2023 Maruti Suzuki Jimny: మారుతి సుజుకి నుంచి జిమ్నీ5 డోర్.. ఆ రెండు కంపెనీల ఎస్‌యూవీలకు పోటీ తప్పదా ?

2023 Maruti Suzuki Jimny 5-door: మహీంద్రా, టాటా కంపెనీల ఎస్‌యూవీలకు పోటీనిచ్చేందుకు మారుతి సుజుకి కొత్తగా లాంచ్ చేయబోతున్న వాహనమే ఈ మారుతి సుజుకి జిమ్ని 5 డోర్. చూడ్డానికి ఏక్ ధమ్ సాలిడ్ లుక్ ఉన్న జిమ్నీ వచ్చే నెలలోనే ఇండియన్ మార్కెట్‌లోకి ఎంట్రీ ఇస్తోంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 14, 2023, 06:30 AM IST
2023 Maruti Suzuki Jimny: మారుతి సుజుకి నుంచి జిమ్నీ5 డోర్.. ఆ రెండు కంపెనీల ఎస్‌యూవీలకు పోటీ తప్పదా ?

2023 Maruti Suzuki Jimny 5-door: మహీంద్రా, టాటా కంపెనీల ఎస్‌యూవీలకు పోటీనిచ్చేందుకు మారుతి సుజుకి కొత్తగా లాంచ్ చేయబోతున్న వాహనమే ఈ మారుతి సుజుకి జిమ్ని 5 డోర్. చూడ్డానికి ఏక్ ధమ్ సాలిడ్ లుక్ ఉన్న జిమ్నీ వచ్చే నెలలోనే ఇండియన్ మార్కెట్‌లోకి ఎంట్రీ ఇస్తోంది. ఆ పూర్తి వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం రండి.

2023 మారుతి సుజుకి జిమ్నీ 5-డోర్ లాంచింగ్ తేదీ, ధర
మారుతి సుజుకి డీలర్స్ చెబుతున్న వివరాల ప్రకారం మారుతి సుజుకి జిమ్నీ 5 డోర్ ఎస్‌యువి కారు ఫిబ్రవరి 11 న లాంచ్ కానున్నట్టు తెలుస్తోంది. ఈ ఎస్‌యువి కారు బుకింగ్ కోసం ఇప్పటికే దేశవ్యాప్తంగా ఉన్న అన్ని నెక్సా డీలర్‌షిప్‌లలో ఏర్పాట్లు వేగంగా జరిగిపోతున్నాయి. అంతేకాకుండా, జిమ్నీ బేసిక్ వేరియంట్ ధర రూ. 10 లక్షలుగా ఉండనుండగా.. గరిష్టంగా రూ. 12-13 లక్షల వరకు చేరుకునే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

2023 మారుతీ సుజుకి జిమ్నీ 5-డోర్ డైమెన్షన్స్
చూడ్డానికి కాంపాక్ట్‌గా కనిపించే జిమ్నీ పొడవు 3985 mm, వెడల్పు 1,645 mm, 1,720 mm ఎత్తు ఉంటుంది. వీల్‌బేస్ 2,590 మిమీ పొడవు, 210 మిమీ గ్రౌండ్ క్లియరెన్స్‌ కలిగి ఉంది. జిమ్నీలో బూట్ స్పేస్ 208 లీటర్లుగా ఉంది. 

2023 మారుతి సుజుకి జిమ్నీ 5-డోర్ డిజైన్
2023 మారుతీ సుజుకి జిమ్నీ 5-డోర్‌ను మొదటిసారి చూడగానే కాంపాక్ట్, సామర్థ్యం కలిగిన కార్లు గుర్తుకొస్తాయి. జిప్సీ ఫీలింగ్ గుర్తుకుతెస్తోంది. బాక్సీ డిజైన్‌ ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ఎవరి అభిరుచులకు అనుగుణంగా వారు ఎంచుకునే విధంగా వివిధ రంగుల్లో జిమ్నీ లాంచ్ కాబోతోంది.

2023 మారుతి సుజుకి జిమ్నీ 5-డోర్ ఇంటీరియర్స్ డిజైన్ 
మారుతి సుజుకి జిమ్నీ 5-డోర్ కారు లోపలి భాగంలో పెద్ద 9 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ యూనిట్ కలిగి ఉంది. మొదటి వరుస వరకు జిమ్నీ 3-డోర్ మోడల్‌తో సమానంగా ఉండగా... రెండో వరుసలో ఇద్దరు పెద్దలు కంఫర్ట్‌గా కూర్చోవడానికి అనువుగా ఉంది. తగినంత బూట్ స్పేస్ ఉంది. భారత ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన కనీస నిబంధనల్లో ఒకటైన 6 ఎయిర్‌బ్యాగ్స్‌తో పాటు హెడ్‌ల్యాంప్ వాషర్లు, హిల్ డిసెంట్ కంట్రోల్, హిల్ హోల్డ్ అసిస్ట్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే వంటి అధునాతన సౌకర్యాలన్నీ ఉన్నాయి.

2023 మారుతి సుజుకి జిమ్నీ 5-డోర్ ఫీచర్స్
1.5L 4-సిలిండర్ NA పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 104.8 PS పవర్ అవుట్‌పుట్‌ని జనరేట్ చేస్తుంది. అలాగే 134.2 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 5-స్పీడ్ MT 4-స్పీడ్ ATతో పని చేసే మారుతి సుజుకి జిమ్ని కోసం కారు లవర్స్ ఆసక్తిగా, ఆత్రుతతో ఎదురుచూస్తున్నారు.

ఇది కూడా చదవండి : iPhone 14 Price Offers: ఐఫోన్ 14 పై సంక్రాంతి ధమాకా.. 44 వేల భారీ డిస్కౌంట్ ఆఫర్

ఇది కూడా చదవండి : Aadhaar Card Important News: మీ ఆధార్ కార్డ్ లాక్ లేదా అన్‌లాక్ చేసుకోండిలా

ఇది కూడా చదవండి : Tata Punch Car Insurance: టాటా పంచ్ కారును ఇన్సూరెన్స్ కోసం ఓనర్ ఏం చేస్తున్నాడో చూడండి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

 

Trending News