Rajanikanth's Baba Movie to Re Release on December 10th: రజనీకాంత్ హీరోగా బాబా అనే సినిమా విడుదలై దాదాపు 20 ఏళ్లు పూర్తి కావొస్తోంది. ప్రస్తుతం రీరిలీజ్ ట్రెండ్ బాగా నడుస్తున్న క్రమంలో ఇప్పుడు ఈ సినిమాని కూడా మళ్లీ రిలీజ్ చేయాలని దర్శక నిర్మాతలు నిర్ణయం తీసుకున్నారు. ఈ సినిమాని సురేష్ కృష్ణ డైరెక్ట్ చేయగా స్వయంగా రజనీ కాంత్ ఈ సినిమాని నిర్మించారు. ఇక మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ సినిమా కథ కూడా రజనీకాంత్ స్వయంగా రాసుకున్నారు. అయితే ఈ సినిమా అప్పట్లో ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.
ఎట్టకేలకు సుమారు 20 ఏళ్ల తర్వాత ఈ సినిమాను మరోమారు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు మేకర్స్. ఈ సినిమా రజనీకాంత్ పుట్టినరోజు సందర్భంగా డిసెంబర్ 12వ తేదీ విడుదల చేస్తారని అందరూ భావించారు. కానీ దాన్ని మరో రెండు రోజులు ముందే రిలీజ్ చేయాలని దర్శక నిర్మాతలు నిర్ణయం తీసుకున్నారు. పదో తేదీ అంటే ఈ వారంలో శనివారం ఈ సినిమా రిలీజ్ కాబోతోంది.
శని, ఆదివారాలు వీకెండ్ కూడా రీ రిలీజ్ సినిమాకు కలిసి వస్తుంది అనే ఉద్దేశంతో ఈ సినిమాని ఒక రెండు రోజులు ముందే రిలీజ్ చేస్తున్నారని, ఇక 12న సోమవారం అయినా రజనీ పుట్టినరోజు కావడంతో మంచి ఓపెనింగ్స్ ఉంటాయని మేకర్స్ భావిస్తున్నారు. గతంలో ఈ సినిమా రిలీజ్ చేసినప్పుడు మూడు గంటల నిడివి ఉండగా ఇప్పుడు దాన్ని రెండున్నర గంటలకు కుదించారని తెలుస్తోంది. ఇక అంతేగాక ఈ సినిమాని మళ్లీ మొత్తం డిజిటల్ ఫార్మాట్‌లోకి మార్చి రీలీజ్ చేయబోతున్నారట.
ఇది రజనీకాంత్ అభిమానులకు ఒక రకంగా గుడ్ న్యూస్ అనే చెప్పాలి. అలాగే ఈ సినిమా అప్పట్లో ఎందుకు సరిగ్గా ఆడలేదు అనే విషయం మీద సినిమా యూనిట్ అనేక చర్చలు జరిపి ఆ విషయాలన్నింటినీ ఈ సెకండ్ రిలీజ్ వెర్షన్లో మార్పులు చేర్పులు చేసి తీసుకు వస్తున్నారట. అందుకే ఈ సినిమాకు రజనీకాంత్ స్వయంగా మరోసారి డబ్బింగ్ కూడా చెప్పారట. మొత్తం మీద ఈ సినిమా 12వ తేదీన రిలీజ్ అవుతుంది అనుకుంటే పదవ తేదీనే ప్రేక్షకుల ముందుకు రావడం ఆసక్తికరంగా మారింది. చూడాలి మరి ఈ సినిమా ఎన్ని సంచలనాలకు కేంద్ర బిందువు అవుతుంది అనేది.
Also Read: కొరియా నుంచి రాగానే సమంత దగ్గరకు చైతూ.. అసలు విషయం అదేనా?
Also Read: అప్పుడే రెండో రెస్టారెంట్ కూడా ఓపెన్ చేసేస్తున్న మహేష్ భార్య!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook