Here is Top 10 best 100cc mileage Bikes in india and Hyderabad: దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్ని అంటిన విషయం తెలిసిందే. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా లీటరు పెట్రోల్ ధరపై రూ. 30-35 పెరిగి రూ. 110కి చేరింది. ఇంధన ధరలు గతంలో ఎన్నడూ లేనివిధంగా అత్యంత ఖరీదైనదిగా మారాయి. దాంతో సామాన్య ప్రజలపై పెను భారం పడుతోంది. పెట్రో ధరలు ఆకాశాన్నంటుతుండడంతో.. ఎక్కువ మైలేజ్ ఇచ్చే బైక్‌లను కొనేందుకు అందరూ ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో భారత దేశంలో తక్కువ ధరలో ఎక్కువ మైలేజ్ ఇచ్చే బైక్స్ జాబితా ఓసారి చూద్దాం.
భారతీయ ఆటోమోటివ్ పరిశ్రమలో ద్విచక్ర వాహనాలు చాలా ప్రధానమైనవి. ఇందులోనూ 100సీసీ సెగ్మెంట్ మోడల్స్ చాలా ముఖ్యమైనవి. 100సీసీ సెగ్మెంట్‌లోని బైక్‌లు ఇంధన సామర్థ్యాన్ని కలిగి ఉండడంతో పాటు సామాన్య ప్రజలకు అందుబాటు ధరలో ఉంటాయి. అంతేకాదు మంచి మైలేజీని కూడా ఇస్తాయి. డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని ద్విచక్ర వాహన తయారీదారులు అనేక మోడళ్లను మార్కెట్లోకి విడుదల చేశాయి. అయితే 100సీసీ సెగ్మెంట్‌లో ఎక్కువ మైలేజ్ ఇచ్చే బైక్‌ల జాబితాను ఇప్పుడు పరిశీలిద్దాం.
హీరో హెచ్‌ఎఫ్ డీలక్స్, హీరో హెచ్‌ఎఫ్ 100, హీరో స్ప్లెండర్ ప్లస్, హీరో స్ప్లెండర్ ప్లస్ Xtec, బజాజ్ ప్లాటినా, టీవీఎస్ స్పోర్ట్, హోండా CD110 డ్రీమ్, హోండా లివో, టీవీఎస్ స్టార్ సిటీ ప్లస్, టీవీఎస్ రేడియన్, హీరో ప్యాషన్ ప్రో లాంటి బైక్స్ 60 కంటే ఎక్కువ మైలేజ్ ఇస్తాయి. ఇందులో కొన్ని లీటరుకు 80 నుంచి 90 కిమీ మైలేజీని కూడా ఇస్తాయి. అయితే మైలేజ్ అనేది పూర్తిగా మీరు బైక్‌ను నడిపే విధానంపై ఆధారపడి ఉంటుంది. ఎంత రాష్ డ్రైవింగ్ చేసినా ఈ బైక్‌లన్నీ 60 kmpl లేదా అంతకంటే ఎక్కువ మైలేజీని ఇవ్వగలవు. వీటి ధర కూడా తక్కువే ఉంటుంది. ఆ వివరాలు కూడా తెలుసుకుందాం.
# Hero HF Deluxe (సుమారు రూ. 60,000తో ప్రారంభమవుతుంది)
# Hero HF 100 100 (సుమారు రూ. 55,000 నుండి ప్రారంభమవుతుంది)
# Hero Splendor Plus (సుమారు రూ. 70,000 నుండి ప్రారంభమవుతుంది)
# Hero Splendor Plus Xtec (సుమారు రూ. 75,000 నుండి ప్రారంభమవుతుంది)
# Bajaj Platina 100 (సుమారు రూ. 63,000 నుండి ప్రారంభమవుతుంది)
# TVS Sport (సుమారు రూ. 64,000 నుండి ప్రారంభమవుతుంది)
# Honda CD110 Dream (సుమారు రూ. 70,000 నుండి ప్రారంభమవుతుంది)
# Honda Livo (సుమారు రూ. 75,000 నుండి ప్రారంభమవుతుంది)
# TVS Star City Plus (సుమారు రూ. 72,000 నుండి ప్రారంభమవుతుంది)
# TVS Radeon (సుమారు రూ. 60,000 నుండి ప్రారంభమవుతుంది)
# Hero Passion Xtec (సుమారు రూ. 71,000 నుండి ప్రారంభమవుతుంది)
# Hero Passion Pro (సుమారు రూ. 74,000 నుండి ప్రారంభమవుతుంది)
Also Read: Pooja Hegde Pics: బ్లూ లెహంగాలో పూజా హెగ్డే.. బుట్టబొమ్మను ఇలా చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook.