Malavya Rajyog: 2023లో 'మాలవ్య రాజయోగం'.. ఈ రాశులకు తిరుగులేని అదృష్టం...

Malavya Rajyog In Horoscope: ఆస్ట్రాలజీ ప్రకారం, శుక్రుని సంచారం వల్ల మాళవ్య రాజయోగం ఏర్పడబోతోంది. ఈ రాజయోగం 3 రాశుల వారికి శుభప్రదంగా ఉంటుంది.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Dec 31, 2022, 10:18 AM IST
Malavya Rajyog: 2023లో 'మాలవ్య రాజయోగం'.. ఈ రాశులకు తిరుగులేని అదృష్టం...

Malavya Rajyog In Meen 2023: నూతన సంవత్సరంలో కొన్ని ముఖ్యమైన గ్రహాలు తమ రాశులను మార్చనున్నాయి. అంతేకాకుండా ఈ గ్రహాలు కొన్ని యోగాలను కూడా ఏర్పరచనున్నాయి. ఫిబ్రవరి 15న ఐశ్వర్యాన్ని ఇచ్చే శుక్రుడు మీన రాశిలో సంచరించనున్నాడు. దీని కారణంగా అరుదైన మాళవ్య రాజయోగం ఏర్పడోబోతుంది. ఈ యోగ ప్రభావం వల్ల మూడు రాశులవారు అపారమైన ధనాన్ని పొందుతారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మీరు విజయం సాధిస్తారు. ఆ రాశులు ఏవో తెలుసుకుందాం.

మీన రాశిచక్రం (Pisces): మాలవ్య రాజయోగం మీకు శుభప్రదంగా ఉంటుంది. ఎందుకంటే మీ సంచార జాతకంలో లగ్న గృహంలో ఈ యోగం ఏర్పడబోతోంది. ఆఫీసులో మీ పనికి ప్రశంసలు దక్కుతాయి. మీకు సీనియర్, జూనియర్ల మద్దతు లభిస్తుంది. పెళ్లికాని యువతీ యువకులకు వివాహం కుదిరే అవకాశం ఉంది. లైఫ్ పార్టనర్ సపోర్టు మీకు లభిస్తుంది. భాగస్వామ్యంతో చేసే వ్యాపారంలో లాభాలు ఉంటాయి. ఈ రాశివారు ఆశించిన ఫలితాలు పొందుతారు. 

కుంభం (Aquarius): మాలవ్య రాజయోగం మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే ఈ యోగం మీ రాశి నుండి ద్వితీయ స్థానంలో ఏర్పడుతుంది. అందుకే ఈ సమయంలో మీరు ఆకస్మిక ధనాన్ని పొందుతారు. వ్యాపారులు భారీగా లాభపడతారు. ఆఫీసులో మీకు సమయం అద్భుతంగా ఉంటుంది. పోటీపరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు విజయం సాధిస్తారు. శ్రమకు తగ్గ ఫలితాలను పొందుతారు. ఇంట్లో శుభకార్యం జరిగే అవకాశం ఉంది. 

వృషభ రాశి (Taurus): మాలవ్య రాజయోగం మీకు అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే మీ రాశి నుండి దశమ స్థానంలో ఈ యోగం ఏర్పడబోతోంది. మీరు కెరీర్ లో అద్భుతమైన పురోగతిని సాధిస్తారు. వ్యాపారవేత్తలు మంచి లాభాలను పొందతారు. ఏదైనా అస్తి లేదా వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది. పార్టనర్ షిప్ తో చేసే వ్యాపారంలో భారీగా లాభాలు ఉంటాయి. ఉద్యోగులకు ఈ సమయం బాగుంటుంది. 

Also Read: Grah Gochar 2023: తండ్రీ కొడుకులు ఈ 3 రాశులవారిని 2023లో ధనవంతులను చేస్తారు.. ఇందులో మీరున్నారా? 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook.

Trending News