Laurus Labs Donates Rs 4 Crore to Nadu Nedu: రాష్ట్రంలో ప్రభుత్వం చేపట్టిన నాడు-నేడు పథకానికి ప్రముఖ పరిశోధన ఆధారిత ఫార్మాస్యూటికల్ తయారీ, బయోటెక్ కంపెనీ లారస్ ల్యాబ్స్ రూ.4 కోట్ల విరాళం ప్రకటించింది. దీంతోపాటు పారిశ్రామిక ప్రాంతమైన అనకాపల్లిలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఆధునాతనమైన, అన్ని అత్యాధునిక సౌకర్యాలతో కూడిన కాలిన గాయాలకు సంబంధించి ఒక ప్రత్యేక వార్డు నిర్మాణానికి కూడా 5 కోట్ల రూపాయలు అందిస్తామని కంపెనీ వ్యవస్థాపకుడు, సీఈఓ డా.సత్యనారాయణ చావా తెలిపారు. సోమవారం ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కలిసిన ఆయన రూ.4 కోట్ల చెక్‌ను అందజేశారు. నాడు –నేడు పథకం కోసం లారస్ ల్యాబ్స్ ఈ విరాళాన్ని అందించడం ఇది మూడవసారి కావడం విశేషం.
లారస్ ల్యాబ్స్, రాష్ట్రంలో విద్యా మౌలిక సదుపాయాలను పెంపొందించడానికి ‘నాడు – నేడు‘ కార్యక్రమం కింద రూ. 4 కోట్ల విరాళం. అనకాపల్లిలోని ప్రభుత్వ ఆసుపత్రిలో కాలిన గాయాలకు సంబంధించి ఒక ప్రత్యేక వార్డు నిర్మాణానికి రీ.5 కోట్లు అందిస్తామని కంపెనీ CEO డా. సత్యనారాయణ చావా తెలిపారు. pic.twitter.com/Mj69BVDGzu
— CMO Andhra Pradesh (@AndhraPradeshCM) January 9, 2023
పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను పెంపొందించడానికి వైసీపీ ప్రభుత్వం 'నాడు – నేడు' కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. సీఎం జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టగానే.. 2019 నవంబర్ 14న ఈ పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం కింద రాష్ట్రంలోని అనేక ప్రభుత్వ పాఠశాలల రూపు రేఖలు మారిపోయాయి. స్కూళ్లకు కొత్త రూపాన్ని సంతరించుకున్నాయి. ముఖ్యంగా గవర్నమెంట్ స్కూళ్లలో డ్రాపౌట్ రేటును తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకువచ్చింది.
నాడు-నేడు కింద ప్రభుత్వ పాఠశాల్లో టాయిలెట్ల నిర్మాణం చేపట్టారు. తరగతి గదుల్లో ఫ్యాన్లు, ట్యూబ్ లైట్లతో వెలుగులు నింపారు. అంతేకాకుండా తాగునీటి సరఫరా, విద్యార్థులు, సిబ్బంది కోసం ఫర్నిచర్ ఏర్పాటు చేస్తోంది. స్కూళ్లకు పెయింటింగ్ వేయించి.. పెద్ద, చిన్న మరమ్మతులను ప్రభుత్వం చేయించింది. పాఠశాల చుట్టూ కంపౌండ్ నిర్మాణం, ఇంగ్లిష్ ల్యాబ్స్‌ను నిర్మిస్తోంది.
Also Read: Jasprit Bumrah: టీమిండియాకు షాక్.. వన్డే సిరీస్‌కు బుమ్రా దూరం..!
Also Read: Income Tax: పన్ను చెల్లింపుదారులకు ముఖ్య గమనిక.. ఏ స్లాబ్‌లో ఎంత ట్యాక్స్ పే చేయాలంటే..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి