Pawan Kalyan: వచ్చే ఎన్నికల్లో వైసీపీ గెలవట్లేదు.. బీజేపీ, టీడీపీలకు అమ్ముడుపోయే ఖర్మ నాకు లేదు: పవన్ కళ్యాణ్‌

Pawan Kalyan Slams YSRCP: వచ్చే ఎన్నికల్ల వ్యతిరేఖ ఓటును చీలబోనివ్వమని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మరోసారి స్పష్టంచేశారు. తాను ఎలా తిరుగుతానో చూస్తామని వైసీపీ గాడిదలు ఓండ్ర పెడుతున్నాయంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తాను కష్టార్జితంతోనే అన్నదాతలకు సాయం చేస్తున్నానని చెప్పారు జనసేనాని.

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 18, 2022, 09:07 PM IST
Pawan Kalyan: వచ్చే ఎన్నికల్లో వైసీపీ గెలవట్లేదు.. బీజేపీ, టీడీపీలకు అమ్ముడుపోయే ఖర్మ నాకు లేదు: పవన్ కళ్యాణ్‌

Pawan Kalyan Slams YSRCP: వైఎస్సార్సీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ గెలవదని జోస్యం చెప్పారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం ధూళిపాళ్లలో నిర్వహించిన జనసేన పార్టీ కౌలు రైతు భరోసా యాత్రకు పవన్‌ కళ్యాణ్‌ హాజరయ్యారు.  210 కుటుంబాలకు  రూ.లక్ష చొప్పున చెక్కులు అందచేశారు. కౌలు రైతుల కన్నీటి వెతలు తెలుసుకున్నారు. కుటుంబ పెద్ద దూరమయ్యాక వారు పడిన ఇబ్బందులు అడిగి తెలుసుకుని ప్రతి కుటుంబాన్ని ఓదార్చారు.  

అనంతరం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో వైసీపీ గెలవనివ్వమని స్ఫష్టం చేశారు. రాష్ట్రంలోని ఏ జిల్లాలోనూ రైతులు ఆనందంగా లేరని.. రైతు కంటతడి పెట్టిన నేల సుభిక్షంగా ఉండదన్నారు. రైతుల కష్టాలనే పట్టించుకునే వారు లేరని మండిపడ్డారు. ఎన్నికలు దగ్గరకు వస్తున్న నేపథ్యంలో వైసీపీ అవినీతికి హాలీడే ప్రకటించిందని సెటైర్లు వేశారు. 

'నేను ఎలా తిరుగుతానో చూస్తామని వైసీపీ గాడిదలు ఓండ్ర పెడుతున్నాయి. నేను వారానికి ఒక్క రోజు వస్తేనే వాళ్లు తట్టుకోలేకపోతున్నాటారు. నాకేమీ తాతలు సంపాదించి పెట్టిన వేల కోట్ల రూపాయల ఆస్తులు లేవు. అక్రమాలు, దోపిడీలు చేసిన డబ్బు నా దగ్గర లేదు. నేను కష్టార్జితంతోనే అన్నదాతలకు సాయం చేస్తున్నాను..' అని పవన్ కళ్యాణ్‌ అన్నారు.

ఈ సందర్భంగా మంత్రి అంబటి రాంబాబుపై జనసేనాని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అంబటిని ఉద్దేశించి మాట్లాడుతూ.. సత్తెనపల్లిలో ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి కూడా అవినీతి చేస్తున్నారని ఆరోపించారు. అంబటి కాపుల గుండెల్లో కుంపటి అని.. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడం తెలియని ఆయన నీటిపారుదల శాఖ మంత్రి అంటూ సెటైర్లు వేశారు. రానున్న ఎన్నికల్లో అధికార వైసీపీ గెలవట్లేదు.. గెలవనివ్వమని పవన్ కళ్యాణ్ ధీమా వ్యక్తం చేశారు. 

బీజేపీ, టీడీపీలకు అమ్ముడుపోయే ఖర్మ తనకు లేదన్నారు జనసేనాని. వైసీపీ అధికారంలోకి రాకుండా చేసే బాధ్యత ప్రజలదేనని అన్నారు.  అక్రమాలకు పాల్పడుతున్న వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దింపేందుకు వ్యతిరేక శక్తులన్నింటిని ఏకం చేస్తామన్నారు. 

Also Read: LPG Cylinder Booking: తక్కువ ధరకే గ్యాస్ సిలిండర్‌ను బుక్ చేయండి.. భారీ క్యాష్‌బ్యాక్‌ ఆఫర్

Also Read: WTC Points Table: ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో టాప్‌-2లోకి టీమిండియా.. ఫైనల్‌కు చేరే సమీకరణలు ఇవే..  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News