Corona BF.7 Variant: భయపెడుతున్న బీఎఫ్‌ 7 వేరియంట్.. ఫోర్త్ డోస్ తీసుకోవాల్సిందేనా..?

Covid Cases Increasing: కొత్త వేరియంట్ బీఎఫ్‌ 7 భారత్‌లోనూ ప్రవేశించడంతో కేంద్ర ప్రభుత్వం అప్రత్తమైంది. మాస్క్‌లు తప్పనిసరిగా ధరించాలని సూచించింది. మరోవైపు ఇప్పటికే మూడు డోస్‌లు వేసుకున్న వారు.. కొత్త వేరియంట్‌కు జాగ్రత్తగా నాల్గో డోస్ వేసుకోవాలా..? అని అడుతున్నారు.    

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 22, 2022, 12:59 PM IST
  • కొత్త వేరియంట్ బీఎఫ్‌ 7తో భయాందోళన
  • ఇప్పటివరకు 27 శాతం మంది మాత్రమే మూడో డోస్‌
  • బైవాలెంట్ వ్యాక్సిన్ సిద్ధమవుతుందా..?
Corona BF.7 Variant:  భయపెడుతున్న బీఎఫ్‌ 7 వేరియంట్.. ఫోర్త్ డోస్ తీసుకోవాల్సిందేనా..?

Covid Cases Increasing: ప్రపంచవ్యాప్తంగా మరోసారి పంజా విసిరేందుకు కరోనా మహమ్మారి రెడీ అవుతోంది. చైనాను వణికించి కొత్త వేరియంట్ బీఎఫ్‌ 7 ఇప్పుడు భారత్‌లోనూ ఎంట్రీ ఇచ్చింది. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. కరోనా కేసులు పెరగకుండా జాగ్రత్తలు తీసుకునేందుకు ఉన్నతాధికారుల సమావేశం కొనసాగుతోంది. గతేడాది ఈ ప్రాణాంతక వైరస్ కారణంగా దేశంలో చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత 3 డోసుల కోవిడ్ వ్యాక్సిన్ వేయడంపై దృష్టి సారించారు. కొత్త వేరియంట్ మళ్లీ పుట్టుకురావడంతో నాలుగో డోస్ తీసుకోవాలనే ప్రశ్న చాలామందిలో ఉత్పన్నమవుతోంది. 

ఈ విషయంపై ఢిల్లీలోని ఐహెచ్‌బీఏఎస్ ఆసుపత్రి మాజీ నివాసి డాక్టర్ ఇమ్రాన్ అహ్మద్ మాట్లాడుతూ.. బూస్టర్ అంటే మూడో డోస్ కరోనా వ్యాక్సిన్ తీసుకోని వారు వీలైనంత త్వరగా ఈ పని చేయాలని సూచించారు. నాల్గవ డోస్ ప్రశ్నపై ప్రస్తుతానికి దాని అవసరం లేదని చెప్పారు. పరిస్థితి మరింత దిగజారితే బివాలెంట్ వ్యాక్సిన్‌ను సిద్ధం చేయవచ్చన్నారు.

బైవాలెంట్ వ్యాక్సిన్ అంటే ఏమిటి..?

ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA) ప్రకారం ఇది ప్రధాన వైరస్ జాతిలోని ఒక భాగం, ఓమిక్రాన్ వేరియంట్‌లోని ఒక భాగాన్ని కలపడం ద్వారా తయారు చేసిన వ్యాక్సిన్. దీని ద్వారా ఇన్ఫెక్షన్ నుంచి మరింత రక్షణ పొందవచ్చు. ఇది నిజానికి బూస్టర్ డోస్ అధునాతన వెర్షన్. భవిష్యత్తులో కరోనా తీవ్రతను పరిశీలించడం ద్వారా మాత్రమే ఇప్పుడు కొత్త వ్యాక్సిన్‌లను అభివృద్ధి చేయవచ్చు. 

కోవిడ్ -19 వ్యాక్సిన్ మనదేశంలో జనవరి 2021లో ప్రారంభించారు. ఇప్పటివరకు 74 శాతం మంది భారతీయులు మొదటి డోస్ తీసుకున్నారు. 68 శాతం మంది రెండవ డోస్ తీసుకున్నారు. భారత జనాభాలో కేవలం 27 శాతం మంది మాత్రమే మూడో డోస్‌ను తీసుకోవడం ఆందోళన కలిగించే విషయం. మరోసారి కొత్త వేరియంట్ ప్రమాదం ముప్పు పొంచిన ఉన్న తరుణంలో నాల్గో డోస్‌కు మరింత సమయం పట్టే అవకాశం ఉంటుంది. 

బీఎఫ్‌ 7 కేసుల నమోదు నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆరోగ్య మంత్రిత్వ శాఖ సూచించింది. జలుబు, ఫ్లూ లక్షణాలు ఉంటే వెంటనే పరీక్షలు చేయించుకోవాలని చెప్పింది. సామాజిక దూరాన్ని పాటించాలని.. బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ ధరించాలని కోరింది.

Also Read: Telangana Health Director: ఏసు క్రీస్తు వల్లే కరోనా నయం.. వివాదంలో డీహెచ్ శ్రీనివాసరావు 

Also Read: RRR For Oscars : షార్ట్ లిస్ట్‌లో నాటు నాటు.. కీరవాణికి ఆస్కార్ అవార్డు?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News