AP Politics: ఏపీలో బీఆర్ఎస్ ఎంట్రీతో గుబులు.. ఎవరికి నష్టం..?

BRS Party Entry In AP: ఏపీలో రాజకీయ ముఖ చిత్రం ఎలా ఉంది..? ఏ ఏ పార్టీలకు మైలేజ్‌ ఉంది..? బీఆర్ఎస్‌ రాక ఎవరికీ లాభం..ఏ పార్టీకి నష్టం..? టీడీపీ, జనసేన పార్టీలను దెబ్బతీసేందుకే ఆ పార్టీ వస్తోందా..? బీఆర్ఎస్‌పై కాపు నేతలు ఏమంటున్నారు..? ఆంధ్రప్రదేశ్‌లో కేసీఆర్ ఎంట్రీపై కథనం..  

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 4, 2023, 06:43 AM IST
AP Politics: ఏపీలో బీఆర్ఎస్ ఎంట్రీతో గుబులు.. ఎవరికి నష్టం..?

BRS Party Entry In AP: ఏపీ రాజకీయాలు హీటెక్కుతున్నాయి. ఏడాదిన్నరలోపు ఎన్నికలు జరగబోతుండడంతో అన్ని పార్టీలు ఇప్పటి నుంచే వ్యూహాలకు పదును పెడుతున్నాయి. రాబోయే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని అధికార, విపక్షాలు పావులు కదుపుతున్నాయి. తాజాగా ఏపీ రాజకీయాల్లోకి బీఆర్ఎస్‌ చేరింది. దీంతో త్రిముఖ పోటీ తప్పదని విశ్లేషకులు చెబుతున్నారు. సీఎం కేసీఆర్ సమక్షంలో కీలక నేతలు తోట చంద్రశేఖర్, రావెల కిశోర్‌బాబుతోపాటు ఇతర నేతలు కారెక్కారు. దీంతో ఏపీ రేసులోకి బీఆర్ఎస్‌ దూసుకొచ్చింది.

ఇప్పటికే వైసీపీ, టీడీపీ మధ్య పొలిటికల్ వార్ కొనసాగుతోంది. నువ్వానేనా అన్నట్లు రెండు పార్టీలు ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకుంటున్నారు. సంక్షేమ పథకాలను ఇంటింటికి తీసుకెళ్లే పనిలో అధికార పార్టీ ఉంది. రాష్ట్రానికి ఇదేం ఖర్మ, బాదుడే బాదుడు అంటూ ప్రజలకు టీడీపీ చేరువ అవుతోంది. ఇప్పటికే నారా లోకేష్ కూడా పాదయాత్రకు పాదయాత్ర రూట్ మ్యాప్ కూడా అయింది. ఇటు జనసేన సైతం దూకుడు పెంచింది. కౌలు రైతుల సమస్యలపై ప్రజా పోరాటం చేస్తోంది. ఆత్మహత్యలు చేసుకున్న కౌలు రైతులకు బాసటగా నిలుస్తున్నారు పవన్ కళ్యాణ్. త్వరలోనే రాష్ట్రవ్యాప్త పర్యటనకు ఆయన సిద్ధమవుతున్నారు. 

తాజాగా బీఆర్ఎస్ ఎంట్రీ ఇవ్వడంతో ఇకపై ఏపీ రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయన్న చర్చ జరుగుతోంది. ఏపీలోనూ కేసీఆర్‌కు మంచి ఫాలోయింగ్ ఉంది. 2019 ఎన్నికల ముందు ఆయన రాష్ట్రానికి వచ్చిన సమయంలో ఇదే రుజువైంది. అక్కడక్కడ ఇప్పటికీ కేసీఆర్ ఫ్లెక్సీలు, హోర్డింగ్‌లు కనిపిస్తుంటాయి. అంతలా గులాబీ బాస్‌కు అభిమానులు ఉన్నారు. ఇప్పుడు ఏపీలో బీఆర్ఎస్‌ బ్రాంచ్‌ వచ్చేసింది. రాష్ట్ర బీఆర్ఎస్‌ అధ్యక్షుడిగా తోట చంద్రశేఖర్‌ను కేసీఆర్ నియమించారు. మొన్నటి వరకు జనసేనలో ఉన్న తోట చంద్రశేఖర్‌కు ఏపీ రాజకీయాలపై అవగాహన ఉంది. అది కలిసి వస్తుందని బీఆర్ఎస్ భావిస్తోంది. ఇటు మాజీ మంత్రి రావెల సేవలను జాతీయ స్థాయిలో వినియోగించుకుంటామని ఇప్పటికే కేసీఆర్ ప్రకటించారు.

బీఆర్ఎస్ ఎంట్రీతో ఎవరికీ లాభం.. ఏ పార్టీకి నష్టం అన్న చర్చ సాగుతోంది. టీడీపీ, జనసేన పార్టీలను దెబ్బతీసేందుకే ఆ పార్టీ వస్తోందన్న ప్రచారం ఉంది. ఇదంతా సీఎం జగన్‌ స్కెచ్ అంటూ విశ్లేషించుకుంటున్నారు. కాపు ఓట్లను చీల్చించేందుకే పార్టీ వచ్చిందని వాదన ఉంది. ఏపీలో బీఆర్ఎస్‌కు అంత సీన్ లేదన్న విమర్శలూ ఉన్నాయి. రాష్ట్రానికి ముక్కలు చేసిన వ్యక్తికి ఓట్లు పడతాయా అని కొందరు వాదిస్తున్నారు. ఏదిఏమైనా ఏపీలో బీఆర్ఎస్‌ తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. జాతీయ నేతగా ఎదగాలనుకుంటున్న కేసీఆర్‌కు ఏపీ కీలకంగా  మారనుంది. ఇక్కడ కొంతైనా ప్రభావం చూపిస్తే.. ఇతర రాష్ట్రాల్లో పాగా వేసేందుకు అవకాశం ఉంటుంది. 

Also Read: IND vs SL: ఆఖరి ఓవర్లో హార్ధిక్ పాండ్యా డేరింగ్ స్టెప్.. టీమిండియా థ్రిల్లింగ్ విక్టరీ  

Also Read: Nagababu: ఏపీలో ఉన్నది ప్రభుత్వమా, రాచరిక పాలనా..జీవో నెంబర్ 1పై కోర్టుకు వెళ్తాం

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News