Flipkart vs Customer Legal Fight: ఫ్లిప్‌కార్ట్‌లో స్మార్ట్ ఫోన్ కోసం ఆర్డర్ చేసిన ఒక కస్టమర్.. అందుకు అవసరమైన మొత్తాన్ని కూడా ఫ్లిప్‌కార్ట్‌కి చెల్లించారు. ఇది జరిగి సరిగ్గా ఏడాది అవుతోంది. కానీ ఫోన్ మాత్రం ఇప్పటివరకు డెలివరి కాలేదు. సంక్రాంతి సందర్భంగా గతేడాది జనవరి 15న కొత్త ఫోన్ కొనుగోలు చేసిన మహిళకు ఫోన్ చేతికి రాకపోగా.. ఫోన్ కోసం ఖర్చు చేసిన మొత్తాన్ని నెలా నెలా ఇఎంఐలు చెల్లిస్తూ మెంటల్ టెన్షన్ పడకతప్పలేదు. దీంతో ఆ కస్టమర్ కన్సూమర్ ఫోరంను ఆశ్రయించిన ఘటన బెంగుళూరులో చోటుచేసుకుంది.
బెంగళూరు రాజాజీనగర్కి చెందిన జే దివ్యశ్రీ అనే మహిళకు ఫ్లిప్‌కార్ట్ చేతిలో ఈ చేదు అనుభవం ఎదురైంది. ఎన్నోసార్లు ఫ్లిప్‌కార్ట్ కస్టమర్ కేర్ని సంప్రదించినప్పటికీ ప్రయోజనం లేకుండాపోయిందని చెబుతున్న ఆమె.. చివరి అస్త్రంగా ఫ్లిప్‌కార్ట్‌పై న్యాయపోరాటం చేయడానికే సిద్ధపడ్డారు. బెంగళూరు కన్సూమర్ ఫోరంలో ఫ్లిప్‌కార్ట్‌పై ఫిర్యాదు చేసి తనకు జరిగిన అన్యాయం గురించి విన్నవించుకున్నారు.
బాధితురాలి ఫిర్యాదుపై విచారణ చేపట్టిన కన్సూమర్ ఫోరం.. ఫ్లిప్‌కార్ట్‌ని విచారణకు హాజరు కావాల్సిందిగా ఆదేశిస్తూ నోటీసులు పంపించింది. అయితే ఫ్లిప్‌కార్ట్ సంస్థ కన్సూమర్ ఫోరం నోటీసులను సైతం లెక్కచేయకుండా విచారణకు గైర్హాజరైనట్టు తెలుస్తోంది. దీంతో ఫ్లిప్‌కార్ట్ తీరుపై మరింత ఆగ్రహం చెందిన కన్సూమర్ ఫోరం.. కస్టమర్‌తో ఫ్లిప్‌కార్ట్ తీరును తప్పుపడుతూ కస్టమర్‌కి 42,500 రూపాయలు జరిమానా చెల్లించాల్సిందిగా ఫ్లిప్‌కార్ట్‌ని ఆదేశించింది.
ఫ్లిప్‌కార్ట్‌కి ఫోరం విధించిన జరిమానాలో 20 వేల రూపాయలు కేవలం జరిమానా కాగా.. మరో 10 వేల రూపాయలు ఆమె న్యాయ పోరాటం కోసం ఖర్చు చేసిన లీగల్ ఎక్స్పెన్సెస్ కింద చెల్లించాల్సిందిగా కన్సూమర్ ఫోరం స్పష్టంచేసింది. మిగతా రూ. 12,500 ఫోన్ కోసం కస్టమర్ చెల్లించిన మొత్తంగా ఫోరం వెల్లడించింది. ఎం శోభ చైర్‌పర్సన్‌గా, రెణుకా దేవి సభ్యురాలిగా ఉన్న కన్సూమర్ ఫోరం ఈ తీర్పు వెలువరించింది.
ఇది కూడా చదవండి : SBI Loans: గుడ్ న్యూస్.. ఏ సెక్యురిటీ లేకుండానే 10 లక్షల రుణం ఇస్తోన్న ఎస్బీఐ
ఇది కూడా చదవండి : kia EV9 Specs: కొత్త కారు కొంటున్నారా ? కొంచెం ఆగండి
ఇది కూడా చదవండి : Tata Nexon SUV Prices: మారుతి, మహింద్రాలకు చమటలు పట్టిస్తున్న ఎస్యూవి.. జనం కళ్లు మూసుకుని కొంటున్న ఎస్యూవి కారు ఏదో తెలుసా ?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook