింగ్‌కి క్లియరెన్స్ ఇచ్చారు. దాంతో షెడ్యుల్ ప్రకారం చేరుకోవడానికంటే మరో 25 నిమిషాల ముందే ఢిల్లీ నుంచి బయల్దేరిన ఇండిగో విమానం పాట్నా ఎయిర్ పోర్టులో ల్యాండ్ అయింది. అడ్రినల్తో పాటు డెక్సోనా, డెరిఫిలిన్ ఐవి క్యాన్లా ద్వారా ఇంజెక్ట్ చేశారు. దాంతో కొద్ది క్షణాల్లోనే ఆమె స్పహలోకి వచ్చారు.
అప్పటికే పైలట్స్ ఇచ్చిన సమాచారంతో అప్రమత్తమైన పాట్నాలోని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సిబ్బంది.. విమానాశ్రయంలో రన్ వే క్లియర్ చేసి ఢిల్లీ నుంచి వస్తోన్న ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్‌కి దారి ఇచ్చారు. విమానం ల్యాండింగ్ అవడంతోనే అత్యవసర వైద్యుల బృందంతో కూడిన అంబులెన్స్ రెడీగా ఉంది. అక్కడి నుంచి ఆమెను అత్యవసర వైద్యం కోసం పాట్నాలోని హెచ్ఎంఆర్ఐ హాస్పిటల్‌కి తరలించారు. అలా విమానంలో సిబ్బంది చాకచక్యంగా వ్యవహరించి విమానంలోని ప్రయాణికుల్లో ఉన్న వైద్యుల సహాయం కోరడం, వారు కూడా వెంటనే స్పందించి ఆమెకు వైద్య సహాయం చేయడంతో ప్రాణాలు రక్షించగలిగారు.
Also Read : Aayushi Chaudhary Murder Case: వీడిన ఆయూషి చౌదరి మర్డర్ మిస్టరీ.. కిల్లర్స్ ఎవరో కాదు..
Also Read : Kulwinderjit Singh Arrest: ఎయిర్‌పోర్టులో మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ అరెస్ట్
Also Read : 71000 Appointment Letters: 71,000 మందికి అపాయిట్మెంట్ లెటర్స్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook