Best Cruiser Bikes in India under 2 lakhs: భారతదేశంలో ప్రస్తుతం క్రూయిజర్ మోటార్సైకిల్లకు మంచి డిమాండ్ ఉంది. 'కోమాకి రేంజర్ ఎలక్ట్రిక్ క్రూయిజర్' భారతదేశపు మొట్టమొదటి ఎలక్ట్రిక్ క్రూయిజర్ మోటార్‌సైకిల్‌గా వచ్చింది. క్రూయిజర్ మోటార్సైకిల్లు ఎక్కువగా సేల్స్ కావడానికి అసలు కారణం ఒక్కటే.. అదే రైడర్ ఎక్కువగా అలసిపోకుండా ఉండడం. సౌకర్యవంతమైన ప్రయాణం ఉంటుంది. ఈ నేపథ్యంలో దేశంలో రూ. 2 లక్షల లోపు విక్రయానికి అందుబాటులో ఉన్న కొన్ని క్రూయిజర్ మోటార్‌సైకిళ్ల గురించి ఓసారి చూద్దాం.
Bajaj Avenger 160 Street:
బజాజ్ నుంచి అత్యంత సరసమైన క్రూయిజర్ 'అవెంజర్ 160 స్ట్రీట్'. ఇది సౌకర్యవంతమైన రైడింగ్ పొజిషన్‌ను కలిగి ఉంటుంది. దాంతో రైడర్ సౌకర్యవంతంగా (నిటారుగా) కూర్చోవచ్చు. ఇది 14bhp మరియు 13.7Nm టార్క్‌ను ఉత్పత్తి చేసే 160cc ఇంజన్‌తో నడుస్తుంది. ఈ క్రూయిజర్ ముందువైపు 17-అంగుళాల అల్లాయ్ వీల్ మరియు వెనుకవైపు 15-అంగుళాల చిన్న అల్లాయ్ వీల్ ఉంటుంది. దీని ధర రూ. 1.12 లక్షలు.
Bajaj Avenger Cruise 220:
అవెంజర్ స్ట్రీట్ 160లో అతి పెద్ద వెర్షన్ 'బజాజ్ అవెంజర్ క్రూయిస్ 220'. ఇది పెద్ద ఇంజిన్ మరియు నవీకరించబడిన స్టైలింగ్‌తో వస్తుంది. ఇది 18.7bhp గరిష్ట శక్తిని మరియు 17.5Nm గరిష్ట టార్క్ అవుట్‌పుట్ చేసే 220cc. సింగిల్-సిలిండర్, ఆయిల్-కూల్డ్ ఇంజన్ ద్వారా ఈ బైక్ నడుస్తుంది. దీని ధర రూ. 1.38 లక్షలు.
Royal Enfield Hunter 350:
'రాయల్ ఎన్ఫీల్డ్ హంటర్ 350' ప్రస్తుతం కంపెనీ నుంచి వస్తున్న చౌకైన బైక్. అత్యధికంగా అమ్ముడవుతున్న మోటార్‌సైకిళ్లలో ఇది ఒకటి. రాయల్ ఎన్ఫీల్డ్ హంటర్ బైక్ 350 349cc, సింగిల్ సిలిండర్, ఎయిర్ మరియు ఆయిల్-కూల్డ్, ఫ్యూయల్-ఇంజెక్టెడ్ ఇంజన్‌తో వస్తుంది. ఈ మోటార్‌సైకిల్ ధర రూ. 1.50 లక్షలు.
Yezdi Roadster:
యెజ్డీ రోడ్‌స్టర్ 334cc, సింగిల్-సిలిండర్, లిక్విడ్-కూల్డ్, ఫ్యూయల్-ఇంజెక్ట్ చేయబడిన DOHC ఇంజన్‌తో వస్తుంది. ఇది 7,300 RPM వద్ద 28bhp శక్తిని మరియు 6,500 RPM వద్ద 29 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ మోటార్‌సైకిల్ ధర రూ. 2 లక్షలు.
Komaki Ranger:
కోమాకి రేంజర్ ఓ ఎలక్ట్రిక్ క్రూయిజర్ బైక్. ఇది 4kWh బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. దీని ఎలక్ట్రిక్ మోటార్ 5.3bhp శక్తిని ఉత్పత్తి చేస్తుంది. పూర్తి ఛార్జింగ్ చేస్తే 180-200 కి.మీ ప్రయాణించవచ్చు. బ్లూటూత్ కనెక్టివిటీ కూడా ఇందులో ఉంది. ఈ క్రూయిజర్ బైక్ ధర రూ. 1.74 లక్షలు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook.