కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీనే గదిలో బంధించారట. ఈ వ్యాఖ్యలు చేసింది ఇంకెవరో కాదు... కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీనే. అవును.. అప్పుడప్పుడు సోషల్ మీడియా వేదికగా కేంద్రంపై తనదైన శైలిలో విమర్శలు సంధించే రాహుల్ గాంధీ తాజాగా మరోసారి కేంద్ర ఆర్థిక పరిస్థితులపై, కేంద్రం పరిపాలన తీరుపై ట్విటర్ ద్వారా విమర్శలు చేశారు. కేంద్రమంత్రిని ఆయన గదిలోనే పెట్టి తాళం వేశారు. భారత ఆర్థిక వ్యవస్థ తాళాలు బీజేపీ కోశాధికారి వద్ద పెట్టుకున్నారు. అలాగే మునిగిపోతున్న నావను ఆర్ఎస్ఎస్కి చెందిన అదృశ్య హస్తం ఏదో ఒడ్డుకు లాగుతోంది అంటూ రాహుల్ ట్విటర్ పోస్ట్‌లో పేర్కొన్నారు.
Ex ? FM is locked in his room, breaking news on FaceBook.
BJP Treasurer has the keys to the Indian Economy.
The brightest flee the sinking ship, as the “invisible hand” of the RSS steers it onto the rocks.
Meanwhile, Captain DeMo is fast asleep.
It’s crazy out there !
— Rahul Gandhi (@RahulGandhi) June 20, 2018
ఇదంతా ఇలా ఉంటే మరోవైపు నావ కెప్టేన్ డెమో గాఢనిద్రలో మునిగిపోయారు అంటూ పరోక్షంగా ప్రధానిపై రాహుల్ గాంధీ సెటైర్లు వేశారు.