Yamaha plans to ReIntroduced Yamaha RX 100 with 150CC: యమహా ఆర్ఎక్స్ 100.. ఈ పేరు గురించి ప్రేత్యేకంగా పరిచయం అక్కర్లేదు. భారత్‌లో ఆర్ఎక్స్ 100 కంటే జనాదరణ పొందిన బైక్ మరొకటి లేదనే చెప్పాలి. అప్పట్లో ఈ బైక్ సృష్టించిన హంగామా అంతాఇంతా కాదు. వయసుతో సంబంధం లేకుండా.. ప్రతి ఒక్కరు ఈ బైక్‌ని నడిపి ఎంజాయ్ చేశారు. ముఖ్యంగా యువత ఈ బైక్ అంటే పిచ్చెక్కిపోతారు. యమహా ఆర్ఎక్స్ బైకులను నిలిపివేసి 25 సంవత్సరాలు దాటినా.. ఇప్పటికీ అక్కడక్కడ రోడ్డుపై దర్శనం ఇస్తూ ఉంటాయి. ఇంకొందరికి యమహా ఆర్ఎక్స్ 100 (Yamaha RX100) బైక్‌పై కన్ను ఉంటుంది. యమహా ఆర్ఎక్స్ 100 రీలాంచ్ కావాలని చాలా మంది కోరుకుంటున్నారు.
యమహా ఆర్ఎక్స్ 100 బైక్ 1985 నుంచి 1996 వరకు మార్కెట్లో కొనసాగింది. ఇప్పుడు మరోసారి యమహా కంపెనీ ఆర్ఎక్స్ 100ను లాంచ్ చేసే ప్రయత్నంలో ఉంది. మీడియా నివేదికల ప్రకారం.. కొంతకాలం క్రితం యమహా ఇండియా ప్రెసిడెంట్ ఇషిన్ చిహానా ఆర్ఎక్స్ 100 (Yamaha RX100 Re Launch) కోసం యమహా భవిష్యత్తు ప్రణాళికలను చేస్తుందని, అందుకే కంపెనీ ఇంకా RX100 మోనికర్‌ను ఉపయోగించలేదని వెల్లడించారు. అయితే పాత యమహా ఆర్ఎక్స్ 100 రెండు-స్ట్రోక్ ఇంజిన్‌పై ఆధారపడినందున.. దాన్ని రీట్రోఫిట్ చేయడం సాధ్యం కాదు. ఈ బైక్ కఠినమైన BS6 ఉద్గార నిబంధనలను అందుకోకపోవచ్చు.
యమహా ఆర్ఎక్స్ 100ని తిరిగి తీసుకువస్తే.. దానికి పెద్ద ఇంజన్ వస్తుంది. మీడియా కథనాల ప్రకారం.. కంపెనీ ఈ దిశగా ఆలోచిస్తోందట. అయితే ఏ ఇంజన్ వస్తుందనేదని ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. యమహా ప్రస్తుతం 125 cc, 150 cc మరియు 250 cc ఇంజిన్లను కలిగి ఉంది. వీటిలో దేనినైనా ఉపయోగించవచ్చు. 125 cc ఇంజిన్ లేదా 150 cc ఇంజిన్ ఉపయోగించడానికి అత్యధిక అవకాశాలు ఉన్నాయి.
యమహా ఆర్ఎక్స్ 100 రీలాంచ్కి ఇంకా చాలా సమయం పట్టే అవకాశం ఉంది. ఈ బైక్ కోసం ప్రజలు చాలా కాలం వేచి ఉండాల్సి వస్తుంది. పలు నివేదికల ప్రకారం.. యమహా కంపెనీ తన ఆర్ఎక్స్ 100ని 2025 లోపు లంచ్ చేయదట. 2026లో ప్లాన్ చేసిందని సమాచారం. అంటే ఇంకా మూడేళ్లు యమహా ఆర్ఎక్స్ 100 కోసం వేచి చూడాల్సి ఉంది. ఏదేమైనా ఈ బైక్ రీ లాంచ్ అవ్వడం బైక్ లవర్స్‌కు గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు.
Also Read: Cheapest New Honda Activa 2023: ఖరీదైన కార్ల ఫీచర్లతో.. సరికొత్త చౌకైన హోండా యాక్టివా లాంచ్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.