Whatsapp Call Recording Feature: కాలం మారుతూన్న కొద్ది వాట్సాప్‌లో కొత్త కొత్త ఫీచర్లు పుట్టుకొస్తూనే ఉన్నాయి. వాట్సాప్ ప్రతి సంవత్సరం అద్భుతమైన ఫీచర్లను ప్రవేశపెడుతూ వినియోగదారులను ఆకట్టుకుంటోంది. అయితే ఇటివలే వాట్సాప్ సేవలు కొంత సమయం ఆగిపోయిన తర్వాత నుంచి వినియోగదారుల్లో దానిపై నమ్మం పోయింది. దీంతో వాట్సాప్ వినియోగదారులను దృష్టిలో పెట్టుకుని అదిరిపోయే ఫీచర్లను వినియోగదారులకు తీసుకోస్తోంది. రాబోయే సంవత్సరంలో కాల్ రికార్డింగ్, మెసేజ్ ఎడిట్ వంటి అనేక ఫీచర్లు వచ్చే అవకాశాలున్నాయని సమాచారం.
వాట్సాప్ కాల్ రికార్డింగ్:
కాల్ రికార్డింగ్ ఫీచర్ అత్యంత ప్రమాదకరమైనదని అందరికీ తెలిసిందే.. కానీ వినియోగదారులను దృష్టిలో పెట్టుకుని కాల్ రికార్డ్ ఆప్షన్‌ను వినియోగదారులకు పరిచయం చేయబోతోందని తెలుస్తోంది. అయితే ఇప్పటికే దీనికి సంబంధించిన పనులు జరుగుతున్నాయని తెలుస్తోంది. అతి తర్వలోనే వాట్సాప్ కాల్ రికార్డింగ్ సంబంధించిన మరింత సమాచారాన్ని రానుంది.
వాట్సాప్ మెసేజ్ ఎడిటింగ్:
వాట్సాప్ యూజర్లు ఎదైన తప్పుపోయిన తర్వాత డిలీట్ చేస్తూ ఉంటారు. ఇక నుంచి వాట్సాప్ మెసేజ్ ఎడిటింగ్ ఆప్షన్ అందుబాటులోకి వస్తే ఇలా చేయనక్కర్లేదు. సందేశం ఏదైనా తప్పుగా ఉంటే ఎడిట్ మెసేజ్ ఫీచర్ ద్వారా సవరించుకునే అవకాశాన్ని తీసుకురాబోతోంది. దీంతో వినియోగదారులు ఆటో-డిలీట్, డిలీట్ మెసేజ్ అలాగే ఎడిట్ మెసేజ్ సౌకర్యాన్ని పొందుతారు.
షెడ్యూల్ మెసేజ్:
మనం తరచుగా నోటిషికేషన్లు ఇతర సమాచారాన్ని అనుకున్న సమయానికి పంపాలనుకుంటాము. కానీ చాలా మంది పంపలేకపోతారు. కానీ ఈ ఆప్షన్ అందుబాటులోకి వస్తే ఇలా మీరు అనుకున్న సమయానికే షెడ్యూల్ మెసేజ్ ఫీచర్ ద్వారా పంపొచ్చు. అయితే వాట్సాప్ ఇప్పటికే ఈ ఫీచర్‌కు సంబంధించిన సమాచార పనులు చేపడుతోంది. వీలైనంత తొందరలోనే ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చే అవకాశాలున్నాయి.
WhatsApp అన్‌సెండ్ మెసేజ్:
యూజర్లు ఏదైనా తప్పుడు సందేశాన్ని పంపిచి.. దానిని ఎడిట్ చేసుకోలేకపోతే అన్‌సెండ్ మెసేజ్ ఆప్షన్ ద్వారా తొలగించవచ్చు. ఇప్పటికే ఇలాంటి ఫీచర్ చాలా సోషల్ మీడియాల్లో అందుబాటులో ఉంది. వాట్సాప్‌లో అన్‌సెండ్ ఆప్షన్ నొక్కగానే మీతో చాట్ చేస్తున్న వినియోగదారికి సందేశం డిలీట్ అవుతుంది.
వాట్సాప్ వానిష్ మోడ్:
ప్రముఖ సోషల్ మీడియాలైనా Instagram, Facebook Messengerలో వానిష్ మోడ్ ఉంది. అయితే ఈ వానిష్ మోడ్ ఫీచర్‌ను ఇప్పుడు వాట్సాప్ తీసుకురాబోతున్నట్లు సమాచారం. ఈ ఫీచర్లో సంభాషణ తర్వాత చాట్ మొత్తాన్ని తొలగించవచ్చు. అంతేకాకుండా చాట్‌లో భాగంగా స్క్రీన్షాట్లను తీసుకోకుండా నివారించవచ్చు.
ఇది కూడా చదవండి : india vs china soldiers: భారత్, చైనా సైనికుల మధ్య మరోసారి ఘర్షణ.. పలువురికి గాయాలు
ఇది కూడా చదవండి : India-US Ties: సూపర్ పవర్‌గా భారత్.. మరో అగ్రరాజ్యంగా మారుతుంది: అమెరికా వైట్‌హౌస్ అధికారి జోస్యం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook