Butta Bomma fame Arjun Das ఒక భాషలో హిట్ అయిన చిత్రాలను పక్క భాషల వాళ్లు రీమేక్ చేస్తుంటారు. కానీ నేటివిటీకి తగ్గట్టుగా సరైన మార్పులు చేర్పులు చేస్తేనే రీమేక్ అనేది వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు అలా తమిళంలో హిట్ అయిన సినిమాను తెలుగులోకి బుట్టబొమ్మ అని తీసుకొస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ , ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా ఈ 'బుట్ట బొమ్మ'ను నిర్మిస్తున్నాయి. ఈ చిత్రంలో అనిక సురేంద్రన్, సూర్య వశిష్ఠ, అర్జున్ దాస్ ప్రధాన పాత్రలు పోషిస్తుండగా.. శౌరి చంద్రశేఖర్ రమేష్ దర్శకుడిగా ఎంట్రీ ఇస్తున్నాడు.
బుట్టబొమ్మ సినిమా జనవరి 26న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ క్రమంలో హీరో అర్జున్ దాస్ మీడియాతో ముచ్చటించాడు. పెరుమాళ్ సినిమా తరువాత అవకాశాల కోసం చాలా కాలమే ఎదురుచూశాడట అర్జున్ దాస్.ఖైదీ, అంధఘారం, మాస్టర్ సినిమాల నుంచి కెరీర్ పీక్స్‌కు వెళ్లిందన్నట్టుగా, ముఖ్యంగా లోకేష్ కనగరాజ్ సినిమాలలో భాగం కావడం సంతోషంగా ఉందని చెప్పుకొచ్చాడు.
ఒకసారి నిర్మాత నాగ వంశీ ఫోన్ చేసి ఈ సినిమా గురించి చెప్పాడట. పిలిచి మరీ తనకు ఈ అవకాశం ఇచ్చాడని, కాకపోతే ఓ కండీషన్ కూడా పెట్టాడని తెలిపాడు. అందరూ తన వాయిస్ బాగుంటుందని అంటారని, అందుకే తెలుగులో ఓన్ డబ్బింగ్ చెప్పాల్సిందే అని ముందే కండీషన్ పెట్టాడట. అందుకే ఈ సినిమాకు తెలుగులో డబ్బింగ్ చెప్పుకున్నాడట అర్జున్ దాస్.
తెలుగు ప్రేక్షకుల నుంచి తనకు ఇంత ఆదరణ వస్తుందని ఊహించలేదట. ఒకసారి హైదరాబాద్‌లో ఒక మాల్కి వెళ్ళినప్పుడు చాలామంది తనను గుర్తు పుట్టి సెల్ఫీలు తీసుకున్నారట. షూటింగ్ కోసం వైజాగ్ వెళ్ళినప్పుడు అక్కడ లభించిన స్వాగతం అసలు మరచిపోలేని తెగ మురిసిపోయాడు అర్జున్ దాస్.
ప్రస్తుతం తాను అన్ని రకాల పాత్రలు చేయాలని అనుకుంటున్నాడట. నెగటివ్ రోల్స్ లో కూడా ఏదైనా కొత్తదనం ఉంటేనే చేస్తానని, భిన్న పాత్రలు పోషిస్తూ నటుడిగా ఇంకా నిరూపించుకోవాలి అనుకుంటున్నట్టుగా చెప్పుకొచ్చాడు. అయితే ఖైదీ తర్వాత ఎక్కువగా నెగటివ్ రోల్స్ వచ్చాయని తన జర్నీ గురించి వివరించాడు.
Also Read: Veera Simha Reddy Break even : మరీ ఇంత దారుణమా?.. చిరు మీద ఇంత కక్షా?.. బాలయ్య మీద అంత ప్రేమనా?
Also Read: Chiranjeevi : సెట్‌కు వెళ్లే ముందు ఇంట్లో వంట మనిషితో.. ఆసక్తికరమైన విషయాన్ని చెప్పిన చిరంజీవి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook