Actor Chalapathi Rao Final Rites Update: తెలుగు సినిమా పరిశ్రమలో వరుస విషాదాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ మరణ వార్త ఇంకా జీర్ణించుకోకముందే మరో సీనియర్ నటుడు చలపతిరావు తన 79 ఏళ్ల వయసులో కన్నుమూశారు. వయోభారం రీత్యా గత కొంతకాలంగా పూర్తిగా సినిమాలకు దూరమై రెస్ట్ తీసుకుంటున్న ఆయన కార్డియాక్ అరెస్ట్ కావడంతో కన్నుమూశారు.
గతంలో చలపతిరావు శ్రీనగర్ కాలనీలో నివాసం ఉండేవారు, కానీ ప్రస్తుతం అనారోగ్యంతో బాధపడుతున్న నేపథ్యంలో తన కుమారుడు రవిబాబు నివాసంలోనే ఉంటున్నారు. రవిబాబు హైదరాబాద్ బంజారాహిల్స్ లోని ఎమ్మెల్యే కాలనీలో నివాసం ఉంటున్నారు అయితే రవిబాబుతో పాటు మరో ఇద్దరు కుమార్తెలు కూడా చలపతిరావుకు సంతానం. వారిద్దరు కూడా వృత్తిరీత్యా అమెరికాలో నివాసం ఉంటున్నారు వారు, అమెరికా నుంచి హైదరాబాద్ వచ్చిన తర్వాత చలపతిరావు అంత్యక్రియలు జరిగే అవకాశం ఉందని ముందు నుంచి ప్రచారం జరిగింది.
ఈ విషయాన్ని ఖరారు చేస్తూ రవిబాబు కుమారుడు బుధవారం రోజున మహాప్రస్థానంలో చలపతిరావు అంత్యక్రియలు జరుగుతాయని వెల్లడించారు. ఈ రోజు మధ్యాహ్నం వరకు ఆయన భౌతిక కాయాన్ని రవిబాబు నివాసంలోని అభిమానుల సినీ పరిశ్రమ పెద్దల సందర్శనార్థం ఉంచి మధ్యాహ్నం మూడు గంటల తర్వాత ఆయన పార్థివ దేహాన్ని ఫిలింనగర్ మహా ప్రస్థానంలోని ఫ్రీజర్ లో ఉంచుతామని వెల్లడించారు.
ప్రస్తుతానికి అయితే సినీ పరిశ్రమ నుంచి పెద్దలు ఎవరూ కూడా చలపతిరావు నివాసానికి చేరుకోలేదు. తెల్లవారుజామున ఆయన మరణించినట్లుగా వార్తలు రావడంతో ఇప్పుడు ఒక్కరొకరుగా సినీ పరిశ్రమ నుంచి పెద్దలు తమ్మారెడ్డి చలపతిరావు నివాసానికి చేరుకుంటున్నారు. ఎన్టీఆర్ తో సమకాలికుడైన చలపతిరావు ఎన్టీఆర్ వర్గానికి చెందిన వ్యక్తిగా పేరు ఉండేది. ఎన్టీఆర్ ప్రోత్సాహంతోనే సినీ పరిశ్రమలో చలపతిరావు ఎదిగారని చెప్పాలి.
ఒకరకంగా ఇద్దరు కూడా పామర్రు మండలానికి చెందిన వ్యక్తులే కావడంతో ఎన్టీఆర్ చలపతిరావు మీద ప్రత్యేక ప్రేమ కనబరుస్తూ ఉండేవారని అప్పటి వారంతా చెబుతూ ఉంటారు. ఎన్టీఆర్ కు సన్నిహితంగా మెలిగిన అప్పటి వారిలో ఒకరైన చలపతిరావు కన్నుమూయడం అటు నందమూరి అభిమానులకు కూడా తీరని శోకం అనే చెప్పాలి. కేవలం ఎన్టీఆర్ మాత్రమే కాదు తర్వాత బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, తారక రత్న వంటి వారితో కూడా చలపతిరావు అనేక సూపర్ హిట్ సినిమాల్లో నటించారు.
Also Read: Chalapathi Rao Death: టాలీవుడ్లో మరో తీవ్ర విషాదం.. సీనియర్ నటుడు చలపతి రావు మృతి!
Also Read: Chalapathi Rao: చలపతి రావు జీవితమంతా విషాదాలే.. ఆ టైంలో సూసైడ్ చేసుకోవాలనుకున్నారట!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook.