CIBIL Score Increase Tips: మీకు బ్యాంక్ నుంచి లోన్ రావడం లేదా..? సిబిల్ స్కోర్ పెంచుకునే మార్గాలు ఇవిగో..

Cibil Score Check Online: మీకు సిబిల్ స్కోర్ మంచిగా ఉంటే బ్యాంక్ నుంచి లోన్ లభిస్తుంది. లేకపోతే మీ అప్లికేషన్‌ను బ్యాంక్ తిరస్కరిస్తుంది. మరి సిబిల్ స్కోరును ఎలా పెంచుకోవాలి..? ఈ టిప్స్ ఫాలో అయిపోండి.. మీ సిబిల్ స్కోరు పెంచుకోండి..

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 15, 2022, 02:48 PM IST
CIBIL Score Increase Tips: మీకు బ్యాంక్ నుంచి లోన్ రావడం లేదా..? సిబిల్ స్కోర్ పెంచుకునే మార్గాలు ఇవిగో..

Cibil Score Check Online: ప్రస్తుతం ఉద్యోగం చేస్తున్నా.. వ్యాపారం చేస్తున్నా.. రుణం తీసుకోవడం పరిపాటిగా మారింది. రుణం తీసుకోవడం.. ఈఎంఐలలో లోన్లు క్లియర్ చేసుకోవడం మనం చూస్తునే ఉన్నాం. అయితే బ్యాంక్ నుంచి లోన్ పొందాలంటే మాత్రం కచ్చితంగా సిబిల్ స్కోర్ బాగుండాలి. ఏదైనా బ్యాంకు రుణం ఇవ్వడానికి ముందు సిబిల్ స్కోర్‌ను తనిఖీ చేస్తుంది. సిబిల్ స్కోరు తక్కువగా ఉంటే.. రుణ దరఖాస్తును తిరస్కరిస్తుందనే విషయం అందరికీ తెలిసిందే. మరి సిబిల్ స్కోరును ఎలా పెంచుకోవాలని ఆలోచిస్తున్నారా..? ఈ ట్రిక్స్ ఫాలో అయి సిబిల్ స్కోరు పెంచుకోండి.

- మీ సిబిల్ స్కోర్ స్థిరంగా ఉండాలంటే.. మీరు ఇప్పటికే తీసుకున్న ఏదైనా లోన్ సకాలంలో చెల్లించాలని ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి. ఎట్టిపరిస్థితుల్లోనూ ఈఎంఐ చెల్లించడంలో ఆలస్యం చేయవద్దు.

- మీ క్రెడిట్ నివేదికను తనిఖీ చేయాలి. చాలాసార్లు మీరు మీ వైపు నుంచి లోన్ క్లియర్ చేసి.. దాన్ని మూసివేసారు. కానీ కొన్ని అడ్మినిస్ట్రేటివ్ కారణాల వల్ల లోన్ యాక్టివ్‌గా చూపిస్తోంది. ఇది మీ క్రెడిట్ స్కోర్‌పై కూడా ప్రభావం చూపుతుంది. ఎప్పటికప్పుడు క్రెడిట్ నివేదికను చెక్ చేసుకోండి.

- సిబిల్ స్కోరు పెరగాలంటే.. ప్రతిసారీ మీ క్రెడిట్ బిల్లును సకాలంలో పూరించండి. మీపై ఎలాంటి రుణం బకాయి ఉంచుకోవద్దు. ఇలా చేస్తే మీ సిబిల్ స్కోర్‌ మెరుగుపరుపడుతుంది.

- అదేవిధంగా లోన్ గ్యారెంటర్‌గా మారడం మానుకోండి. ఇది కాకుండా.. ఉమ్మడి ఖాతా కూడా తెరవవద్దు. ఇతర పక్షం డిఫాల్ట్ అయితే.. దాని ప్రభావం మీ సిబిల్ స్కోర్‌పై కనిపిస్తుంది.

- మీరు సిబిల్ స్కోర్‌ని ఫిక్స్ చేయాలనుకుంటే.. ఒకేసారి ఎక్కువ రుణాలు తీసుకోవద్దని కూడా గుర్తుంచుకోండి. మీరు ఒకేసారి అనేక రుణాలు తీసుకుంటే.. వాటిని తిరిగి చెల్లించడంలో జాప్యం జరగవచ్చు. అటువంటి పరిస్థితిలో సిబిల్ స్కోర్ పడిపోయే అవకాశం ఉంటుంది.

- మీరు ఎప్పుడైనా లోన్ తీసుకున్నా.. ఎక్కువ కాలం పాటు తీసుకోండి. ఇలా చేయడం ద్వారా ఈఎంఐ మొత్తం తక్కువగా ఉంటుంది. మీరు దానిని సులభంగా చెల్లించవచ్చు. మీరు సకాలంలో చెల్లింపులు చేసినప్పుడు సిబిల్ ఆటోమేటిక్‌గా పెరుగుతుంది.

- మీ సిబిల్ స్కోరు 300 నుంచి 500 మధ్య ఉంటే పూర్ ఉన్నట్లు. 550-650 యావరేజ్, 650-750 గుడ్, 750-900 ఎక్సలెంట్‌గా ఉన్నట్లు చెబుతారు.

Also Read: SBI Interest Rate Hike: ఎస్‌బీఐ ఖాతాదారులకు షాక్.. నేటి నుంచే అమలు  

Also Read: CM Nitish Kumar: సారా తాగితే చావడం ఖాయం.. కల్తీ మద్యం మరణాలపై సీఎం నితీశ్ కుమార్ అనుచిత వ్యాఖ్యలు

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News