UP Fire Accident: యూపీలో అగ్ని ప్రమాదం.. ఒకే కుటుంబంలో ఐదుగురు మృతి!

5 members of family dies in Uttar Pradesh Fire Accident. ఉత్తర్ ప్రదేశ్‌లో తీవ్ర విషాదం నెలకొంది. మంగళవారం ఓ ఇంట్లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మరణించారు.   

Written by - P Sampath Kumar | Last Updated : Dec 28, 2022, 08:24 AM IST
  • యూపీలో అగ్ని ప్రమాదం
  • ఒకే కుటుంబంలో ఐదుగురు మృతి
  • ఒక మహిళతో పాటు ముగ్గురు మైనర్లు
UP Fire Accident: యూపీలో అగ్ని ప్రమాదం.. ఒకే కుటుంబంలో ఐదుగురు మృతి!

5 members of family dies in Uttar Pradesh Fire Accident: ఉత్తర్ ప్రదేశ్‌లో తీవ్ర విషాదం నెలకొంది. మంగళవారం (డిసెంబర్ 27) ఓ ఇంట్లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మరణించారు. మృతుల్లో ముగ్గురు మైనర్‌లు కూడా ఉన్నారు. ఈ ఘటన మౌ జిల్లాలోని షాపూర్ గ్రామంలో చోటుచేసుకుంది. అగ్నిమాపక  సిబ్బంది మంటలను ఆర్పి మృతులను బయటికి తీశారు. కోపగంజ్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. 

మౌ జిల్లా కోజగంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని షాపూర్ గ్రామంలో ఓ ఇంట్లో మంగళవారం భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. మంటలు భారీగా ఎగిసిపడ్డాయి. మంటలతో పాటుగా దట్టమైన పొగ కూడా అలముకుంది. మంటలు, పొగ దాటికి ఇంట్లో ఉన్న ఐదుగురు మృతి చెందారు. ఈ అగ్ని ప్రమాదంలో ఒక మహిళతో పాటు ముగ్గురు మైనర్లు, మరో వ్యక్తి మరణించారు. ఈ ఐదుగురు ఒకే కుటుంబానికి చెందిన వారు. 

స్థానికుల సమాచారం మేరకు ప్రమాదం జరిగిన వెంటనే ఫైర్ సిబ్బంది, వైద్యం బృందం సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మంటలను ఆర్పి మృతదేహాలను వెలికితీశారు. కోపగంజ్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. షాపూర్ గ్రామం అగ్ని ప్రమాదంలో ఒకే కుటుంబంలో ఐదుగురు మృతి చెందారని జిల్లా కలెక్టర్ అరుణ్ కుమార్ వెల్లడించారు. స్టవ్ వెలగించడం వలనే ఈ అగ్ని ప్రమాదం జరిగినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. చనిపోయిన ఒక్కో వ్యక్తికి రూ.4 లక్షల సాయం యూపీ ప్రభుత్వం ప్రకటించింది.

Also Read: Earthquake In Uttarakhand: ఉత్తరకాశీలో భూకంపం.. రిక్టర్ స్కేలుపై 3.1 తీవ్రతగా నమోదు! నేపాల్‌లో కూడా  

Also Read: Today Gold Price: బంగారం ప్రియులకు ఊరట.. తెలుగు రాష్ట్రాల్లో నేటి పసిడి రేట్లు ఇలా!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook.

Trending News