LIC Merger: కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఈ నాలుగు ప్రభుత్వ బీమా కంపెనీలు ఎల్‌ఐసీలో విలీనం..!

LIC Merger Companies: కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. దేశంలోని నాలుగు ప్రభుత్వ సాధారణ బీమా కంపెనీలను ఎల్‌ఐసీలో విలీనం చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. పూర్తి వివవరాలు ఇలా..   

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 30, 2022, 07:36 AM IST
LIC Merger: కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఈ నాలుగు ప్రభుత్వ బీమా కంపెనీలు ఎల్‌ఐసీలో విలీనం..!

LIC Merger Companies: దేశంలో ఇప్పటికే అనేక ప్రభుత్వ సంస్థలు ప్రైవేటీకరణ లేదా విలీన దిశగా అడుగులు వేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా దేశంలోని నాలుగు ప్రభుత్వ సాధారణ బీమా కంపెనీలను ఎల్‌ఐసీలో విలీనం చేయవచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి. వీటిలో నేషనల్ ఇన్సూరెన్స్, న్యూ ఇండియా అస్యూరెన్స్, ది ఓరియంటల్ ఇన్సూరెన్స్, యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీలు ఉన్నాయి. ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ (ఐఆర్‌డీఎ) చట్టం 1999, బీమా చట్టం 1938 ప్రకారం దీనిని సవరించాలని ప్రతిపాదించినట్లు వ్యాపార నిపుణులు చెబుతున్నారు.

ప్రతిపాదిత సవరణలో ఏం ఉంది..?

ప్రతిపాదిత సవరణలు దేశంలో లైఫ్, నాన్-లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలను విక్రయించడానికి ఒకే ఒక గుర్తింపు పొందిన కంపెనీ ఉండాలి. ఇది అవసరమైన కనీస మూలధనాన్ని సూచించడం ద్వారా చట్టబద్ధమైన పరిమితులను తొలగించడానికి బీమా నియంత్రణను సులభతరం చేస్తుంది. ఎల్‌ఐసీలో మరో వ్యవసాయ బీమా కంపెనీని కూడా విలీనం చేసే అవకాశం ఉందని సమాచారం.

ఈ అంశంపై ఓ సీనియర్ అధికారి మాట్లాడుతూ.. వ్యూహాత్మక రంగాల విషయంలో కేవలం నాలుగు కంపెనీలు మాత్రమే ప్రభుత్వంగా ఉండగలవని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గతంలో ప్రకటించారని చెప్పారు. అంటే ఈ విధంగా ప్రభుత్వం తన నాలుగు జీవితేతర బీమా కంపెనీలను ఎల్‌ఐసీతో విలీనం చేయవచ్చన్నారు. ఈ కంపెనీలను ఎల్‌ఐసీలో విలీనం చేయాలని ఆయా కంపెనీల ఉద్యోగులు కూడా డిమాండ్ చేస్తున్నారు.

మరోవైపు ఎల్‌ఐసీలో ఇప్పుడు ప్రైవేట్‌ రంగ వ్యక్తులకు చైర్మన్‌గా అవకాశం దక్కుతుందని పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. 66 ఏళ్లలో తొలిసారిగా ఎల్‌ఐసీ నియంత్రణ ప్రైవేట్ చైర్మన్ చేతుల్లోకి వెళ్లడం గమనార్హం. ఇప్పటివరకు ఉన్న రూల్ ప్రకారం కంపెనీ ఎండీనే చైర్మన్‌గా ఉంటున్నారు.

Also Read: Pele Death: లెజెండరీ ఫుట్‌బాల్ ప్లేయర్ పీలే కన్నుమూత.. శోకసంద్రంలో క్రీడా ప్రపంచం

Also Read: Bandla Ganesh Tounge Slip: ధమాకా సక్సెస్ మీట్లో ‘బూతు’ జారిన బండ్ల.. ఇప్పుడేమో ఇలా!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News